లీటరుకు 25 కిమీ మైలేజా? .. కొత్త క్రెటా లుక్స్ చూస్తే మిగతా కంపెనీలు దుకాణం సర్దేసుకోవాల్సిందే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్‌-సైజ్ ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. ఎన్నో కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నప్పటికీ, హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. తన సెగ్మెంట్‌లో రారాజుగా దూసుకుపోతున్న క్రెటా.. హ్యుందాయ్ కంపెనీకి కూడా అత్యధిక అమ్మకాలను తెచ్చిపెట్టే నంబర్ వన్ మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే దూకుడును కొనసాగించేందుకు కంపెనీ తన చరిత్రలోనే అతిపెద్ద అడుగు వేయబోతోంది. పూర్తిగా సరికొత్త థర్డ్-జనరేషన్ (3rd Generation) క్రెటాను 2027 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి హ్యుందాయ్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

సరికొత్త కే3 ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్
ఈ నెక్స్ట్‌-జనరేషన్ హ్యుందాయ్ క్రెటాను కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా K3 అనే సరికొత్త ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించబోతున్నారు. ఈ అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్ వల్ల కారు బాడీ స్ట్రక్చర్ మునుపటి కంటే చాలా బలంగా, సురక్షితంగా మారుతుంది.

Next-Gen Hyundai Creta to Offer 25 kmpl Hybrid Mileage with Premium Features and Bigger Design

దీనివల్ల ప్రయాణికులకు గరిష్ట భద్రత లభిస్తుంది. అంతేకాకుండా, బయట నుంచి వచ్చే ట్రాఫిక్ శబ్దాలు (NVH లెవెల్స్) కేబిన్‌లోకి రాకుండా ఈ ప్లాట్‌ఫారమ్ గట్టిగా నిరోధిస్తుంది. రహదారిపై కారు వేగంగా వెళ్తున్నప్పుడు కూడా మంచి స్టెబిలిటీని ఇస్తూ, డ్రైవర్‌కు ఎంతో స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

సైజ్ పెరిగింది.. స్పేస్ అదిరింది
కొత్త క్రెటా లుక్ పరంగా మరింత బోల్డ్‌గా, మస్కులర్‌గా కనిపించబోతోంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ప్రత్యేకమైన క్రేటర్ కాన్సెప్ట్ డిజైన్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. రాబోయే మోడల్ ప్రస్తుత కారు కంటే దాదాపు 120 మిల్లీమీటర్ల పొడవు, 30 మిల్లీమీటర్ల వెడల్పు పెరగనుంది.

Next-Gen Hyundai Creta to Offer 25 kmpl Hybrid Mileage with Premium Features and Bigger Design

అలాగే వీల్‌బేస్ కూడా 80 మిల్లీమీటర్ల వరకు పెద్దది కానుంది. దీనివల్ల కారు లోపల లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ చాలా విశాలంగా మారిపోతాయి. ప్రయాణికులు ఎంత దూరమైనా హాయిగా కూర్చుని ప్రయాణించవచ్చు. అలాగే లగేజీ పెట్టుకోవడానికి బూట్ స్పేస్ కూడా భారీగా పెరగనుంది.

లగ్జరీ సీట్లు.. ప్రయాణం ఇక అల్ట్రా కంఫర్ట్
కారు లోపల స్థలం పెరగడమే కాకుండా, సీట్ల విషయంలో కూడా హ్యుందాయ్ భారీ మార్పులు చేస్తోంది. సరికొత్తగా డిజైన్ చేసిన వెడల్పాటి సీట్లను ఇందులో ఇస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్ సీటుకు పవర్ రిక్లైనింగ్‌తో పాటు పవర్ లంబార్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా జోడించారు.

దీనివల్ల లాంగ్ డ్రైవ్స్‌లో నడుము నొప్పి వచ్చే ఛాన్స్ ఉండదు. ముందు రెండు సీట్లకు వెంటిలేషన్, మెమరీ ఫంక్షన్ లాంటి లగ్జరీ ఫీచర్లు కూడా రాబోతున్నాయి. కేబిన్ అంతటా ఒకే విధమైన చల్లదనం కోసం డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా అమరుస్తున్నారు.

Next-Gen Hyundai Creta to Offer 25 kmpl Hybrid Mileage with Premium Features and Bigger Design

స్మార్ట్‌ఫోన్‌ను మించిన హైటెక్ కాక్‌పిట్ డిస్‌ప్లే
కొత్త క్రెటా ఇంటీరియర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇందులో హ్యుందాయ్ సరికొత్త కాక్‌పిట్ డిస్‌ప్లే కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తోంది. డాష్‌బోర్డ్‌పై ఏకంగా 12.9 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సమాచారం కోసం 9.9 ఇంచుల స్లిమ్ డిజిటల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిస్టమ్ పూర్తిగా ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మొబైల్ కనెక్ట్ చేయకపోయినా.. కారులోనే గూగుల్ మ్యాప్స్ వంటి ఇన్-బిల్ట్ యాప్స్ స్మార్ట్‌ఫోన్‌లా చాలా ఈజీగా రన్ అవుతాయి.

లీటరుకు 25 కిమీ మైలేజ్.. అదిరిపోయే హైబ్రిడ్ ఆప్షన్
ప్రస్తుతం ఉన్న క్రెటాతో పోలిస్తే ఈ నెక్స్ట్‌-జెన్ మోడల్‌లో వస్తున్న అతిపెద్ద మార్పు ఇంజన్. ఈ కారును హైబ్రిడ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. మొదట దీనిని రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లాంచ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత కొద్ది నెలలకే 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ (Strong-Hybrid) ఇంజన్ ఆప్షన్‌ను హ్యుందాయ్ తీసుకురానుంది.

ఈ హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంచనా. దీంతో పాటు, కారు బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జ్ చేసుకునే వీహెచ్-టు-లోడ్ (V2L) ఫీచర్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.

Article Published On: Sunday, June 28, 2026, 16:57 [IST]
English summary
Next gen hyundai creta to offer 25 kmpl hybrid mileage with premium features and bigger design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+