దేశం మొత్తం ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది.. కొనేసే టైమ్ ఇదే! బుకింగ్స్ కూడా స్టార్ట్
రెనాల్ట్ ఇండియా (renault india) 2026 గణతంత్ర దినోత్సవం రోజున తన అత్యంత గుర్తింపు పొందిన బ్యాడ్జ్‌లలో ఒకటైన కొత్త డస్టర్ (duster) ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో మరోసారి తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు రెనాల్ట్‌కు భారీ గుర్తింపు తీసుకొచ్చిన డస్టర్‌ను 2022లో నిలిపివేయాల్సి వచ్చినప్పటికీ, ఇప్పుడు పూర్తిగా నూతన రూపంలో తిరిగి తీసుకురావడం కంపెనీ పునరుత్థానానికి ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. వేగంగా విస్తరిస్తున్న మిడ్-సైజ్ SUV విభాగం ప్రస్తుతం భారతీయ వినియోగదారుల ఆసక్తిని శాసిస్తోంది. అలాంటి అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి డస్టర్‌తో మళ్లీ అడుగుపెట్టడం ద్వారా రెనాల్ట్ తన పోటీదారులకు గట్టి సవాల్ విసరనుంది.
కొత్త డస్టర్ ధరలను కంపెనీ 2026 మార్చి మధ్యలో ప్రకటించనుంది. టర్బో ట్రిమ్‌ల డెలివరీ మార్చి మధ్య నుండి ప్రారంభమవుతుంది. హైబ్రిడ్ వేరియంట్‌ల డెలివరీ 2026 దీపావళి నుండి ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులు రెనాల్ట్ డస్టర్‌ను రూ. 21,000 కు ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. రెనాల్ట్ కొత్త డస్టర్‌తో ఏడు సంవత్సరాలు లేదా 1,50,000 కి.మీ వరకు వారంటీని అందిస్తోంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ డిజైన్‌ను పరిశీలిస్తే, ఇది పూర్తిగా ఆధునికతతో పాటు రగ్డ్ SUV క్యారెక్టర్‌ను ప్రతిబింబిస్తుంది. ముందు భాగంలో రెనాల్ట్ తాజా లోగోతో ఆకట్టుకునే సిగ్నేచర్ గ్రిల్ వెంటనే దృష్టిని ఆకర్షిస్తుంది. స్లిమ్ డిజైన్‌లో ఉన్న LED హెడ్‌ల్యాంప్‌లు, Y-ఆకారపు సిగ్నేచర్‌తో రూపొందించిన LED DRLలు SUVకి భవిష్యత్తు వాహనం లాంటి లుక్‌ను ఇస్తాయి. స్పోర్టీ బంపర్ డిజైన్ డస్టర్‌కు మరింత దూకుడైన వ్యక్తిత్వాన్ని అందిస్తుంది.
సైడ్ ప్రొఫైల్‌కి వస్తే, బోల్డ్ క్రీజ్ లైన్స్ డస్టర్ బాడీకి గట్టితనాన్ని తీసుకువస్తాయి. భారీ బాడీ క్లాడింగ్, పెద్ద సైజ్ అల్లాయ్ వీల్స్ కలిసి ఇది ఒక నిజమైన ఆఫ్-రోడర్ అన్న భావనను కలిగిస్తాయి. పైభాగంలో ఉన్న ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ కేవలం డిజైన్ పరంగానే కాకుండా ప్రయోజనకరంగానూ ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి. మొత్తం మీద సైడ్ వ్యూ డస్టర్ మస్కులర్ స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

వెనుక భాగంలో కూడా కొత్త డస్టర్ డిజైన్ పరంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. Y-ఆకారపు ఎలిమెంట్స్‌తో రూపొందించిన C-ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లు రాత్రివేళల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. భారీగా డిజైన్ చేసిన వెనుక బంపర్ వాహనానికి మరింత రగ్డ్ లుక్‌ను ఇస్తుంది. పైభాగంలో ఉన్న రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ డస్టర్ స్పోర్టీ క్యారెక్టర్‌ను మరింత బలపరుస్తుంది. 2026 రెనాల్ట్ డస్టర్ లోపలి భాగం చాలా వరకు కొత్తగా మారిపోయింది.
ఒకప్పుడు రగ్డ్ SUVగా మాత్రమే గుర్తింపు పొందిన డస్టర్, ఇప్పుడు లోపలి భాగంలో పూర్తిగా ప్రీమియం దిశగా అడుగులు వేసింది. ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత, ఫిట్, ఫినిషింగ్ పరంగా రెనాల్ట్ స్పష్టంగా ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌తో పాటు డోర్ ప్యాడ్‌లపై ఇప్పుడు సాఫ్ట్-టచ్ మెటీరియల్‌లను ఉపయోగించడం వల్ల క్యాబిన్‌లోకి అడుగుపెట్టగానే ఒక ఖరీదైన కారు అనుభూతి కలుగుతుంది.

సీటింగ్ విషయంలో కూడా కొత్త డస్టర్ పెద్ద మెట్టు ఎక్కింది. లెథరెట్ సీట్ అప్హోల్స్టరీ కారు లోపల లగ్జరీ టచ్‌ను పెంచుతుండగా, దూర ప్రయాణాల్లోనూ సౌకర్యాన్ని అందించేలా సీట్లు రూపొందించబడ్డాయి. డ్యాష్‌బోర్డ్‌పై ఉన్న డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఆధునిక SUVల సరసన డస్టర్‌ను నిలబెడుతుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే డ్రైవింగ్ అనుభవాన్ని మరింత హైటెక్‌గా మార్చుతుంది.
టెక్నాలజీ పరంగా చూస్తే, 2026 డస్టర్‌లో రెనాల్ట్ ఏమాత్రం రాజీ పడలేదని చెప్పాలి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ రోజువారీ వినియోగాన్ని సులభతరం చేస్తే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రతి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మారుస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్ క్యాబిన్‌ను మరింత విశాలంగా అనిపించేలా చేస్తుంది. నగరంలో గానీ, రద్దీ ప్రాంతాల్లో గానీ డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి 360-డిగ్రీ కెమెరా, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఎంతో ఉపయోగపడతాయి.
డస్టర్ మూడు ఇంజన్ ఆప్షన్లతో కొనుగోలు చేయడానికి అందించబడుతుంది, వాటిలో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కూడా ఉంటుంది. వీటిలో 163 PS, 280 Nm అందించే టర్బో TCe 160 ఇంజిన్, 1.4 kW బ్యాటరీతో జత చేయబడిన 1.8L GDI స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్, టర్బో TCe 100 ఇంజిన్ ఉన్నాయి. అలాగే, 100hp, 152Nm (5-స్పీడ్ మాన్యువల్ మాత్రమే) ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








