డస్టర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. స్పెషల్ అడ్వెంచర్ ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది! ధర మీ బడ్జెట్‌లోనే

ఇటీవలి కాలంలో కార్ల కంపెనీలు తమ ప్రముఖ కార్లపై కస్టమర్ల ఆసక్తిని మరింత పెంచేందుకు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను వరుసగా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. సాధారణంగా ఏదైనా మోడల్ కీలకమైన అమ్మకాల మైలురాయిని చేరుకున్నప్పుడు, మార్కెట్లోకి వచ్చి కొన్నేళ్లు పూర్తయిన సందర్భంలో లేదా కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ తరహా ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేస్తుంటారు. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే ప్రత్యేక డిజైన్, కొత్త అప్‌డేట్లు,ఎక్స్‌ట్రా ఫీచర్లతో ఈ ఎడిషన్లు ఆకర్షిస్తాయి. అదే వ్యూహాన్ని ఇప్పుడు రెనాల్ట్ కూడా అనుసరిస్తోంది. తాజాగా రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ (Renault Duster Adventure Edition)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఒకప్పుడు భారత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్ డస్టర్ నాలుగేళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చిన కొత్త తరం డస్టర్‌కు కంపెనీ తాజాగా స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త అడ్వెంచర్ ఎడిషన్ అడ్వెంచర్ లుక్‌ను మరింత హైలైట్ చేసే ప్రత్యేక అప్‌డేట్లతో రూపొందించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో 2012లో తొలిసారి అడుగుపెట్టి, మిడ్‌సైజ్ SUV విభాగంలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

Renault Duster Adventure Edition Launched In India Price And More Details Inside

బలమైన నిర్మాణం, ఆఫ్-రోడ్ సామర్థ్యం, నమ్మకమైన మంచి పనితీరుతో ఈ SUV ఎన్నో సంవత్సరాల పాటు భారత మార్కెట్లో మంచి ఆదరణ సంపాదించింది. ఒకప్పుడు రోడ్లపై ఈ కారే ఎక్కువగా కనిపించేది. అయితే మార్కెట్లో పెరిగిన పోటీ, కొత్త తరం ప్రత్యర్థుల రాకతో కంపెనీ 2022లో డస్టర్ ఉత్పత్తిని నిలిపివేసింది. అయితే 4 ఏళ్ల గ్యాప్ తరువాత కొత్త తరం డస్టర్‌ను ఈ ఏడాది మార్చిలో మార్కెట్లో తిరిగి తీసుకొచ్చింది.

ఇప్పుడు అదే మోడల్‌కు అడ్వెంచర్ ఎడిషన్‌ను తీసుకురావడం ద్వారా SUV ప్రియులను మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ సాధారణ డస్టర్‌తో పోలిస్తే మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండానే మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా గుర్తించేలా కంపెనీ పూర్తిగా ఎక్స్‌టీరియర్ డిజైన్‌పై దృష్టి పెట్టింది. సాధారణ డస్టర్‌తో పోలిస్తే మరింత అడ్వెంచర్ లుక్‌ను అందించేలా కొన్ని అప్‌డేట్లను జోడించింది.

Renault Duster Adventure Edition Launched In India Price And More Details Inside

ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అడ్వెంచర్ గ్రాఫిక్స్. SUV బాడీపై భూభాగపు సమోన్నత రేఖలతో పాటు, లేహ్ ప్రాంతానికి చెందిన 34.27 N, 77.60 E భౌగోళిక అక్షాంశాలను ప్రత్యేక గ్రాఫిక్ రూపంలో అందించారు. అడ్వెంచర్ ట్రిప్‌లను ఇష్టపడే వారిని ఆకట్టుకునేలా ఈ డిజైన్‌ను రూపొందించారు. అలాగే, ప్రత్యేక అడ్వెంచర్ థీమ్ డెకల్స్, అడ్వెంచర్ బ్రాండెడ్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి ప్రత్యేక అంశాలను కూడా ఈ ఎడిషన్‌లో చేర్చారు.

ఇంజిన్ల విషయానికి వస్తే, ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌, అలాగే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌‌లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 12.99 లక్షలు, రూ. 13.99 లక్షలు, రూ. 15.39 లక్షలుగా నిర్ణయించారు. అడ్వెంచర్ లుక్‌ను ఇష్టపడే SUV ప్రియులకు ఈ స్పెషల్ ఎడిషన్ మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.

Renault Duster Adventure Edition Launched In India Price And More Details Inside

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ మీకు ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ వార్తలను అందిస్తుంది. మేము సోషల్ మీడియా ద్వారా మా పాఠకులతో వేగంగా వార్తలను పంచుకుంటాము. తాజా కార్, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రిపోర్టులు, వీడియోలను పొందడానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లలో డ్రైవ్‌స్పార్క్ తెలుగును అనుసరించడం మర్చిపోకండి. మా వార్తలలో ఏవైనా మీకు నచ్చితే, లైక్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి.

Article Published On: Tuesday, July 14, 2026, 15:32 [IST]
English summary
Renault duster adventure edition launched in india price and more details inside
Read more on: #renault #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+