ఎన్నో ఏళ్ల తర్వాత డస్టర్ తిరిగి వచ్చింది.. చాలా తక్కువ ధరకే లాంచ్! ఫీచర్లు నెక్స్ట్ లెవల్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త తరం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఎట్టకేలకు ఘనంగా విడుదలైంది. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో 2026 మోడల్ డస్టర్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఇదే కారును జనవరి 26న చెన్నైలో మొదటిసారి ప్రదర్శించగా, ఇప్పుడు అధికారిక లాంచ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న వారు సమీప డీలర్‌షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ.21,000 అడ్వాన్స్ చెల్లించి ఈ SUVని బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన వేరియంట్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

అయితే, రూ. 21,000 చెల్లించి ఆర్ పాస్ కొనుగోలు చేసి ఈ ఎస్‌యూవీని ప్రీ-బుక్ చేసుకున్న కస్టమర్‌లు, వారు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి రూ. 20,000 నుండి రూ. 50,000 వరకు తక్కువ ధరకు పొందవచ్చు. ధర విషయంలో చూస్తే, కొత్త డస్టర్ చాలా ఆకర్షణీయమైన ప్రైస్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.18.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Renault Duster 2026 Launched In India At Rs 10 49 Lakh Starting Price More Details Inside

'ఆథెంటిక్', 'ఎవల్యూషన్', 'టెక్నో', 'టెక్నో ప్లస్', 'ఐకానిక్' వంటి విభిన్న వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. అందువల్ల విభిన్న బడ్జెట్‌లకు సరిపోయేలా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. డిజైన్ విషయానికి వస్తే, కొత్త డస్టర్ పూర్తిగా మోడర్న్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో బోల్డ్‌గా 'DUSTER' అనే లెటరింగ్‌తో గ్రిల్, స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, 'C' ఆకారంలో LED టెయిల్‌లైట్స్ ఈ SUVకి ప్రత్యేక ఆకర్షణ.

అదనంగా సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ దీని రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచాయి. జేడ్ మౌంటెన్ గ్రీన్, పర్ల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, స్టెల్త్ బ్లాక్, రివర్ బ్లూ, సన్‌సెట్ రెడ్ వంటి కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని పొడవు 4,346 మిమీ, వెడల్పు 1,815 మిమీ, ఎత్తు 1,703 మిమీ. అలాగే 212 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,657 మిమీ వీల్‌బేస్.

Renault Duster 2026 Launched In India At Rs 10 49 Lakh Starting Price More Details Inside

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ SUVలో మూడు పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ 160 PS పవర్, 172 Nm టార్క్‌ను అందిస్తుంది. మరో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 100 PS పవర్, 160 Nm టార్క్‌ను ఇస్తుంది.

ట్రాన్స్‌మిషన్ విషయంలో 5-స్పీడ్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 8-స్పీడ్ హైబ్రిడ్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజ్ సుమారు 14 నుంచి 26 kmpl వరకు ఉండొచ్చని అంచనా. ఇంటీరియర్ విషయంలో కూడా డస్టర్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. 5 సీటర్ సెటప్‌తో వస్తూ, ప్రయాణికులకు మంచి కంఫర్ట్‌ను అందిస్తుంది. పెద్ద ఫ్యామిలీ ట్రిప్స్‌కు సరిపోయేలా 700 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంది.

Renault Duster 2026 Launched In India At Rs 10 49 Lakh Starting Price More Details Inside

ఇంటిరియర్‌లో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే, వైర్‌లెస్ చార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఈ SUVని మరింత ప్రీమియంగా మారుస్తాయి. సైజ్ పరంగా కూడా ఈ SUV విశాలంగా ఉంటుంది. భద్రత విషయంలో కూడా ఈ కారు ఎలాంటి రాజీ పడలేదు.

ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC, లెవల్-2 ADAS, TPMS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు అందించబడ్డాయి. ఈ కొత్త డస్టర్ మోడల్‌పై రెనాల్ట్ బ్రాండ్ ఏడు సంవత్సరాలు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వారంటీని సైతం అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 17, 2026, 12:47 [IST]
English summary
Renault duster 2026 launched in india at rs 10 49 lakh starting price more details inside
Read more on: #renault #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+