ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే థియేటర్ ఫీలింగ్ రావడం గ్యారెంటీ.. నిస్సాన్ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసిందిగా

భారతదేశ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ (Midsize SUV) మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan India) సర్వం సిద్ధం చేసుకుంది. దేశీయ మార్కెట్లో చాలా కాలంగా కేవలం మాగ్నైట్ కారుతోనే నెట్టుకొస్తున్న నిస్సాన్, ఇటీవల 7-సీటర్ విభాగంలో గ్రావైట్‎ను పరిచయం చేసింది.

అయితే, ఇప్పుడు మోస్ట్ అవేటెడ్ మెగా మోడల్ అయిన నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton) లాంచ్ డేట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీని జులై 9న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఈ కారు మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం కింగ్ లాగా ఏలుతున్న హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

Nissan Tekton midsize suv india launch date july 9 features price creta killer telugu

రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌పైనే తయారీ
నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీని ప్రముఖ రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ప్లాట్‌ఫామ్‌ ఆధారంగానే రూపొందించారు. చెన్నైలోని రెనో-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్‌లో ఈ కారును పూర్తిస్థాయిలో తయారు చేస్తున్నారు. అయితే, డస్టర్‌తో పోలిస్తే దీని డిజైన్ పూర్తిగా భిన్నంగా, క్లాసిక్‌గా ఉండబోతోంది. డస్టర్ కారు రగ్గడ్ అండ్ రఫ్ లుక్‌తో కనిపిస్తే.. నిస్సాన్ టెక్టాన్ మాత్రం అత్యంత ప్రీమియం అండ్ లగ్జరీ లుక్‌తో మార్కెట్లోకి రానుంది. ఈ కారును భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఇక్కడి నుండే ఎగుమతి చేయాలని నిస్సాన్ ప్లాన్ చేస్తోంది.

క్రోమ్ గ్రిల్, ఎల్‌ఈడీ కనెక్టెడ్ లైట్లు
డిజైన్ పరంగా నిస్సాన్ టెక్టాన్ రోడ్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉండబోతోంది. దీని ఫ్రంట్ గ్రిల్ చాలా పెద్దదిగా ఉండి, కారుకు రాయల్ వైబ్స్ ఇచ్చేలా క్రోమ్ ఎలిమెంట్స్‌ను ఎక్కువగా వాడారు. కారు ముందు భాగంలో బుల్-బార్ లాంటి సిల్వర్ ఫినిషింగ్ డిజైన్, బాడీ కలర్డ్ ఎలిమెంట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇందులో సరికొత్త ట్రెండ్‌కు తగ్గట్టుగా LED కనెక్టెడ్ DRLs, వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఇచ్చారు. వీటి మధ్యలో నిస్సాన్ సరికొత్త లోగో మెరిసిపోతూ ఉంటుంది.

Nissan Tekton midsize suv india launch date july 9 features price creta killer telugu

పనోరమిక్ సన్‌రూఫ్‌తో లగ్జరీ ఇంటీరియర్
ఈ ఎస్‌యూవీకి కఠినమైన రోడ్లపై కూడా సులభంగా దూసుకెళ్లేలా 212 mm భారీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే కొత్త డిజైన్ కలిగిన 18-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, 225-సెక్షన్ బ్రాడ్ టైర్లతో కారుకు ఒక స్ట్రెయిట్-అప్‌రైట్ స్టాన్స్ లభించింది. ఇంటీరియర్ విషయానికి వస్తే, సరికొత్త కలర్ థీమ్స్, ప్రీమియం సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో డ్యాష్‌బోర్డ్‌ను డిజైన్ చేశారు.

ఇందులో గూగుల్ బిల్ట్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచుల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

Nissan Tekton midsize suv india launch date july 9 features price creta killer telugu

లెవెల్-2 అడాస్ (ADAS) సేఫ్టీ..
ప్రస్తుత కాలంలో కార్లకు సేఫ్టీ అనేది అత్యంత ముఖ్యం. అందుకే నిస్సాన్ టెక్టాన్‌లో లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీనితో పాటు 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌లాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా రానున్నాయి.

ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. బేస్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండగా, హయ్యర్ వేరియంట్లలో 1.3-లీటర్ పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్ రానుంది. వీటికి తోడు మైలేజ్ ప్రియుల కోసం 1.8-లీటర్ ఇంజన్, 1.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కూడా నిస్సాన్ తీసుకురాబోతోంది.

Article Published On: Thursday, May 21, 2026, 13:56 [IST]
English summary
Nissan tekton midsize suv india launch date july 9 features price creta killer telugu
Read more on: #nissan #new launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+