కొత్త టోయోటా ఫార్చ్యూనర్ వచ్చేస్తోంది.. 2027 వరకు ఆగాలా? లేక ఈ బెస్ట్ ఆప్షన్లు చూస్తారా?

టోయోటా ఫార్చ్యూనర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ గ్లోబల్ డెబ్యూపై కార్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 1న ఈ కొత్త ఫార్చ్యూనర్ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతం కానుందని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మన దేశంలోకి ఇది 2027 నాటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి టోయోటా ఇండియా దీని స్పెసిఫికేషన్లు, వేరియంట్లు లేదా ధరలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారు డెలివరీ టైమింగ్స్, ఫైనాన్స్ ఆప్షన్లు, అలాగే ప్రస్తుతం ₹30 లక్షల బడ్జెట్లో ఉన్న ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు.

డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాలో ఈ కారును లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, టోయోటా నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ వారంలో కేవలం కారు వివరాలు మాత్రమే బయటకు వస్తాయి తప్ప, డెలివరీలు ప్రారంభం కావు. మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ధరల "లీకుల"ను నమ్మకుండా, టోయోటా అధికారికంగా ప్రకటించే వరకు ఆగడమే మంచిది.

New Toyota Fortuner 2027 India Launch: Should You Wait for the Next-Gen Model or Buy Now?

కొత్త టోయోటా ఫార్చ్యూనర్: మైండ్ బ్లాకింగ్ డిజైన్, హైటెక్ కేబిన్ అండ్ సేఫ్టీ ఫీచర్లు!

ఈ కొత్త మోడల్‌లో కేబిన్ డిజైన్, యాక్టివ్ సేఫ్టీ ఫీచర్లలో ప్రధాన మార్పులు ఉండబోతున్నాయి. వేరియంట్లను బట్టి ట్విన్ 12.3-ఇంచ్ స్క్రీన్లు, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఇచ్చే అవకాశముంది. ఇంజిన్ విషయానికొస్తే, ఇప్పటికే ఫార్చ్యూనర్ నియో డ్రైవ్‌లో వస్తున్న 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన పాపులర్ 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌నే ఇందులోనూ కొనసాగించనున్నారు.

ఇండియా లాంచ్ ఎప్పుడు? డీలర్లు ఏం చెబుతున్నారు?

నమ్మదగిన కథనాల ప్రకారం, భారతదేశంలోకి ఈ కొత్త ఫార్చ్యూనర్ 2027లోనే అడుగుపెట్టనుంది. కాబట్టి 2026-27లో కారు కొనాలనుకునే వారికి ప్రస్తుత మోడలే ప్రాక్టికల్ ఆప్షన్. ఇటీవల టోయోటా కొత్తగా 'ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్'ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు ₹36.51 లక్షలు (4x2 MT), ₹38.72 లక్షలు (4x2 AT)గా ఉన్నాయి. ఈ వేరియంట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఫార్చ్యూనర్ వెయిటింగ్ పీరియడ్ దాదాపు ఒక నెల వరకు ఉందని డీలర్లు చెబుతున్నారు.

ఇప్పుడే కొనాలా? వేచి చూడాలా?: ధరలు, ఇఎంఐ (EMI) అంచనాలు ఇవే

వాహనం (ఉదాహరణ మోడల్) ఎక్స్-షోరూమ్ (₹ లక్షల్లో) అంచనా నెలవారీ ఇఎంఐ (EMI)
టోయోటా ఫార్చ్యూనర్ లీడర్ 4x2 AT 38.72 ₹70,700
మహీంద్రా XUV 7XO AX7L డీజిల్ AWD AT 25.79 ₹47,300
మహీంద్రా స్కోర్పియో-N Z8L 4WD AT 25.49 ₹46,700
టాటా సఫారీ టాప్ వేరియంట్ 26.91 ₹49,200
ఎమ్‌జీ హెక్టర్ టాప్ ICE వేరియంట్ 20.00 ₹36,600

ఇక్కడ పేర్కొన్న ఇఎంఐ (EMI) అంచనాలు ఎక్స్-షోరూమ్ ధరపై 85 శాతం రుణం, 10.5 శాతం వడ్డీ రేటు, 60 నెలల కాలవ్యవధిని ప్రాతిపదికగా తీసుకొని లెక్కించినవి. టోయోటా అధికారికంగా ప్రకటించే వరకు మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్ర పన్నులు, ఇన్సూరెన్స్ కలపక ముందే... ₹38.72 లక్షల ఫార్చ్యూనర్‌తో పోలిస్తే ₹20–26 లక్షల రేంజ్‌లో ఉండే పోటీ కార్లు జేబుపై భారాన్ని ఎంతగా తగ్గిస్తాయో ఈ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది.

అంతగా వేచి చూడలేకపోతే... ₹30 లక్షల బడ్జెట్లో బెస్ట్ ఆప్షన్లు ఇవే!

ఫ్యామిలీ టూర్లు, ఆధునిక ADAS సేఫ్టీ ఫీచర్లు కావాలనుకుంటే మహీంద్రా XUV 7XO అద్భుతమైన ఆప్షన్. ఒకవేళ రఫ్ రోడ్లను తట్టుకునే లాడర్-ఫ్రేమ్ చాసిస్ పవర్ కావాలంటే మహీంద్రా స్కోర్పియో-N పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇక లగ్జరీ, సౌకర్యవంతమైన 3-రో సీటింగ్ కోసం టాటా సఫారీపై మొగ్గు చూపవచ్చు. నగరాల్లో సులువుగా డ్రైవ్ చేయడానికి, మంచి వ్యాల్యూ ఫర్ మనీ కోరుకునే వారికి ఎమ్‌జీ హెక్టర్ బెటర్. ఈ కార్లన్నీ కూడా ₹30 లక్షల బడ్జెట్ పరిధిలోనే లభిస్తున్నాయి.

మీకు ఇప్పటికే ఫార్చ్యూనర్ ఉంటే, మార్కెట్‌లో దీని రీసేల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. 3 నుంచి 5 ఏళ్లు వాడినప్పటికీ 65–80 శాతం వరకు రీసేల్ ధర లభిస్తుంది. కొత్త మోడల్ భారత మార్కెట్లోకి వచ్చే వరకు పాత మోడల్ రీసేల్ ధరలు ఇదే రీతిలో స్థిరంగా కొనసాగుతాయి. ప్రస్తుతం కొత్తగా కారు కొనాలనుకునే వారు తక్కువ వెయిటింగ్ టైమ్ ఉన్న లీడర్ ఎడిషన్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదా డిసెంబర్ 1న వెల్లడయ్యే కొత్త వివరాలను చూశాక ఒక స్పష్టమైన నిర్ణయానికి రావచ్చు.

Article Published On: Friday, November 27, 2026, 15:56 [IST]
Read more on: #toyota #suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+