మైలేజీలోనూ, లగ్జరీలోనూ ఈ కారు అరాచకం భయ్యా..డస్టర్ కంటే పెద్దది..ఏడుగురికి సరిపోయే కారు వచ్చేస్తోంది

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault), భారతీయ రోడ్లపై తన పట్టును మరింత పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే తన ఐకానిక్ మోడల్ డస్టర్ (Duster) కొత్త జనరేషన్‌ను సిద్ధం చేసిన కంపెనీ, ఇప్పుడు దానికి ఒక పెద్ద వెర్షన్ అనదగ్గ బిగ్‌స్టర్ (Bigster) 7-సీటర్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

బెంగళూరుకు చెందిన అనిల్ ఈ కారుకు సంబంధించిన కొన్నిస్పెషల్ స్పై షాట్లను షేర్ చేశారు. ఈ ఫోటోలను బట్టి చూస్తే, రెనాల్ట్ బిగ్‌స్టర్ తన టెస్టింగ్ ప్రక్రియను ముమ్మరం చేసిందని స్పష్టమవుతోంది. రెనాల్ట్ బిగ్‌స్టర్ చూడటానికి కొత్త తరం డస్టర్‌ను పోలి ఉన్నప్పటికీ, ఇది దానికంటే చాలా పెద్దదిగా, స్ట్రాంగ్‎గా కనిపిస్తుంది. రెనాల్ట్-నిస్సాన్ కూటమికి చెందిన CMF-B ప్లాట్‌ఫామ్‌పైనే ఇది కూడా తయారైంది.

Renault Bigster 7-Seater Spied The Giant SUV Spotted Testing in Bengaluru

అయితే సాధారణ డస్టర్ కంటే ఈ కారు పొడవు సుమారు 230 మిమీ ఎక్కువగా ఉంటుంది. అనిల్ పంపిన ఫోటోల్లో గమనిస్తే, దీని వెనుక డోర్ (Rear Door) డస్టర్ కంటే కాస్త పొడవుగా ఉంది. అంటే వెనుక కూర్చునే ప్రయాణికులకు ఎక్కువ లెగ్ స్పేస్, మూడో వరుసలోకి వెళ్లడానికి వీలుగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వెనుక విండ్‌షీల్డ్ గుండా చూస్తే, డిక్కీలో అదనంగా రెండు సీట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఇవి ఈ కారును పక్కా 7-సీటర్‌గా మారుస్తున్నాయి.

యూరప్ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కారును ఇండియా వెర్షన్ కోసం మరిన్ని మార్పులతో తెచ్చే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది, ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది దాదాపు 140 bhp వరకు పవర్‌ను జనరేట్ చేస్తుంది.

Renault Bigster 7-Seater Spied The Giant SUV Spotted Testing in Bengaluru

అంతేకాకుండా పర్యావరణ హితం కోసం, ఎక్కువ మైలేజ్ కోసం ఇందులో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కూడా రెనాల్ట్ పరిచయం చేయవచ్చు. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో 163 bhp పవర్‌ను అందిస్తూ, అటు సిటీలోనూ ఇటు హైవే మీదనూ అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.

అంతర్జాతీయ స్థాయిలో బిగ్‌స్టర్ కారులో 17 నుండి 19 అంగుళాల వరకు ఉండే అల్లాయ్ వీల్స్‌ను వాడుతున్నారు. ఇండియాలో టెస్ట్ చేస్తున్న మోడల్‌లో కూడా కొత్త డిజైన్ కలిగిన భారీ అల్లాయ్ వీల్స్ కనిపిస్తున్నాయి. లోపల డ్యాష్ బోర్డ్ విషయానికి వస్తే, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏడీఏఎస్ (ADAS Level 2) వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా వచ్చే ఛాన్స్ ఉంది.

Renault Bigster 7-Seater Spied The Giant SUV Spotted Testing in Bengaluru

భారత మార్కెట్లో 7-సీటర్ ఎస్‌యూవీలకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, రెనాల్ట్ ఈ కారును 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వస్తే మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, కియా క్యారెన్స్ క్లావిస్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఒకప్పుడు డస్టర్ తో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన రెనాల్ట్, ఇప్పుడు బిగ్‌స్టర్‌తో తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని చూస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 19, 2026, 18:30 [IST]
English summary
Renault bigster 7 seater spied the giant suv spotted testing in bengaluru
Read more on: #renault #test #test drive
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+