బైక్ లాగా 34 కి.మీ మైలేజ్ ఇచ్చే అద్భుతమైన 3 CNG కార్లు.. తక్కువ జీతం ఉన్నవాళ్లు కూడా కొనగలరు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలపై ఇంధన భారం మరింత పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరుకు సుమారు రూ.3 వరకు ధరలను పెంచడంతో ప్రతిరోజూ వాహనాలను ఉపయోగించే మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఖర్చుల విషయంలో మరింత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి సీఎన్‌జీ కార్లు మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, అలాగే పెట్రోల్ కార్లతో సమానమైన సౌకర్యాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి కంపెనీ నుంచి మంచి పనితీరును అందించే పలు సీఎన్జీ కార్లు రోజువారి ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. వాటి గురించి ఈ కింది కథనంలో చూద్దాం.
Maruti Suzuki Celerio: మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫీచర్ల పరంగా సెలెరియో తన సెగ్మెంట్‌లో మంచి ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. అలాగే ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా కంపెనీ చేర్చింది.

సెలెరియోలో కొత్త K10C డ్యూయల్‌జెట్ 1.0-లీటర్ 3-సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ 66 hp పవర్, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాల్లో స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇవ్వడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కూడా ఇది అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, సెలెరియో సీఎన్‌జీ ఒక కిలోగ్రాము సీఎన్‌జీకి సుమారు 35.60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటిస్తోంది.
Maruti Suzuki Wagon R: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.5.89 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. మంచి మైలేజ్, విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ఈ కారు ఇప్పటికీ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది కిలోగ్రాముకు సుమారు 34.05 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.

దీంతో రోజువారీ ప్రయాణాలు చేసే మధ్యతరగతి కుటుంబాలకు ఇది తక్కువ రన్నింగ్ ఖర్చుతో మంచి ఎంపికగా మారుతోంది. టాల్-బాయ్ డిజైన్ కారణంగా లోపల ఎక్కువ స్థలం లభించడం, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతి ఇవ్వడం వల్ల ఈ కారుకు ఎన్నో సంవత్సరాలుగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో వాగన్ ఆర్ సీఎన్‌జీ వేరియంట్‌ను ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు.
Maruti Suzuki Dzire: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో మారుతి డిజైర్ ఒకటి. స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ఈ కారుకు ఎన్నో సంవత్సరాలుగా భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డిజైర్ సీఎన్‌జీ వేరియంట్ కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మారుతి సుజుకి ఈ కారులో VXi, ZXi వేరియంట్లలో సీఎన్‌జీ ఆప్షన్‌ను అందిస్తోంది.

ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8.03 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. పనితీరు విషయానికి వస్తే, సీఎన్‌జీ మోడ్‌లో ఈ కారు గరిష్టంగా 70 hp పవర్, 102 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. అలాగే 55-లీటర్ల సీఎన్‌జీ ట్యాంక్‌ను అందించారు. మైలేజ్ విషయానికి వస్తే, కిలో సీఎన్‌జీకి సుమారు 33.73 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications