ఇది కారు కాదు మధ్య తరగతి వాడి కలల విమానం.. ఇప్పుడు పెళ్లి కూతులా ముస్తాబై వస్తోంది
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో కియా సోనెట్(Kia sonet) తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఈ కారును మరింత పవర్ఫుల్ గా, స్టైలిష్‌గా మార్చేందుకు కియా సంస్థ సిద్ధమైంది. నెక్స్ట్ జనరేషన్ కియా సోనెట్(Kia sonet) టెస్టింగ్ దశలో ఉండగా, దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతేడాది హ్యుందాయ్ తన వెన్యూ మోడల్‌ను అప్‌డేట్ చేసిన నేపథ్యంలో, ఇప్పుడు కియా కూడా తనవంతుగా సోనెట్(sonet)ను సరికొత్త హంగులతో తీసుకురానుంది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై షేర్ అయిన స్పై షాట్స్ ప్రకారం, కొత్త సోనెట్ భారీ కవర్‌తో కప్పబడి కనిపించింది. దీనికి టెంపరరీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉండటంతో, భారత్‌లోనే దీని టెస్టింగ్ జరుగుతోందని స్పష్టమైంది. మొదటి చూపులో ఇది సోనెట్(sonet) అని గుర్తుపట్టడం కష్టమైనప్పటికీ, కారు బాడీ షేప్, కియా(kia) సిగ్నేచర్ గ్రిల్ ఆధారంగా ఇది నెక్స్ట్ జనరేషన్ మోడల్ అని నిపుణులు ధృవీకరిస్తున్నారు.

కొత్త సోనెట్ డిజైన్ ఇటీవల లాంచ్ అయిన కొత్త కియా సెల్టోస్(kia seltos) నుంచి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. ఇందులో హనీకోంబ్ డిజైన్‌తో కూడిన ఒక పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఉంది. అలాగే, ఎల్‌ఈడీ డీఆర్ఎల్ (LED DRL) లైట్లు గ్రిల్ వరకు విస్తరించి ఉండటం వల్ల కారు ముందు భాగం ఎంతో ఆకర్షణీయంగా మారింది. బంపర్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చివేసినట్లు తెలుస్తోంది, ఇది ప్రస్తుత మోడల్ కంటే మరింత అగ్రెసివ్‌గా ఉంది.
ఈ సెగ్మెంట్‌లో కస్టమర్లు ఎక్కువగా కోరుకునే ఫీచర్ సన్‌రూఫ్. కొత్త సోనెట్‌లో కియా సంస్థ పనోరమిక్ సన్‌రూఫ్‌ను (Panoramic Sunroof) అందించే అవకాశం ఉందని స్పై షాట్స్ సూచిస్తున్నాయి. సాధారణంగా పెద్ద ఎస్‌యూవీ(SUV)ల్లో మాత్రమే ఉండే ఈ ఫీచర్‌ను సోనెట్(sonet)లో ప్రవేశపెడితే, ఇది మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా మారడం ఖాయం. దీనితో పాటు సెల్టోస్(seltos) తరహాలోనే ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

సోనెట్ క్యాబిన్‌ను కూడా కియా(kia) భారీగా అప్‌డేట్ చేయనుంది. కొత్త కలర్ థీమ్, మరింత పెద్దదైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉండనున్నాయి. ముఖ్యంగా సేఫ్టీ పరంగా లెవల్ 2 ఏడీఏఎస్ (Level 2 ADAS) ఫీచర్‌ను జతచేయనున్నారు. దీనివల్ల డ్రైవింగ్ మరింత సురక్షితంగా మారుతుంది. వెర్ట్యువల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, వెనుక సీట్లకు రిక్లైన్ ఆప్షన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కారును లగ్జరీగా మార్చనున్నాయి.
నెక్స్ట్ జనరేషన్ సోనెట్ కియా K1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లనే కియా కొనసాగించే అవకాశం ఉంది. అయితే, పర్ఫార్మెన్స్, మైలేజీని పెంచడానికి కొన్ని చిన్నపాటి మార్పులు చేయవచ్చు. ఈ ఏడాది చివరిలో లేదా 2027 ప్రారంభంలో ఈ కారు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర కూడా ప్రస్తుత మోడల్


Click it and Unblock the Notifications