7 మందికి సరిపోయే కారు రూ.5.75 లక్షలకే.. లాంచ్ డేట్ ఫిక్స్ అయింది! అందరూ బడ్జెట్ సిద్దం చేసుకోండి

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, జపాన్‌కు చెందిన నిస్సాన్ మధ్య ఉన్న గ్లోబల్ భాగస్వామ్యం భారత ఆటో మార్కెట్‌లో మరో కొత్త మోడల్‌కు దారితీయబోతోంది. ఈ పొత్తులో భాగంగా, ప్రస్తుతం భారత్‌లో మంచి ఆదరణ పొందుతున్న రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని, నిస్సాన్ ఒక సరికొత్త 7-సీటర్ MPVను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త మోడల్‌కు నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) అనే పేరును ఖరారు చేస్తూ, తొలుత దీనిని జనవరి 21న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఊహించని కారణాలతో ఈ లాంచ్ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో ఆటో ప్రియులు, ముఖ్యంగా నిస్సాన్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరదించుతూ, నిస్సాన్ కంపెనీ గ్రావైట్ కొత్త లాంచ్ తేదీని అధికారికంగా వెల్లడించింది.

తాజా సమాచారం ప్రకారం, నిస్సాన్ గ్రావైట్ ఫిబ్రవరి 17న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిస్సాన్ ఇండియా తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ధృవీకరించింది. దీంతో ఇక ఎలాంటి సందేహానికి అవకాశం లేకుండా, ఫిబ్రవరి 17న నిస్సాన్ గ్రావైట్ లాంచ్ ఖాయం అయింది. ట్రైబర్ ఆధారిత MPV కావడంతో, తక్కువ ధరలో 7-సీటర్ సెగ్మెంట్‌లో ఇది కీలకమైన పోటీదారుగా నిలవనుందని అంచనా.

Nissan Gravite India Launch Confirmed For February 17 More Details Inside

కుటుంబ వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు, ప్రాక్టికల్ డిజైన్‌తో నిస్సాన్ గ్రావైట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఈ కొత్త నిస్సాన్ గ్రావైట్ MPV భారత మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి రానుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఇది బడ్జెట్‌లో 7-సీటర్ కారు కొనాలని చూస్తున్న కుటుంబాలకు పెద్ద ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

నిస్సాన్ గ్రావైట్ లాంచ్ అయిన తర్వాత, ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే బలమైన పట్టు ఉన్న మారుతి సుజుకి ఎర్టిగాతో నేరుగా పోటీ పడనుంది. ఎర్టిగా తక్కువ ధర, మంచి మైలేజ్, విశాలమైన క్యాబిన్‌తో మార్కెట్‌ను ఏలుతున్న నేపథ్యంలో, నిస్సాన్ కూడా అదే ఫార్ములాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ధర విషయంలో నిస్సాన్ పెద్ద షాక్ ఇవ్వనుందని ఆటో వర్గాల్లో చర్చ సాగుతోంది.

Nissan Gravite India Launch Confirmed For February 17 More Details Inside

ప్రస్తుత అంచనాల ప్రకారం, నిస్సాన్ గ్రావైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.75 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ఇది నిజమైతే, భారత్‌లో లభించే అత్యంత చౌకైన 7-సీటర్ MPVలలో ఒకటిగా గ్రావైట్ నిలవడం ఖాయం. ఈ ధరలో 7 సీట్ల కారు అందుబాటులోకి వస్తే, తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఫ్యామిలీ కారును కోరుకునే వారికి నిస్సాన్ గ్రావైట్ గేమ్‌చేంజర్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సమాచారం ప్రకారం, ఈ కారులో 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వనున్నారు. ఈ ఇంజన్ సుమారు 72 hp పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. రోజువారీ వినియోగానికి సరిపడే పనితీరు, మంచి మైలేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇంజన్‌ను ట్యూన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్‌తో పాటు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు AMT ఎంపికలు కూడా అందుబాటులోకి రావచ్చని అంచనా.

Nissan Gravite India Launch Confirmed For February 17 More Details Inside

ఫీచర్ల పరంగా చూస్తే, నిస్సాన్ గ్రావైట్ ఈ సెగ్మెంట్‌లో ఆశ్చర్యపరిచేలా ఉండొచ్చని ఆటో వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ ధర శ్రేణిలో అరుదుగా కనిపించే క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా నిస్సాన్ అందించే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 4, 2026, 18:47 [IST]
English summary
Nissan gravite india launch confirmed for february 17 more details inside
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+