డస్టర్ తమ్ముడు డిఫెండర్ లుక్‌లో వస్తున్నాడు! బ్రిడ్జర్ టీజర్ సంచలనం.. 7 సీటర్ 10 లక్షల్లో వస్తుందా?

భారతదేశంలో రెనాల్ట్ (Renault) కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చిన కార్లలో డస్టర్ (Duster) ఒకటి. ఈ SUV భారత మార్కెట్‌లో ఎన్నో సంవత్సరాలుగా మంచి డిమాండ్‌ను పొందుతూ, కుటుంబాలకు అనువైన బలమైన వాహనంగా పేరు సంపాదించింది. తాజాగా ఈ డస్టర్‌ను కంపెనీ కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి మళ్లీ పరిచయం చేసింది. ఈ కొత్త లుక్‌తో వచ్చిన డస్టర్ ఆటో ప్రియులలో మళ్లీ ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉండగా, రెనాల్ట్ ఇప్పుడు భారత మార్కెట్ కోసం మరో కొత్త SUVపై పని చేస్తోంది. డస్టర్‌ను పోలిన డిజైన్‌తో, అయితే దానికంటే పెద్దదిగా ఉండే ఈ కొత్త వాహనం 7 మంది కూర్చునేలా రూపొందించబడుతోంది.

మార్కెట్‌లో ఈ మోడల్‌కు బ్రిడ్జర్ (Bridger) అనే పేరు పెట్టే అవకాశముందని ఆటో రంగంలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ కొత్త SUV కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మరింత ధృవీకరించేందుకు రెనాల్ట్ తాజాగా ఒక కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఆ టీజర్ ప్రకారం, ఈ కొత్త SUVను మొదట కాన్సెప్ట్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది.

Renault Bridger 7 Seater Suv Concept Teaser India Reveal March 10 Full Details

కంపెనీ విడుదల చేసిన నోట్‌లో, మార్చి 10న ఈ కొత్త "బ్రిడ్జర్" కాన్సెప్ట్ మోడల్‌ను ప్రజలకు అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ మోడల్‌పై ఆటో రంగంలో ఆసక్తి మరింత పెరిగింది. డిజైన్ విషయానికి వస్తే, ఈ కొత్త రెనాల్ట్ SUV అర్బన్ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడుతోంది. నాలుగు మీటర్లకు తక్కువ పొడవు ఉండే కాంపాక్ట్ సైజు కలిగి ఉన్నప్పటికీ, లోపల విశాలమైన క్యాబిన్ స్థలాన్ని అందించగలదని చెబుతున్నారు.

చిన్న పరిమాణంలోనే ఎక్కువ స్పేస్ అందించే కొలతలు ఈ కారుకు ప్రత్యేకతగా ఉండనున్నాయి. దీంతో కుటుంబ ప్రయాణాలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చిత్రాలను పరిశీలిస్తే, ఈ SUV బాక్సీ ఆకారంతో పాటు నిటారుగా ఉండే నిష్పత్తులను కలిగి ఉండనుంది. బలమైన బాడీ డిజైన్, ఎత్తైన స్టాన్స్, ఆధునిక స్టైలింగ్ ఈ కారుకు ప్రత్యేకమైన ఆకర్షణను ఇవ్వనున్నాయి.

కొత్త టీజర్‌లో కనిపించిన అత్యంత ఆకర్షణీయమైన అంశం టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్. ఈ డిజైన్ చూసిన వెంటనే ల్యాండ్ రోవర్ ఢిఫెండర్‌ను గుర్తు చేసేలా ఉంటుంది. అలాంటి స్టైల్ కొత్త SUVకి బలమైన ఆఫ్-రోడ్ క్యారెక్టర్‌ను ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఈ వాహనం కేవలం నగర ప్రయాణాలకే కాకుండా కఠినమైన రోడ్లపైనా సులభంగా ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు.

టీజర్‌లో కనిపించిన మరో ప్రధాన హైలైట్ ఫ్రంట్ ఫాసియాపై ప్రకాశించే "Renault" అక్షరాలు. ఈ లైటింగ్ స్టైల్ అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న కొత్త డస్టర్ మోడల్‌లకు సమానంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వాహనం ముందు భాగం మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ SUV బాక్సీ షేప్‌తో పాటు బలమైన, రగ్గడ్ లుక్‌ను కలిగి ఉంటుంది. ఇది రూ.10 లక్షల్లో రావచ్చని అంచనా. తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.

మార్కెట్‌లో వస్తున్న నివేదికల ప్రకారం, ఈ వాహనం కైగర్‌లో ఉపయోగిస్తున్న అదే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ కైగర్‌లో సుమారు 100 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు CVT ఆటోమేటిక్ ఎంపిక కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కైగర్‌లో ఉన్న ఈ ఇంజిన్-ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌ను కొత్త SUVలో కూడా అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 5, 2026, 13:47 [IST]
English summary
Renault bridger 7 seater suv concept teaser india reveal march 10 full details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+