కారు కొంటే ఇదే కొనాలి అంటున్నారు.. రూ.6 లక్షల లోపు SUV! బడ్జెట్ కస్టమర్లకు ఇది లాటరీ టికెట్ లాంటిది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUVల సెగ్మెంట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా 4 మీటర్ల లోపు పొడవు కలిగిన SUVలు స్టైలిష్ డిజైన్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అందుబాటు ధరల కారణంగా మధ్యతరగతి వినియోగదారుల మొదటి ఎంపికగా మారుతున్నాయి. ఈ విభాగంలో అనేక మోడళ్లు పోటీపడుతున్నప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) తన ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన ధరతో మార్కెట్లో మంచి గుర్తింపును సంపాదించింది. భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే మాగ్నైట్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రీమియం లుక్, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరల కలయిక ఈ SUV విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

తాజా అమ్మకాల ఈ మోడల్‌పై వినియోగదారుల ఆసక్తి కొనసాగుతున్నట్లు సూచిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నెలలో నిస్సాన్ మాగ్నైట్ మొత్తం 1,775 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 1,749 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య కొద్దిగా పెరిగింది. యూనిట్ల పరంగా చూస్తే పెరుగుదల పెద్దగా కనిపించకపోయినా, తీవ్ర పోటీ నెలకొన్న కాంపాక్ట్ SUV మార్కెట్లో వృద్ధిని కొనసాగించడం కూడా ఒక సానుకూల అంశంగానే చెప్పాలి.

Nissan Magnite April 2026 Sales Recorded 1 Percent Growth Compared To Previous

శాతాల పరంగా లెక్కిస్తే, మాగ్నైట్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన సుమారు 1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో అనేక కొత్త మోడళ్లు, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు, అప్‌డేటెడ్ వేరియంట్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, మాగ్నైట్ తన వినియోగదారుల బేస్‌ను నిలబెట్టుకోవడం గమనార్హం. ఇది నిస్సాన్ బ్రాండ్‌పై ఉన్న విశ్వాసాన్ని, మాగ్నైట్‌కు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. రానున్న రోజుల్లో ఈ కారు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

నిస్సాన్ మాగ్నైట్ ఆకర్షణీయమైన, బోల్డ్ SUV డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. మస్క్యులర్ స్టైలింగ్‌, ముందు భాగంలో పెద్ద ఆక్టాగనల్ గ్రిల్, స్లీక్ LED DRLs, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ బంపర్ దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, బలమైన క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో స్టైలిష్ LED టెయిల్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన టెయిల్‌గేట్ డిజైన్ SUVకి మరింత ఆధునిక రూపాన్ని తీసుకొచ్చాయి.

Nissan Magnite April 2026 Sales Recorded 1 Percent Growth Compared To Previous

ఫీచర్ల పరంగా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ESC, TPMS వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా పలు అత్యాధునిక ఫీచర్స్ డజన్ల కొద్ది ఈ కారులో అందించారు.

నిస్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే, టాప్ వేరియంట్ రూ. 9.88 లక్షలకు చేరుతుంది. ఈ ధరలోనే ఆకర్షణీయమైన SUV డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి స్పేస్‌ను అందించడంతో చాలా మంది తమ మొదటి కారుగా మాగ్నైట్‌ను పరిశీలిస్తున్నారు.

Nissan Magnite April 2026 Sales Recorded 1 Percent Growth Compared To Previous

పనితీరు విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT లేదా CVT గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు. మైలేజ్ పరంగా ఈ SUV సుమారు 17 నుంచి 24 kmpl వరకు ఇస్తుంది. అలాగే CNG కిట్‌ను కూడా అమర్చుకునే అవకాశం ఉండటంతో, తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్.

Article Published On: Saturday, May 30, 2026, 17:03 [IST]
English summary
Nissan magnite april 2026 sales recorded 1 percent growth compared to previous
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+