షోరూమ్‌లలో సందడి చేస్తున్న రూ. 5.65 లక్షల కారు. రెండు కుటుంబాలకు సరిపోద్ది, తక్కువ ధరలో భారీ కారు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో 7 సీటర్ కారును అందించడం చిన్న విషయం కాదు. అయితే అదే సవాల్‌ను స్వీకరించి ముందుకొచ్చింది నిస్సాన్ (Nissan). తాజాగా ఈ కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసిన కొత్త మోడల్ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా 7 సీటర్ కార్లు అంటే ఎక్కువ ధర, భారీ ఖర్చు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ గ్రావైట్ ఆ అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. సరసమైన ధరలో పెద్ద కుటుంబాలకు సరిపోయే స్పేస్‌ను అందిస్తూ, రెండు కుటుంబాలు కూడా సౌకర్యంగా కూర్చుని ప్రయాణించగల విధంగా ఈ కారును డిజైన్ చేశారు.
నగర ప్రయాణాలు కావొచ్చు, లేదా వీకెండ్ టూర్లు కావొచ్చు, అందరికీ సరిపడే స్థలాన్ని అందిస్తుంది. డిజైన్ పరంగా గ్రావైట్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ లైటింగ్ ఎలిమెంట్స్ వంటి అంశాలు ప్రీమియమ్ టచ్‌ను ఇస్తాయి. అంతేకాదు, కొత్త తరం వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అనేక ఆధునిక ఫీచర్లను ఇందులో సమకూర్చారు. కంఫర్ట్, కనెక్టివిటీ, భద్రత మూడు అంశాల్లోనూ సమతుల్యతను చూపించేందుకు కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

కారు విడుదలైన వెంటనే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు కేవలం రూ. 11,000 అడ్వాన్స్ చెల్లించి తమ ఆర్డర్‌ను నమోదు చేసుకోవచ్చు. ఇది చాలా మందికి అందుబాటులో ఉండే మొత్తం కావడంతో బుకింగ్‌లకు మంచి స్పందన లభిస్తోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ డీలర్‌షిప్‌లకు గ్రావైట్ వాహనాల డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని వల్ల అధికారికంగా కస్టమర్లకు డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో సరసమైన ధరలో 7 సీటర్ ఎంపిక కోసం ఎదురుచూస్తున్న వారికి బెస్ట్. ధర పరంగా చూస్తే, గ్రావిట్ రూ. 5.65 లక్షల నుండి రూ. 8.93 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఈ ధర రేంజ్‌లో 7 సీటర్ వాహనం లభించడం పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. విసియా, అసెంట్, ఎన్-కనెక్టా, టెక్నా వంటి విభిన్న వేరియంట్లలో లభిస్తూ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు.

డిజైన్ విషయానికి వస్తే, ఈ MPVకి ఆధునిక టచ్ ఇచ్చేలా LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు, 15-అంగుళాల వీల్స్‌ను అందించారు. ఫారెస్ట్ గ్రీన్, ఒనిక్స్ బ్లాక్, మెటాలిక్ గ్రే, బ్లేడ్ సిల్వర్, స్టార్మ్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించడం వల్ల యువతతో పాటు కుటుంబాలు కూడా దీనిని ఇష్టపడే అవకాశం ఉంది. పనితీరు పరంగా కూడా ధరకు తగ్గట్టుగానే శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను అందించారు.
ఇంజిన్ 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 6,250 rpm వద్ద 71 bhp శక్తిని, 3,600 rpm వద్ద 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో జత చేశారు. మైలేజీ పరంగా గ్రావైట్ మంచి సమర్థతను చూపిస్తోంది. ఇది సుమారు 19.3 నుండి 19.6 kmpl వరకు ఇస్తుంది. కుటుంబ ప్రయాణాలు, రోజువారీ వినియోగానికి బెస్ట్.

కొత్త నిస్సాన్ గ్రావైట్ MPVలో క్యాబిన్ డిజైన్ బాగా ఉంటుంది. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా కనెక్ట్ చేసి మ్యూజిక్, కాల్స్, నావిగేషన్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అదనంగా 7-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు స్పష్టమైన సమాచారం అందిస్తూ ప్రీమియమ్ ఫీల్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








