కేవలం రూ.4.69 లక్షలకే టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు.. మిడిల్‌క్లాస్‌కి ఈవీ కల నెరవేరింది! టాటా సంచలనం

దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్(Tata Motors) మరోసారి తన బలాన్ని చూపించింది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన, చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో EV అప్‌డేట్ వెర్షన్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో డిజైన్, ఫీచర్లు, ఇంటీరియర్ పరంగా గణనీయమైన మార్పులు చేసి, మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. కొత్త టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్ 2026 ప్రారంభ ధర రూ.6.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. మరింత అందుబాటు ధరలో EV అందించాలనే ఉద్దేశంతో, టాటా మోటార్స్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ఆప్షన్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ కింద టియాగో EV ధర మరింత తగ్గి కేవలం రూ.4.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ఈ స్కీమ్‌లో కి.మీకు ఖర్చు దాదాపుగా రూ.2.6 వరకు అవుతుందని సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ BaaS మోడల్ ద్వారా కస్టమర్లు కారు ధరను తగ్గించుకుని, బ్యాటరీకి నెలవారీ సర్వీస్ రూపంలో చెల్లించే అవకాశం పొందుతారు. దీనివల్ల ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు మరింత సులభం అవుతోంది, ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులకు ఇది పెద్ద ఊరటగా మారుతోంది.

New Tata Tiago Ev 2026 Launched In India At Price Start 4 69 Lakh Baas Option

బాహ్య డిజైన్ విషయానికి వస్తే, కొత్త టియాగో EV మరింత స్టైలిష్‌గా కనిపించేలా అప్‌డేట్స్ పొందింది. అనేక మార్పులు చేసి, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను మరింత ప్రీమియం ఫీల్ ఇచ్చేలా తీర్చిదిద్దింది. ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, అలాగే వెనుక భాగంలో కూడా రీడిజైన్ చేసిన రియర్ బంపర్‌లు కనిపిస్తాయి. ఇవి కేవలం లుక్‌ను మాత్రమే కాకుండా, కారుకు మరింత మోడర్న్ క్యారెక్టర్‌ను కూడా తీసుకొస్తాయి.

ఇక ఫ్రంట్ డిజైన్‌లో మరో ముఖ్యమైన మార్పు కొత్తగా మూసివేయబడిన గ్రిల్. ఇది EVకు ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇస్తుంది. దీనితో పాటు నలుపు రంగులో ఉన్న ORVMలు, అలాగే విండో లైన్ కూడా బ్లాక్ ఫినిష్‌లో ఉండటం వల్ల కారుకు స్పోర్టీ లుక్ పెరిగింది. లైటింగ్ సెటప్ విషయానికి వస్తే, కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, వెనుక భాగంలో కొత్త LED టెయిల్‌లైట్లు కారును రాత్రి సమయంలో మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి.

New Tata Tiago Ev 2026 Launched In India At Price Start 4 69 Lakh Baas Option

వెనుక భాగంలో టెయిల్‌గేట్‌పై "Tiago EV" అక్షరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఈ మోడల్‌కు మరింత స్టైలిష్ టచ్‌ను ఇచ్చాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్‌లో కొత్త ఫ్రీస్టాండింగ్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను అందించారు. దీనితో పాటు 10.25-అంగుళాల పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు, ఇది ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

కంపెనీ ఈ మోడల్‌ను మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తోంది. దీనిలో 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. 19.2 kWh 62 hp శక్తిని, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెద్దదైన 24 kWh బ్యాటరీ వెర్షన్ 75 hp పవర్‌ను, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వినియోగదారులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.

New Tata Tiago Ev 2026 Launched In India At Price Start 4 69 Lakh Baas Option

24 kWh బ్యాటరీ ప్యాక్ 285 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. 19.2 kWh సుమారు 226 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు 40 శాతం వేగంగా ఛార్జ్ అవుతుంది. 18 నిమిషాల ఛార్జింగ్‌లో సుమారు 100 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చు. 30 kW DC ఫాస్ట్ ఛార్జర్‌‌‌తో రెండు బ్యాటరీలను 10 శాతం నుండి 80 శాతం వరకు 35 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.

Article Published On: Thursday, May 28, 2026, 14:35 [IST]
English summary
New tata tiago ev 2026 launched in india at price start 4 69 lakh baas option
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+