ఇదెక్కడి క్రేజ్ సామీ..షోరూంలకు కొత్త కారు రాకముందే జనాలు క్యూ కట్టారు.. ఇక టాటా, మారుతీలకు చుక్కలే

ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన రారాజు, ఎస్యూవీ(SUV) సెగ్మెంట్‌లో ట్రెండ్ సెట్టర్ అయిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster)త్వరలోనే మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా అమ్మకాల్లో వెనుకబడిన రెనాల్ట్ ఇండియా, ఇప్పుడు తన పాత వైభవాన్ని తిరిగి అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది.

చిత్రమేమిటంటే.. కొత్త డస్టర్ ఇంకా రోడ్ల మీదకు రాకముందే రెనాల్ట్ కార్ల అమ్మకాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి.అసలు మ్యాటర్ ఏంటి? డస్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? రెనాల్ట్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ కథనలో చూద్దాం.

Renault Duster Comeback Boosts Sales by 33 Launch Timeline Full Details

రెనాల్ట్ ఇండియా 2026 జనవరి నెలలో అనూహ్యమైన వృద్ధిని సాధించింది. గత ఏడాది జనవరిలో కేవలం 2,780 కార్లను అమ్మిన ఈ కంపెనీ, ఈ ఏడాది అదే నెలలో 3,715 కార్లను విక్రయించి 33.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. డస్టర్ మళ్లీ వస్తుందన్న వార్తలతో రెనాల్ట్ బ్రాండ్ మీద కస్టమర్లకు నమ్మకం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా రెనాల్ట్ కైగర్ (Kiger), ట్రైబర్ (Triber) మోడళ్లలో తెచ్చిన కొత్త మార్పులు వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి.

రెనాల్ట్ కంపెనీ తన కొత్త తరం డస్టర్‌ను జనవరి 26న భారత్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ సారి వస్తున్న డస్టర్ పాత దానికంటే చాలా భిన్నంగా అత్యంత పవర్ఫుల్‎గా ఉండబోతుంది. ఇందులో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇ-టెక్ (Strong Hybrid e-tech) సిస్టమ్ వల్ల ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో ఏకంగా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

Renault Duster Comeback Boosts Sales by 33 Launch Timeline Full Details

ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందే కెపాసిటీ ఉన్న కారు. ఇందులో అత్యాధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, భారత రోడ్లకు తగ్గట్టుగా ప్రత్యేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఉపయోగించే 90 శాతం భాగాలను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. దీనివల్ల కారు ధర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

కొత్త డస్టర్ మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సఫారీ, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ మార్చి నెలలో ధరల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ నుంచి డెలివరీలు మొదలవుతాయి. అయితే అత్యంత పవర్ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ మాత్రం 2026 దీపావళికి లాంచ్ కానుంది.

Renault Duster Comeback Boosts Sales by 33 Launch Timeline Full Details

రెనాల్ట్ ఇండియా కేవలం డస్టర్‎తోనే ఆగడం లేదు. 2027 నాటికి మరిన్ని కొత్త ఎస్‌యూవీలను భారత్‌లో ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో 7-సీటర్ ఎస్‌యూవీ, ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు కూడా ఉండే అవకాశం ఉంది. రెనాల్ట్ ఇంటర్నేషనల్ గేమ్ ప్లాన్ 2027లో భాగంగా భారత మార్కెట్‌ను మళ్ళీ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఫ్రెంచ్ కంపెనీ అడుగులు వేస్తోంది.

రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీతో భారత ఆటోమొబైల్ మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం. ఒకవైపు అదిరిపోయే మైలేజ్, మరోవైపు 5-స్టార్ సేఫ్టీ.. వెరసి మధ్యతరగతి నుంచి ప్రీమియం కస్టమర్ల దాకా అందరి దృష్టి ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కంపెనీపైనే ఉంది. క్రెటా, సెల్టోస్ వంటి దిగ్గజాలకు చెక్ పెడుతూ రెనాల్ట్ తన పాత సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకుంటుందా అనేది చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 3, 2026, 15:15 [IST]
English summary
Renault duster comeback boosts sales by 33 launch timeline full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+