పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కంఫర్ట్.. కుటుంబం అంతా ఒకే కారులో.. పెద్ద స్పేస్, పెద్ద స్టైల్
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా 'టేరాన్ ఆర్-లైన్'ను ఘనంగా విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 46.99 లక్షలుగా నిర్ణయించిన ఈ ప్రీమియం ఏడు సీట్ల SUV, బ్రాండ్ లైనప్‌లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మూడు వరుసల సెగ్మెంట్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పెస్ స్థానాన్ని ఈ కొత్త టేరాన్ ఆర్-లైన్ భర్తీ చేయడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే ఫోక్స్‌వ్యాగన్ ఈ 7-సీటర్ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లతో పాటు బ్రాండ్ అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించింది. కేవలం రూ. 51,000 టోకెన్ అమౌంట్‌తో వినియోగదారులు టేరాన్ ఆర్-లైన్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ పూర్తిగా స్పోర్టీ, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో IQ లైట్‌తో కూడిన HD మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్‌లు ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తాయి. రాత్రివేళల్లో అద్భుతమైన విజిబిలిటీ ఇవ్వడంతో పాటు, వీటి షార్ప్ లైటింగ్ సిగ్నేచర్ SUVకు ప్రీమియం గుర్తింపును ఇస్తుంది. బంపర్, ముందు తలుపులపై ఉన్న ప్రత్యేక R-లైన్ ఎలిమెంట్స్ వాహనానికి మరింత డైనమిక్ అండ్ అగ్రెసివ్ అప్పీల్‌ను జోడిస్తాయి.

సైడ్ ప్రొఫైల్‌లో 19-అంగుళాల కోవెంట్రీ అల్లాయ్ వీల్స్ బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తాయి. ముందు, వెనుక ప్రకాశవంతమైన లోగో ఏర్పాటు చేయడం ద్వారా ఈ SUVకు మోడర్న్ టచ్ ఇవ్వబడింది. మొత్తంగా చూస్తే, మొదటి చూపులోనే ఇది బలమైన SUV అని తెలియజేసే విధంగా డిజైన్ చేయబడింది. జర్మన్ ఇంజినీరింగ్‌కు తగ్గట్టుగా ప్రీమియం స్పోర్టీ లుక్, కచ్చితమైన లైన్స్, అద్భుతమైన ఫిట్ అండ్ ఫినిష్ ఈ మోడల్ ప్రత్యేకతగా నిలుస్తాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, ఈ టేరాన్ ఆర్-లైన్‌లో 2.0-లీటర్ TSI EA888 evo4 పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. ఈ శక్తివంతమైన ఇంజిన్ గరిష్టంగా 204 PS పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ వాహనానికి మెరుగైన గ్రిప్, స్థిరత్వాన్ని అందిస్తుంది, ముఖ్యంగా కఠినమైన రోడ్లపై లేదా వర్షాకాలంలో డ్రైవింగ్ సమయంలో.

ఆరు డ్రైవ్ ప్రొఫైల్‌ల ఎంపికతో, డ్రైవర్ తన అవసరాలకు అనుగుణంగా వాహన పనితీరును మార్చుకునే వీలుంది. నగర డ్రైవింగ్ నుంచి హైవే క్రూజింగ్ వరకు, అవసరమైతే లైట్ ఆఫ్-రోడింగ్ వరకు కూడా ఈ SUV సమర్థంగా స్పందిస్తుంది. శక్తి, నియంత్రణ, సౌకర్యం కలిసిన సమతుల్య పనితీరుతో టేరాన్ ఆర్-లైన్ ప్రీమియం SUV సెగ్మెంట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించేందుకు సిద్ధంగా ఉంది.
ఫీచర్ల పరంగా ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ నిజంగా ప్రీమియం SUV అనిపించేలా అత్యాధునిక సౌకర్యాలను అందిస్తోంది. మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వల్ల డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్, రియర్ సీటింగ్ ప్రయాణికులు తమకు నచ్చిన ఉష్ణోగ్రతను వేర్వేరుగా సెట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. పవర్డ్ జెస్టర్-కంట్రోల్ టెయిల్‌గేట్ ప్రత్యేక ఆకర్షణ. చేతులతో తాకకుండా కేవలం కాలి సంజ్ఞతోనే బూట్‌ను ఓపెన్ చేయగలిగే సదుపాయం రోజువారీ వినియోగంలో చాలా సౌకర్యాన్ని అందిస్తుంది.

మ్యూజిక్ ప్రేమికుల కోసం 700-వాట్ అవుట్‌పుట్‌తో 11 స్పీకర్‌లతో కూడిన Harman Kardon సౌండ్ సిస్టమ్ అమర్చారు. టెక్నాలజీ విషయానికి వస్తే, రెండు హై-పవర్ USB-C (45W) పోర్ట్‌లు, రెండు మొబైల్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఇవ్వడం ద్వారా కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదనంగా, ఆగ్మెంటెడ్ రియాలిటీ(AR) హెడ్-అప్ డిస్‌ప్లే ద్వారా నావిగేషన్, వేగం వంటి ముఖ్యమైన సమాచారం డ్రైవర్‌కు నేరుగా విండ్‌స్క్రీన్‌పై ప్రొజెక్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








