పేద కుటుంబాలకు నిస్సాన్ ప్రసాదించిన వరం ఈ కారు..రూ.6 లక్షలకే 7 సీట్ల కారు..ఫిబ్రవరి 17న లాంచ్
భారతీయ రోడ్లపై మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇష్టమైన వాహనం ఏదైనా ఉందంటే అది ఎంపీవీ(MPV - Multi Purpose Vehicle). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వీలుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో ఇప్పటికే మారుతి ఎర్టిగా, రెనో ట్రైబర్ రాజ్యమేలుతుండగా, ఇప్పుడు వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ సిద్ధమైంది.
నిస్సాన్ గ్రావైట్(Nissan Gravite) పేరుతో వస్తున్న ఈ కొత్త 7 సీటర్ కారు, ఈ ఫిబ్రవరి 17న భారత మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. అతి తక్కువ ధరలో లగ్జరీ అనుభూతిని అందించే ఈ కారు ప్రత్యేకతలేంటో చూద్దాం.

నిస్సాన్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎంపీవీ గ్రావైట్ టీజర్ వీడియోను ఇటీవలే విడుదల చేసింది. ఇది రెనో ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైనప్పటికీ, నిస్సాన్ తనదైన శైలిలో భారీ మార్పులు చేసింది. కారు ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ V-Motion గ్రిల్, C-ఆకారం కలిగిన ఎల్‌ఈడీ (LED) లైట్లు కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. కారు బాడీపై ఉన్న షార్ప్ లైన్లు, కొత్త బంపర్ దీనికి మరింత స్పోర్టీ రూపాన్ని ఇచ్చాయి. హైవేల మీద మాత్రమే కాదు, గ్రామాల్లో ఉండే కుదుపుల రోడ్ల మీద కూడా ఈ కారు అద్భుతంగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ ఎంపీవీ ప్రధాన ఆకర్షణ దాని 7 సీటర్ కాన్ఫిగరేషన్. ఇందులో ఫ్లాట్ ఫ్లోర్ లేఅవుట్ ఉండటం వల్ల లోపల స్థలం ఎక్కువగా కనిపిస్తుంది. రెండవ వరుస సీట్లను మనం కావాల్సినట్లుగా వెనక్కి ముందరికి జరుపుకోవచ్చు (Slide, Recline). ఇక మూడవ వరుస సీట్లు పిల్లలకు లేదా తక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. లగేజీ ఎక్కువగా ఉన్నప్పుడు మూడవ వరుస సీట్లను పూర్తిగా మడిచిపెట్టి డిక్కీ స్పేస్‌ను పెంచుకోవచ్చు. దీనివల్ల రెండు కుటుంబాలు కలిపి ట్రిప్‌కు వెళ్లినా సామాన్లు సర్దుకోవడంలో ఇబ్బంది ఉండదు.

నేటి తరం వాహనదారులను ఆకట్టుకునేలా నిస్సాన్ ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇచ్చింది:
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్: కారు వేగం, ఇంధనం వంటి వివరాలను తెలిపే 7-అంగుళాల స్క్రీన్.
టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 8-అంగుళాల డిస్‌ప్లే.
ఏసీ వెంట్స్: కారులోని మూడు వరుసలలో ప్రయాణించే వారికి ప్రత్యేకమైన ఏసీ వెంట్స్ ఇవ్వడం విశేషం.
అదనపు ఫీచర్లు: పుష్ బటన్ స్టార్ట్, కీ లెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ చార్జింగ్ వంటివి హై-ఎండ్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావైట్ ప్రధానంగా రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లతో రాబోతున్నట్లు సమాచారం:
1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్: ఇది 72hp పవర్, 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఉపయోగపడుతుంది.
1.0 లీటర్ టర్బో పెట్రోల్: కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం 100hp పవర్ ఇచ్చే మాగ్నైట్ లోని టర్బో ఇంజిన్‌ను కూడా గ్రావైట్ లో ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు AMT ఆటోమేటిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీ దీనిని సీఎన్‌జీ (CNG) వెర్షన్‌లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావైట్ కేవలం తక్కువ ధరకే కాదు,సేఫ్టీకి కూడా పెద్దపీట వేస్తోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ABS తో కూడిన EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు సేఫ్టీ గురించి చింతించాల్సిన అవసరం లేదని నిస్సాన్ భరోసా ఇస్తోంది.
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, నిస్సాన్ గ్రావైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.8 లక్షల నుంచి రూ.8.5 లక్షల మధ్యలో ఉండవచ్చు. ఈ ధరకు 7 సీట్ల కారు లభించడం అంటే ఖచ్చితంగా మార్కెట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. ఫిబ్రవరి 17న అధికారికంగా లాంచ్ అయిన తర్వాత, మార్చి 2026 నుంచి కస్టమర్లకు డెలివరీ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








