మోదీ చెప్పిన మాట వినాలంటే ఈ కారు కొనాల్సిందే! ప్లగ్ పెడితే వందల కిలోమీటర్లు.. పెట్రోల్‌కు ఫుల్ స్టాప్!

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం దెబ్బతినడం, ముడి చమురు ఉత్పత్తి కేంద్రాలు ప్రభావితమవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో అనిశ్చితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారతదేశంలో కూడా చమురు కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లాలని సూచించారు. ఎందుకంటే ఇవి కేవలం డబ్బు ఆదా చేయడమే కాదు, భవిష్యత్తులో ఇంధన సంక్షోభానికి కూడా ఒక స్థిరమైన పరిష్కారంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా మోటార్స్ తయారు చేసిన టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చాలా మంచి ఆప్షన్‌.

Pm Naredra Modi Fuel Saving Message Tata Punch Ev Best Choice

దీని నిర్వహణ ఖర్చులు కూడా సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అంటే... పెట్రోల్ బంక్ చుట్టూ తిరిగే రోజులు తగ్గించి, ప్లగ్ పెట్టి ప్రశాంతంగా ప్రయాణించే కాలం వచ్చేసింది అని చెప్పొచ్చు. ఈ కారును కొనుగోలు చేయడం వలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఇంధన వాడకం తక్కువ చేయడంతో పాటు, వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించడానికి తోడ్పాటు అందించిన వారు అవుతారు.

డిజైన్ గురించి చూసినట్లయితే సాధారణ ఎలక్ట్రిక్ కారు లాగా కాకుండా, రేపటి SUV అన్న భావన కలిగించేలా రూపొందించబడింది. ఈ మోడల్ ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, పూర్తి వెడల్పున కనెక్ట్ అయ్యే LED DRLs, షార్ప్‌గా కనిపించే హెడ్‌ల్యాంప్స్‌తో ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తోంది. మొదటి చూపులోనే ఇది సాధారణ చిన్న కారు కాదనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా నగర రోడ్లపై ఈ SUVకి మంచి రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది.

Pm Naredra Modi Fuel Saving Message Tata Punch Ev Best Choice

కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ, ఎత్తైన స్టాన్స్, బలమైన బాడీ డిజైన్, మస్క్యులర్ వీల్ ఆర్చ్‌లు దీనికి ఒక ప్రీమియం SUV ఫీలింగ్‌ను తీసుకొచ్చాయి. లోపల కూర్చుంటే కూడా అదే ప్రీమియం అనుభూతి కొనసాగుతుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆధునిక కనెక్టెడ్ ఫీచర్లు కలిపి ఈ కారును యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ SUV ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.69 లక్షల నుంచి రూ. 12.59 లక్షల వరకు ఉంది. అయితే EV కొనాలి కానీ మొదట్లో ఎక్కువ డబ్బు పెట్టలేము అనుకునే వారి కోసం టాటా ప్రత్యేకంగా 'BaaS' (Battery as a Service) ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కారును సుమారు రూ. 6.49 లక్షల ప్రారంభ ధరతోనే ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

Pm Naredra Modi Fuel Saving Message Tata Punch Ev Best Choice

తర్వాత బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు సుమారు రూ. 2.60 చెల్లించాలి. రేంజ్ విషయంలో 25 kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 265 కి.మీ వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక ఎక్కువ దూరాలు వెళ్లే వారికి 35 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ వెర్షన్ సుమారు 365 కి.మీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, టాటా కార్లు అంటే భారత మార్కెట్లో చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది భద్రతే. అదే నమ్మకాన్ని Tఇది కూడా కొనసాగిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి ఇప్పటికే తన బలాన్ని నిరూపించుకుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో ఈ EV ప్రయాణికులకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది.

Article Published On: Tuesday, May 12, 2026, 10:30 [IST]
English summary
Pm naredra modi fuel saving message tata punch ev best choice
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+