లీటరు పెట్రోల్‌తో 28 కిమీ.. రోజూ ఆఫీసుకెళ్లేవారికి వరంలా మారిన 5 కార్లు
పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూస్తుంటే సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. రోజూ ఆఫీసుకి కారులో వెళ్లాలంటే జేబు చిల్లు పడాల్సిందే. ఎలక్ట్రిక్ కారు(Electric Cars) కొందామంటే ఛార్జింగ్ టెన్షన్, లాంగ్ జర్నీలో ఆగిపోతుందన్న భయం. ఇలాంటి చిక్కులన్నింటికీ ఏకైక పరిష్కారం హైబ్రిడ్ కార్స్(hybrid Cars). పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పనిచేసే ఈ కార్స్, మీకు ఊహించని మైలేజీని అందిస్తాయి. మరి ఆఫీసు ప్రయాణాలకు అతి తక్కువ ఖర్చుతో రాజసంలా దూసుకెళ్లే ఆ టాప్-5 కార్ల విశేషాలు తెలుసుకుందాం.
పెట్రోల్ ఖర్చుకు చెక్ పెట్టే హైబ్రిడ్ మ్యాజిక్
ప్రస్తుత కాలంలో హైబ్రిడ్ కార్స్(hybrid Cars) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారాయి. వీటిలో బ్యాటరీని విడిగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రయాణంలోనే అది ఆటోమేటిక్‌గా రీఛార్జ్ అవుతుంది. ముఖ్యంగా నగరాల్లోని ట్రాఫిక్ జామ్‌లలో ఈ కార్స్ ఎలక్ట్రిక్ మోడ్‌లోకి మారిపోయి ఒక్క చుక్క పెట్రోల్(Petrol Price) కూడా ఖర్చు కాకుండా చూస్తాయి.

1. మారుతి సుజుకి గ్రాండ్ విటారా:
నగరాల్లో ఆఫీసుకెళ్లే ఉద్యోగుల మొదటి ఛాయిస్ మారుతి గ్రాండ్ విటారా(Maruti Grand Vitara Hybrid). ఇది లీటరుకు ఏకంగా 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. భారీ ట్రాఫిక్‌లో కూడా ఇది నిశ్శబ్దంగా, అత్యంత పొదుపుగా ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు 16.63 లక్షల రూపాయలుగా ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పక్కా పైసా వసూల్ ఎస్‌యూవీ.
2. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్:
టయోటా కంపెనీకి ఉన్న బ్రాండ్ విలువ, హైబ్రిడ్ టెక్నాలజీలో ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైరైడర్(Toyota Hyryder Hybrid) కూడా గ్రాండ్ విటారా లాగే 27.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బాడీ ఆఫీస్ పార్కింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీని ధర 16.77 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది.

3. హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ:
మీకు ఎస్‌యూవీల కంటే సెడాన్ కార్లంటే ఇష్టమా? అయితే హోండా సిటీ హైబ్రిడ్(Honda City eHEV) మీకు సరిగ్గా సరిపోతుంది. ఇది లీటరుకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఆఫీసు పని ఒత్తిడి తర్వాత ప్రశాంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప వరం. దీని ధర 19.99 లక్షల రూపాయల వద్ద ఉంది.
4. టయోటా ఇన్నోవా హైక్రాస్:
మీరు పెద్ద ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలన్నా లేదా ఆఫీస్ కొలీగ్స్‌తో కలిసి వెళ్లాలన్నా ఇన్నోవా హైక్రాస్(Toyota Innova Hycross Hybrid) మించిన ఆప్షన్ లేదు. ఇంత పెద్ద కారు కూడా లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వడం విశేషం. దీనిలోని ప్రీమియం క్యాబిన్, సన్‌రూఫ్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తాయి. దీని ధర 26.76 లక్షల రూపాయల నుండి లభిస్తుంది.

5. మారుతి సుజుకి ఇన్విక్టో:
ఇది టయోటా హైక్రాస్ మోడల్‌కు మారుతి వెర్షన్ ఇన్విక్టో(Maruti Suzuki Invicto). ఇది కూడా లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. విశాలమైన సీటింగ్, అధునాతన ఫీచర్లతో కూడిన ఈ ఎంపీవీ, మారుతి సుజుకి నెట్‌వర్క్ భరోసాతో వస్తోంది. ప్రీమియం అనుభూతిని కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. దీని ప్రారంభ ధర 24.97 లక్షల రూపాయలు.
మీ జేబుకు ఏది పొదుపు?
మీరు రోజూ తక్కువ దూరమే ఆఫీసుకి వెళ్తుంటే గ్రాండ్ విటారా లేదా హైరైడర్ సరైనవి. ఒకవేళ లగ్జరీ, హోదా ముఖ్యం అనుకుంటే హోండా సిటీ లేదా ఇన్నోవా వైపు మొగ్గు చూపవచ్చు. మొత్తానికి, పెట్రోల్ బిల్లుల భారం తగ్గించుకోవాలనుకునే వారికి ఈ 2026లో ఈ హైబ్రిడ్ కార్లే అసలైన ఫ్రెండ్స్.


Click it and Unblock the Notifications