డౌన్ పేమెంట్ ఏం లేదు.. నెలకు రూ.9,399 చెల్లించి 7 సీటర్ వాడొచ్చు.. కారు కొనలేకపోతున్న వారికి పండగే
భారత మార్కెట్లో తన స్థిరత్వాన్ని పెంచుకోవడానికి నిస్సాన్ (Nissan) కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. కేవలం కొత్త కార్లు విడుదల చేయడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు కొనుగోలు విధానాల్లో కూడా కొత్త ఆప్షన్లు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు లీజింగ్, సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టి మార్కెట్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో నిస్సాన్ మాగ్నైట్, గ్రావైట్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఇవి ఇప్పటికే ధర, ఫీచర్లు, మైలేజ్ పరంగా వినియోగదారుల మధ్య మంచి గుర్తింపును పొందాయి. ఇప్పుడు ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేయడానికి సంప్రదాయ ఫైనాన్స్ లేదా క్యాష్ ఆప్షన్‌లతో పాటు, లీజు, సబ్‌స్క్రిప్షన్ వంటి కొత్త విధానాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త కార్యక్రమం ద్వారా వినియోగదారులు ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా, నెలవారీ చెల్లింపులతో కారును ఉపయోగించుకోవచ్చు. ఇది ముఖ్యంగా యువత, అలాగే తరచుగా కార్లను మార్చుకోవాలనుకునే కస్టమర్లకు మరింత అనుకూలంగా ఉంటుంది. వాహనం మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్ వంటి బాధ్యతలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉండే అవకాశం ఉండటంతో, యూజర్లకు టెన్షన్ తగ్గుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి ఏవీఎస్ ఇండియాతో నిస్సాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

లీజింగ్ లేదా సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన మొత్తం ప్రక్రియను ఏవిస్ ఇండియా నిర్వహిస్తుంది. బుకింగ్ నుంచి డెలివరీ వరకు, అలాగే సర్వీస్ మేనేజ్‌మెంట్ వరకు అన్ని సేవలను ఒకే చోట అందించే విధంగా ఈ భాగస్వామ్యం పనిచేస్తుంది. ఈ కొత్త లీజింగ్, సబ్‌స్క్రిప్షన్ పథకాన్ని Nissan చాలా ప్రాక్టికల్‌గా డిజైన్ చేసింది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, గరిష్టంగా 60 నెలల వరకు కాలపరిమితిని అందిస్తోంది.
అలాగే మొత్తం ఉపయోగంలో 50,000 కిలోమీటర్ల వరకు మైలేజ్ లిమిట్‌ను కూడా నిర్ణయించింది. అంటే, దీర్ఘకాలం కారును ఉపయోగించాలనుకునే వారికి ఇది సులభమైన, ఫ్లెక్సిబుల్ ఆప్షన్‌గా మారుతుంది. ఈ పథకం ద్వారా కంపెనీ కేవలం వ్యక్తిగత వినియోగదారులనే కాదు, కార్పొరేట్ మొబిలిటీ సెగ్మెంట్‌ను కూడా టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలు పెద్ద మొత్తంలో ముందస్తు పెట్టుబడి పెట్టకుండా, నెలవారీ చెల్లింపులతో కార్లను ఉపయోగించుకునే అవకాశం పొందుతాయి.

ధర విషయంలో కూడా ఈ స్కీమ్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ లీజింగ్ ప్లాన్‌లో నెలవారీ అద్దె కేవలం రూ. 9,399 నుంచే ప్రారంభమవుతుంది (జీఎస్టీ మినహాయించి). ఈ ధరతో ఒక బ్రాండ్ న్యూ కారును ఉపయోగించుకోవడం అనేది చాలా మందికి ఆసక్తికరంగా అనిపించే అంశం. ఈ పథకం కింద ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్‌తో పాటు, 7-సీటర్ ఎంపీవీగా మంచి ఫీచర్లు, సౌకర్యాలతో వచ్చిన గ్రావైట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
భారత మార్కెట్లో నిస్సాన్ తన కార్లను చాలా కాంపిటిటివ్ ధరల్లో అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో ఎక్కువ మందిని టార్గెట్ చేస్తూ, ధర-ఫీచర్లలో మంచి బ్యాలెన్స్‌ను చూపిస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్నమాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ. 5.62 లక్షలతో అందుబాటులో ఉంది. ఈ ధరతో స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లు, కలిపి మాగ్నైట్‌ను ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మోడల్‌గా నిలబెట్టాయి.

గ్రావైట్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు. 7-సీటర్ కాన్ఫిగరేషన్, మెరుగైన స్పేస్, అలాగే కొత్త ఫీచర్లతో ఇది పెద్ద కుటుంబాలకు సరైన ఆప్షన్‌గా మారుతోంది. మొత్తానికి, ఈ రెండు మోడళ్లను తక్కువ ధరలో అందించడం ద్వారా Nissan భారత మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. ఈ ధరలే ఇప్పుడు కంపెనీ తీసుకొచ్చిన లీజింగ్, సబ్‌స్క్రిప్షన్ పథకాలకు కూడా బలం చేకూరుస్తున్నాయి.


Click it and Unblock the Notifications