ఈ కారు వెనుక నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి.. ఇక ఫుల్ బాడీ చూస్తే ఫిదా అయిపోవడం ఖాయం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడానికి నిస్సాన్ కంపెనీ తన సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)ను సిద్ధం చేస్తోంది. ఈ కారు జూలై 9వ తేదీన అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఎస్‌యూవీ కోసం కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, దీనికి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ కారు వెనుక భాగం ఎలా ఉంటుందో చూపించే ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ లీకైన పిక్ చూశాక నిస్సాన్ టెక్టాన్ లుక్స్ పరంగా మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

లీకైన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల ప్రకారం.. నిస్సాన్ టెక్టాన్ వెనుక భాగం చాలా పవర్‌ఫుల్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. ఇందులో ఈ కాలపు ట్రెండ్‌కు తగ్గట్టుగా అట్రాక్టివ్ కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్ అందించారు. కారు బూట్‌లిడ్ డిజైన్ ఎలాంటి ప్లాస్టిక్ క్లాడింగ్ లేకుండా చాలా నీట్‌గా ఉంది, దానిపై గంభీరంగా TEKTON అని రాసి ఉంది. ఇవి కాకుండా కారు పైభాగంలో రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, వెనుక విండ్‌స్క్రీన్ వైపర్, హై-మౌంటెడ్ స్టాప్ లైట్, కారుకు ప్రీమియం లుక్ ఇచ్చేలా అద్భుతమైన డైమండ్ కట్ అలాయ్ వీల్స్‌ను కూడా నిస్సాన్ జోడించింది.

Nissan Tekton SUV Rear Design Leaked Ahead of Launch Hybrid Variant and Premium Features Revealed

ఈ కారు వెనుక లుక్ ఇప్పుడే లీక్ అయినప్పటికీ, దీని ముందు భాగం ఎలా ఉంటుందో కంపెనీ ఇప్పటికే టీజర్ల ద్వారా అధికారికంగా హింట్ ఇచ్చింది. నిస్సాన్ టెక్టాన్ ఫ్రంట్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా, రగ్గడ్‌గా ఉంది. కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన గ్లోబల్ ఎస్‌యూవీ నిస్సాన్ పెట్రోల్ (Nissan Patrol) డిజైన్ ఆధారంగా దీనిని రూపొందించారు. పూర్తి కారును ఎలాంటి కవర్లు లేకుండా రోడ్డుపై చూడకపోయినప్పటికీ, టీజర్లలోని దీని లుక్ చూసి జనాలు అప్పుడే మెస్మరైజ్ అయిపోతున్నారు.

కారు లోపలి భాగం, ఫీచర్ల విషయానికి వస్తే, నిస్సాన్ టెక్టాన్ దాదాపు రాబోయే సరికొత్త రెనాల్ట్ డస్టర్ (Renault Bigster/Duster) లాగే ఉండే అవకాశం ఉంది. ఇందులో డ్రైవర్ వైపు కాస్త వంగి ఉండేలా కనెక్ట్ చేసిన డ్యూయల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే వెంటిలేటెడ్ పవర్డ్ డ్రైవర్ సీట్, టిల్ట్-టెలిస్కోపిక్ స్ట్రీరింగ్, ఆకాశాన్ని చూస్తూ ప్రయాణించేలా పనోరమిక్ సన్‌రూఫ్, ముందు వెనుక టైప్-సి యూఎస్‌బీ పోర్టులు, రియర్ ఏసీ వెంట్స్, లగేజీ పెట్టుకోవడానికి ఏకంగా 700 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభించనున్నాయి.

Nissan Tekton SUV Rear Design Leaked Ahead of Launch Hybrid Variant and Premium Features Revealed

పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లతో రానుంది. మొదటిది 1-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (100 PS పవర్ - 166 Nm టార్క్) కాగా, రెండవది మరింత పవర్‌ఫుల్ అయిన 1.3-లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (163 PS పవర్ - 280 Nm టార్క్). ఈ రెండు ఇంజన్లకూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే పెద్ద ఇంజన్ వేరియంట్‌లో 6-స్పీడ్ వెట్ క్లచ్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ప్యూర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ కావడం విశేషం.

ఈ సంవత్సరం చివరి నాటికి నిస్సాన్ టెక్టాన్‌లో మూడవ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌గా 1.8-లీటర్ పెట్రోల్-స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా తీసుకురానున్నారు. ఇందులో అత్యుత్తమమైన 1.3 kWh బ్యాటరీ, ప్రత్యేక హైబ్రిడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండబోతున్నాయి. ధర విషయానికి వస్తే ఈ కారు సుమారు రూ. 11 లక్షల నుంచి రూ. 18 లక్షల బడ్జెట్ శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియెర్రా వంటి పాపులర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Article Published On: Monday, June 29, 2026, 15:01 [IST]
English summary
Nissan tekton suv rear design leaked ahead of launch hybrid variant and premium features revealed
Read more on: #nissan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+