మారుతి, టాటాలకు వెన్నులో వణుకు మొదలైంది.. నిస్సాన్ టెక్టాన్ సునామీ వచ్చేస్తోంది

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan) భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవడానికి భారీ స్కెచ్ వేసింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు సవాల్ విసురుతూ, మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌లో ఒక పవర్‌ఫుల్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. అదే నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton). ఫిబ్రవరి 4న ఈ కారును అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉన్నప్పటికీ, ఒక చిన్న వ్యూహాత్మక మార్పు కారణంగా ఇది కొద్దిగా ఆలస్యమైంది.

నిస్సాన్ సంస్థ తన సరికొత్త ఎస్‌యూవీ టెక్టాన్‌ను ఫిబ్రవరి 4న ఆవిష్కరిస్తుందని అందరూ భావించారు. కానీ, అంతకంటే ముందే తన 7-సీటర్ ఎంవీవీ నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)ను మార్కెట్లోకి పంపాలని నిస్సాన్ నిర్ణయించుకుంది. నిస్సాన్ గ్రావైట్ ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. గ్రావైట్ లాంచ్ పూర్తయిన వెంటనే, టెక్టాన్ ఆవిష్కరణ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. అంటే ఈ ఫిబ్రవరి నెలలోనే నిస్సాన్ రెండు పెద్ద అస్త్రాలను వదలబోతోందన్నమాట.

Nissan Tekton SUV India Launch Postponed New Unveil Date and Feature Details

నిస్సాన్ టెక్టాన్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది రోడ్డుపై ఒక రాజసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కారు డిజైన్ నిస్సాన్ ప్రసిద్ధ గ్లోబల్ మోడల్ నిస్సాన్ పెట్రోల్ నుంచి స్ఫూర్తి పొందింది. దీనికి పవర్‌ఫుల్ గ్రిల్, C-షేప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. 17 లేదా 18 ఇంచుల అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ , మజిల్ లాంటి బాడీ లైన్స్ కారుకు ఒక అడ్వెంచరస్ లుక్ ఇస్తాయి. కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, టెక్టాన్ బ్యాడ్జింగ్‌తో కారు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

లోపల అడుగుపెడితే, మీరు ఒక లగ్జరీ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. టెక్టాన్‌లో నిస్సాన్ ఎలాంటి ఫీచర్లను కూడా వదల్లేదు. 10.1 ఇంచ్ లార్జ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు (ముందు భాగంలో), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 10.25 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది.

Nissan Tekton SUV India Launch Postponed New Unveil Date and Feature Details

సేఫ్టీ విషయంలో నిస్సాన్ రాజీ పడలేదు. ఈ కారులో లెవల్ 2 అడాస్ (ADAS - Advanced Driver Assistance Systems) ను అమర్చారు. ఇది ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో ప్రమాదాలను అరికడుతుంది. వీటితో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు స్టాండర్డ్ గా రానున్నాయి.

నిస్సాన్ టెక్టాన్ కొత్త తరం రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఇందులో మూడు రకాల ఇంజిన్లు ఉండే అవకాశం ఉంది:
1.0 లీటర్ టర్బో పెట్రోల్: సిటీలో ప్రయాణించడానికి, మంచి మైలేజ్ ఇచ్చే ఇంజిన్ ఇది.
1.3 లీటర్ టర్బో పెట్రోల్: హైవేలపై వేగంగా వెళ్లాలనుకునే వారికి, ఎక్కువ హార్స్ పవర్ ఇచ్చే ఇంజిన్ ఇది.
1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఈ ఇంజిన్ అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది, ఇది పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

Nissan Tekton SUV India Launch Postponed New Unveil Date and Feature Details

నిస్సాన్ టెక్టాన్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండవచ్చని అంచనా. ఒకవేళ ఇదే ధరలో కారు విడుదలైతే, మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి దిగ్గజ కార్లకు ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే కంపెనీగా నిస్సాన్ తన గుర్తింపును మళ్ళీ దక్కించుకోనుంది.

చాలామంది మధ్యతరగతి ప్రజలు ఒక మంచి ఎస్‌యూవీ కొనాలని కలలు కంటారు. కానీ ధర ఎక్కువగా ఉండటం వల్ల వెనకడుగు వేస్తుంటారు. నిస్సాన్ టెక్టాన్ ఖచ్చితంగా ఆ లోటును భర్తీ చేస్తుంది. జపనీస్ ఇంజనీరింగ్, గ్లోబల్ డిజైన్, ఇండియన్ బడ్జెట్.. ఈ మూడు కలిస్తే వచ్చేదే ఈ నిస్సాన్ టెక్టాన్. మరికొన్ని రోజులు ఓపిక పడితే, రోడ్లపై ఈ సరికొత్త రారాజును చూడొచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, February 5, 2026, 16:37 [IST]
English summary
Nissan tekton suv india launch postponed new unveil date and feature details
Read more on: #nissan #upcoming cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+