కి.మీకు కేవలం రూ.2.60 ఖర్చు.. Ev కారుని వాడినంతకే డబ్బులు చెల్లించండి! టాటా ప్లాన్ అదిరిపోతుంది!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన టాటా మోటార్స్ (Tata Motors) ఇప్పుడు మరోసారి సంచలన నిర్ణయంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో పంచ్ EVను అందించి మార్కెట్‌లో భారీ చర్చకు దారితీసిన ఈ సంస్థ, ఇప్పుడు టియాగో EV ధర విషయంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది. దీంతో "ఎలక్ట్రిక్ కారు కొనడం అంటే చాలా ఖర్చు" అనే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయాలని టాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్లు మధ్యతరగతి కుటుంబాలకు కాస్త దూరంగానే అనిపించేవి. కానీ ఇప్పుడు టాటా తీసుకొచ్చిన కొత్త ప్లాన్‌తో పరిస్థితి పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ప్రారంభించిన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ కార్యక్రమం ద్వారా, వినియోగదారులు బ్యాటరీ ఖర్చును విడిగా చెల్లించే విధంగా కారును తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు.

ఈ కొత్త విధానం కారణంగా టియాగో EV కేవలం రూ.4.69 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. అంటే రూ.5 లక్షలు కూడా ఖర్చు చేయకుండా ఎలక్ట్రిక్ కారును ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఇప్పుడు వినియోగదారులకు లభిస్తోంది. ఇది భారత ఆటో మార్కెట్లో ఒక పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముంది. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ సమయంలో, తక్కువ రన్నింగ్ ఖర్చు, పర్యావరణహిత ప్రయాణాన్ని కోరుకునే వారికి టియాగో EV బెస్ట్.

Newly Launched Tata Tiago Ev Battery Subscription Plan Details Inside

టాటా మోటార్స్ తీసుకొచ్చిన కొత్త బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ ఇప్పుడు భారత EV మార్కెట్లో పెద్ద చర్చగా మారుతోంది. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ల ధర ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం బ్యాటరీ ఖర్చే. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టాటా ఇప్పుడు వినియోగదారులకు కొత్త మార్గాన్ని చూపిస్తోంది. ఈ ప్రత్యేక BaaS మోడల్‌లో, టాటా టియాగో EVను బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

దీంతో కార్ ప్రారంభ ధర భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు బేస్ వేరియంట్ టియాగో EVను సుమారు రూ.4.60 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో బ్యాటరీపై పూర్తి మొత్తాన్ని ముందుగానే చెల్లించాల్సిన అవసరం ఉండదు. బదులుగా, కారు ఎంత నడిపితే అంత మేరకు మాత్రమే చెల్లించాలి. కంపెనీ నిర్ణయించిన ప్రకారం, ప్రతి కిలోమీటర్‌కు కేవలం రూ.2.60 మాత్రమే చెల్లించాలి. దీంతో ఒకేసారి భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది.

Newly Launched Tata Tiago Ev Battery Subscription Plan Details Inside

ముఖ్యంగా మొదటిసారి ఎలక్ట్రిక్ కార్ కొనాలని భావించే వారికి ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా మారవచ్చు. తక్కువ డౌన్ పేమెంట్‌తో EVను ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లపై మరింత ఆసక్తి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో, తక్కువ రన్నింగ్ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఈ మోడల్ మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.

దీని పనితీరు విషయానికి వస్తే, దీనిని రెండు బ్యాటరీ ఎంపికలతో అందిస్తోంది. ఇందులో 19 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. చిన్న 19 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే మోడల్ 62 bhp పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ వేరియంట్, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 226 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

Newly Launched Tata Tiago Ev Battery Subscription Plan Details Inside

24 kWh బ్యాటరీ ప్యాక్‌ 75 bhp పవర్, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 285 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. కేవలం 18 నిమిషాల ఛార్జింగ్‌తోనే సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ పొందవచ్చు. 30 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే, రెండు బ్యాటరీ వేరియంట్లను కూడా కేవలం 35 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Article Published On: Friday, May 29, 2026, 18:31 [IST]
English summary
Newly launched tata tiago ev battery subscription plan details inside
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+