ఇంకొన్ని గంటల్లో ఇండియాలో అదిరిపోయే కారు లాంచ్ కానుంది.. అందరి చూపు రేపటి వైపే!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇప్పుడు భారత్‌లో మరో కీలక అడుగు వేయబోతోంది. దేశంలో అత్యంత పోటీ నెలకొన్న మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి ప్రవేశించేందుకు కంపెనీ తన కొత్త టెక్టన్ (Tekton) ఎస్‌యూవీని సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ మోడల్‌పై ఆటోమొబైల్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, అన్ని ఊహాగానాలకు తెరదిస్తూ ఈ SUV జూలై 9న భారత మార్కెట్‌లో అధికారికంగా తొలి అడుగు పెట్టనుంది. మాగ్నైట్, గ్రావైట్ మోడళ్లతో భారత మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకున్న కంపెనీ తన తదుపరి కారుగా టెక్టన్‌ను తీసుకొస్తుంది. వాస్తవానికి ఈ మోడల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పరిచయం చేయాలని నిస్సాన్ భావించింది. అయితే కొన్ని వ్యాపార, అభివృద్ధి సంబంధిత కారణాలతో విడుదల వాయిదా పడింది.

చివరికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న కంపెనీ ఇప్పుడు టెక్టన్‌ను భారత వినియోగదారుల ముందుకు తీసుకురానుంది. ఇది రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన రీబ్యాడ్జ్డ్ మోడల్ అయినప్పటికీ, డిజైన్, స్టైల్ పరంగా నిస్సాన్ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉండేలా రూపొందించింది. డిజైన్ విషయానికి వస్తే, టెక్టాన్ లుక్‌కు నిస్సాన్ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న ప్రీమియం SUV ప్యాట్రోల్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తుంది.

Nissan Tekton Suv India Unveil Tomorrow Expected Design Engine Features

ముందు భాగంలో పెద్ద గ్రిల్, దానిపై అడ్డంగా ఉండే స్టైలిష్ ఎలిమెంట్లు, బోనెట్ అంచుపై TEKTON అక్షరాలు ఈ SUVకి బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను తీసుకువస్తాయి. చతురస్రాకార LED హెడ్‌ల్యాంప్స్, వాటికి ఇరువైపులా నిలువుగా అమర్చిన LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, అలాగే బంపర్‌పై కనిపించే ఎరుపు రంగు ట్రిమ్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. సైడ్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే బాడీ లైన్లు టెక్టాన్‌కు రగ్గడ్ SUV లుక్‌ను అందిస్తున్నాయి.

రూఫ్ రైల్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బలమైన షోల్డర్ లైన్లు ఈ కారుకి మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. వెనుక భాగంలో పూర్తి వెడల్పున విస్తరించిన స్లిమ్ LED లైట్ బార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి తోడు మందపాటి బ్లాక్ బంపర్ క్లాడింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ స్టైల్ ఇన్సర్ట్‌లు, ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్లు, రియర్ స్పాయిలర్, రియర్ వైపర్ వంటి అంశాలు SUVకు ప్రీమియం, అడ్వెంచర్ లుక్‌ను ఇస్తున్నాయి.

Nissan Tekton Suv India Unveil Tomorrow Expected Design Engine Features

ఇంజన్ పరంగా రెండు టర్బో పెట్రోల్ ఇంజన్‌లతో రావచ్చు. బేస్ వేరియంట్లలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉండనుంది. ఇది గరిష్టంగా 100 బీహెచ్‌పీ పవర్, 160 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ కూడా అందుబాటులో ఉండనుంది. ఇది 163 బీహెచ్‌పీ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయడంతో ఈ SUVకి మెరుగైన పనితీరు లభించే అవకాశం ఉంది.

ఇంటీరియర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నిస్సాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే రెనాల్ట్ కొత్త డస్టర్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఫీచర్లలో చాలా వరకు టెక్టన్‌లో కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, పాసివ్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ వంటివి ఉండనున్నాయి.

Nissan Tekton Suv India Unveil Tomorrow Expected Design Engine Features

భద్రత విషయంలో కూడా టెక్టన్ ఏ మాత్రం రాజీ పడేలా కనిపించడం లేదు. ఈ SUVలో లెవెల్-2 ADAS అందించే అవకాశం ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, 360-డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటాయి.

Article Published On: Wednesday, July 8, 2026, 18:33 [IST]
English summary
Nissan tekton suv india unveil tomorrow expected design engine features
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+