ఒక లీటరు పెట్రోల్‌తో సూపర్ మైలేజ్.. షాక్‌కి గురి చేస్తున్న డస్టర్! ARAI సైతం ధృవీకరించింది
భారతీయ SUV మార్కెట్లో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెనాల్ట్ డస్టర్ (Renault Duster), కొంతకాలం విరామం తర్వాత మళ్లీ కొత్త అవతారంలో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మరింత ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు, మెరుగైన మైలేజీతో SUV ప్రియుల మనసు గెలుచుకునేలా తిరిగి వచ్చింది. ప్రారంభ ధరను రూ. 10.49 లక్షలుగా నిర్ణయించిన కంపెనీ, ప్రత్యేకంగా ఆర్-పాస్ ద్వారా బుక్ చేసుకునే వారికి రూ. 10.29 లక్షలకే అందిస్తామని ప్రకటించడం మరింత ఆకర్షణగా మారింది. కొత్త డస్టర్‌లో డీజిల్ ఇంజిన్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి, పూర్తిగా పెట్రోల్ ఇంజిన్‌లపై దృష్టి పెట్టింది Renault. ప్రస్తుతం ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఒకటి 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.
భవిష్యత్తులో మరింత అప్‌డేట్‌గా 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా ఈ ఏడాది చివర్లో, ముఖ్యంగా దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. మైలేజీ విషయానికి వస్తే, తాజాగా ARAI-ధృవీకరించిన ఇంధన సామర్థ్యపు వివరాలను రెనాల్ట్ ఇండియా ఇప్పుడు వెల్లడించింది. దీని ప్రకారం, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పనితీరు ఆసక్తికరంగా మారింది.

ఈ ఇంజన్‌తో కొత్త డస్టర్‌ను మీరు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (DCT)లో ఎంచుకోవచ్చు. Automotive Research Association of India ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం, మాన్యువల్ వేరియంట్ ఒక లీటర్ పెట్రోల్‌తో సుమారు 17.75 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇదే సమయంలో ఆటోమేటిక్ DCT వేరియంట్ కొంచెం మెరుగ్గా 18.45 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
ఇది చూసినప్పుడు, ఆటోమేటిక్ వేరియంట్ మైలేజీ కొంచెం ఎక్కువగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఆటోమేటిక్ కార్లు తక్కువ మైలేజీ ఇస్తాయని భావన ఉండగా, కొత్త డస్టర్ ఆ అభిప్రాయాన్ని కొంతవరకు మార్చేలా కనిపిస్తోంది. దీని వెనుక ఉన్న టెక్నాలజీ, గేర్‌బాక్స్ ట్యూనింగ్, ఇంజన్ ఎఫిషెన్సీ ప్రధాన కారణాలు. కొత్త డస్టర్ కేవలం స్టైలిష్ SUV మాత్రమే కాదు, పనితీరు, మైలేజీ మధ్య మంచి బ్యాలెన్స్‌ను అందించే వాహనంగా నిలుస్తోంది.

భారత మార్కెట్లో తిరిగి ఎంట్రీ ఇచ్చిన డస్టర్ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌లో రూ. 18.49 లక్షల వరకు వెళ్లడం గమనార్హం. ఈ ఇంజన్‌తో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తీసుకోవాలనుకునే వారికి ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా నిర్ణయించడం జరిగింది. కొంచెం ఎక్కువ కంఫర్ట్, స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారుతోంది.
వేరియంట్ల పరంగా కూడా ఈ SUV చాలా క్లియర్‌గా సెగ్మెంట్‌ను కవర్ చేస్తోంది. ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, టెక్నో+, ఐకానిక్, ఐకానిక్ లాంచ్ ఎడిషన్ అనే మొత్తం 6 వేరియంట్లలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది Renault. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎంట్రీ లెవెల్ అయిన ఆథెంటిక్ వేరియంట్ మాత్రమే పరిమిత ఎంపికలతో వస్తుంది. మిగతా అన్ని వేరియంట్లు మాత్రం కస్టమర్‌కు పూర్తి ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి.

ఎవల్యూషన్ నుంచి పైకి ఉన్న వేరియంట్లలో 1.3-లీటర్ టర్బో ఇంజన్‌తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటిలోనూ ఎంపిక ఉంటుంది. అంటే, మీరు పవర్ కావాలా, లేక సౌకర్యం కావాలా అనే దానిపై ఆధారపడి నచ్చిన కాంబినేషన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. మొత్తానికి, కొత్త డస్టర్ ధరలు చూస్తే బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు అన్ని రకాల SUV కొనుగోలుదారులను టార్గెట్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








