ఇంత తక్కువ ధరలో 7-సీటర్‌ కారు లభించడం అసాధ్యం.. పెద్ద ఫ్యామీలీలకు బెస్ట్ ఆప్షన్‌! గ్రావైట్ వివరాలు ఇవే

భారతీయ ఆటో మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, రోజువారీ ప్రయాణాలు చేసే వారు, అలాగే టాక్సీ ఆపరేటర్లు అందరికీ ఒకే సారి సరిపోయే వాహనం అంటే అది ఒక మంచి ఎంపీవీ. ఇలాంటి సమయంలోనే నిస్సాన్ (Nissan) తమ కొత్త గ్రావైట్(Gravite) ఎంపీవీని ఒక గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా అమ్మకానికి విడుదల చేసి మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కొత్త 7-సీటర్ ఎంపీవీ భారతీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నట్టు కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపించుకునే కాంపాక్ట్ సైజ్‌తో పాటు, లోపల మాత్రం విస్తారమైన క్యాబిన్ స్పేస్ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. పెద్ద కుటుంబాలు ఒకేసారి ప్రయాణించేటప్పుడు ఎవరూ ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన సీటింగ్ అమరికను ఇందులో కల్పించారు.

దూర ప్రయాణాల్లో కూడా ప్రయాణికులకు అలసట అనిపించకుండా ఉండేలా సస్పెన్షన్ సెటప్, సీట్ల కంఫర్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి కుటుంబాలకు బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఈ ఎంపీవీ ధరను అందుబాటులో ఉంచడం ద్వారా మరింత మంది వినియోగదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకొచ్చింది. స్కూల్ డ్రాప్‌లు, ఆఫీస్ ప్రయాణాలు, వారాంతపు టూర్లు ఇలా ప్రతి సందర్భంలోనూ ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుంది.

Nissan Gravite Mpv Price Design Engine Mileage And Features All Top Things

కొత్త గ్రావైట్ ఎంపీవీ ధర విషయానికి వస్తే, ఎంట్రీ లెవల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.65 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 8.93 లక్షలు. మొదటి 1001 మంది కస్టమర్లకు ప్రత్యేక లాంచ్ ఎడిషన్ ధర ఉంటుంది. ఈ ఎంపీవీలో 1.0-లీటర్ మూడు సిలిండర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 72 హెచ్‌పీ శక్తిని, 96 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నగర ప్రయాణాల్లో సరిపడే పవర్, స్థిరమైన డ్రైవింగ్ అనుభూతి ఇవ్వడానికి ఈ సెటప్ బాగా సహాయపడుతుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయంలో కూడా కంపెనీ వినియోగదారులకు రెండు ఆప్షన్లు అందించింది. ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఐదు-స్పీడ్ AMT ఆటోమేటిక్ ఎంపిక కూడా ఉంది. రోజువారీ ట్రాఫిక్‌లో సులభంగా నడిపించాలనుకునే వారికి AMT వేరియంట్ అనుకూలంగా ఉంటుంది.

Nissan Gravite Mpv Price Design Engine Mileage And Features All Top Things

మైలేజ్ ఈ వాహనానికి ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. మాన్యువల్ వేరియంట్‌లకు లీటరుకు 19.3 కిలోమీటర్లు, AMT వేరియంట్‌లకు 19.6 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను కంపెనీ ప్రకటించింది. ఇది నగర ప్రయాణాలకే కాకుండా హైవే డ్రైవ్‌లకు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్రావైట్ కోసం డ్యూయల్-సిలిండర్ CNG రెట్రోఫిట్ ఎంపికను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది.

కొత్త గ్రావైట్ ఎంపీవీ ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆధునిక స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. ఆల్-రౌండ్ LED లైట్లు, ఇంటిగ్రేటెడ్ DRLలతో సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రిస్టల్ ఎడ్జ్ LED టెయిల్ ల్యాంప్‌లు, LED ఫాగ్ ల్యాంప్‌లు మరియు పియానో బ్లాక్ 2D గ్రిల్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. రూఫ్ రెయిల్‌లు, వెడల్పుగా తెరుచుకునే తలుపులు ఉపయోగకరంగా ఉంటాయి. లోపల మూడు వరుసల 7-సీట్ల లెథరెట్ క్విల్టెడ్ సీట్లు అందించారు.

Nissan Gravite Mpv Price Design Engine Mileage And Features All Top Things

లోపల ఫ్లోటింగ్ 20.32 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 17.78 సెం.మీ పూర్తి డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో LED హెడ్‌ల్యాంప్, అప్రోచ్ అన్‌లాక్, ముందు-వెనుక పార్కింగ్ సెన్సర్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, ESC, TCS, హిల్-స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, EBDతో ABS, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2026, 9:19 [IST]
English summary
Nissan gravite mpv price design engine mileage and features all top things
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+