ఆటోడ్రైవర్ల కడుపు నింపే ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 90 కిమీ.. ధర కూడా రూ. 2.55 లక్షలే

భారతదేశంలో కమర్షియల్ వాహనాల రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న పియాజియో (Piaggio) సంస్థ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో సరికొత్త దాడికి తెరలేపింది. పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగానే సరికొత్త ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ఆపే వేవ్ (Ape WavE)ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సామాన్యుల, మధ్య తరగతి ఆటో డ్రైవర్ల బడ్జెట్‎ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ ఆటోను ఎల్3 (L3) ప్యాసింజర్ ఈవీ కేటగిరీ కింద అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్లో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను కేవలం రూ.2.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

సింగిల్ ఛార్జ్‌తో 90 కిలోమీటర్ల జర్నీ
పట్టణ ప్రాంతాల్లో నిత్యం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే ఆటో డ్రైవర్ల రోజు వారీ అవసరాలకు తగ్గట్లుగా ఈ పియా జియో ఆపే వేవ్ ఆటోను అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇందులో పవర్ఫుల్ పర్ఫామెన్స్ కోసం కంపెనీ 5.4 kWh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించింది.

piaggio ape wave electric auto launched in india price features range

దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 3 kW గరిష్ట శక్తిని, 25Nm టాప్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌కు అనుగుణంగా దీని టాప్ స్పీడ్ గంటకు 40 కిమీగా నిర్ణయించారు. కేవలం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఆటో నిరంతరాయంగా 90 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. పైగా దీని బ్యాటరీ కేవలం 4.5 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.

మెటల్ బాడీ, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్
భారతీయ రోడ్ల మీద ఉండే సవాళ్లను తట్టుకునేందుకు ఈ త్రీ వీలర్లో పియాజియో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను జోడించింది. రోడ్లపై ఉండే ఎత్తుపల్లాలను, ఫ్లై ఓవర్లను సులభంగా ఎక్కడానికి వీలుగా ఇందులో 19 శాతం గ్రేడబిలిటీని అందించారు.

కారు బాడీ పరంగా చూస్తే, దీనిని పూర్తి మెటల్ బాడీ, మోనోకోక్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. దీనివల్ల కమర్షియల్ వాడకంలో ఈ ఆటో ఎక్కువ కాలం పాటు మన్నిక వస్తుంది. ప్రయాణికులకు కుదుపులు లేని ప్రయాణాన్ని అందించడానికి స్పెషల్ సస్పెన్షన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు. అలాగే కచ్చా రోడ్లపై బ్యాటరీ దెబ్బతినకుండా ఉండేందుకు 180 మిమీ (mm) గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. డ్రైవర్ మరియు ప్యాసింజర్లు కూర్చోవడానికి విశాలమైన క్యాబిన్ స్పేస్ ఇందులో లభిస్తుంది.

ఖరీదైన ఆటోల రేంజ్ కంఫర్ట్
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఫ్లీట్ ఆపరేటర్లకు, ఆటో డ్రైవర్లకు ఈ కారు భారీగా డబ్బు ఆదా చేయనుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలతో పోలిస్తే దీని రోజు వారీ రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. పియా జియో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమర్లకు తక్కువ బడ్జెట్ ఉండే L3 కేటగిరీ ధరలోనే, ఖరీదైన L5 కేటగిరీ ఆటోలలో లభించే సౌకర్యం, భద్రత, డ్రైవింగ్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆపే వేవ్‎ను రూపొందించారు.

తక్కువ దూర ప్రయాణాలు, ఫిక్స్‌డ్ రూట్లలో నడిపేవారికి ఇది చక్కగా సరిపోతుంది. పియాజియో వెహికల్స్ చైర్మన్ అండ్ ఎండి డీగో గ్రాఫీ మాట్లాడుతూ.. భారతీయ ఈవీ మార్కెట్ వేగంగా మారుతోందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే నమ్మకమైన వాహనాల కోసం చూస్తున్న డ్రైవర్ల కలలను ఈ ఆటో నిజం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Article Published On: Tuesday, July 7, 2026, 8:46 [IST]
English summary
Piaggio ape wave electric auto launched in india price features range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+