సరికొత్త అవతారంలో ఐకానిక్ డస్టర్.. Renault Niagara పేరుతో లాంచ్.. ఇక వెనుక సామాన్లు వేసుకోవచ్చు

ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీ (SUV) లవర్స్ మనసు దోచుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ రెనాల్ట్ డస్టర్(Renault Duster). భారత మార్కెట్లో ఒకప్పుడు ఈ కారు సృష్టించిన హవా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే ఐకానిక్ డస్టర్ మోడల్‌ను మరింత ప్రాక్టికల్ గా, పవర్‌ఫుల్ గా మారుస్తూ రెనాల్ట్ సంస్థ ఒక సరికొత్త పిక్అప్ ట్రక్ (Pickup Truck) వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది.

ఈ సరికొత్త పిక్అప్ మోడల్‌కు రెనాల్ట్ నయాగరా (Renault Niagara) అని నామకరణం చేశారు. గతంలో దక్షిణ అమెరికా దేశాలలో దీనిని డస్టర్ ఒరోచ్ అనే పేరుతో విక్రయించగా, ఇప్పుడు రాబోతున్న న్యూ-జనరేషన్ మోడల్‌ను సరికొత్త డిజైన్, నయా ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజన్‌తో ముస్తాబు చేశారు.

renault duster pickup truck version niagara unveiled specs features launch details telugu

ఆ సెప్టెంబర్ 10వ తేదీనే గ్రాండ్ ఎంట్రీ
గ్లోబల్ ఆటోమొబైల్ నివేదికల ప్రకారం.. రెనాల్ట్ సంస్థ ఈ సరికొత్త నయాగరా పిక్అప్ ట్రక్‌ను రాబోయే సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ దేశాల ముందు అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ పవర్‌ఫుల్ వాహనాన్ని ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా ప్లాంట్‌లో భారీ ఎత్తున ఉత్పత్తి చేయనున్నారు.

సాధారణంగా మార్కెట్లో లభించే కమర్షియల్ పిక్అప్ ట్రక్కులు బరువైన లాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై తయారవుతాయి, కానీ ఈ నయాగరా ట్రక్ మాత్రం ఒక లగ్జరీ ఎస్‌యూవీ లాగా అత్యంత సౌకర్యవంతమైన మోనోకాక్ ప్లాట్‌ఫారమ్ (Monocock Platform) పై రూపొందడం విశేషం. దీని వెనుక భాగంలో ఒక స్టైలిష్ డ్రాప్-డౌన్ టైల్‌గేట్ ఉంటుంది, దానిపై పెద్ద అక్షరాలతో NIAGARA అని రాసి ఉన్నట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది.

renault duster pickup truck version niagara unveiled specs features launch details telugu

సైజులో డస్టర్ కంటే పెద్దది
కొలతల విషయానికి వస్తే, ఈ కొత్త పిక్అప్ ట్రక్ రెనాల్ట్ సంస్థకు చెందిన మిగిలిన పెద్ద కార్ల కంటే భారీ సైజులో ఉండబోతోంది. ప్రస్తుతం మార్కెట్లోకి రాబోతున్న డస్టర్ 7-సీటర్ మోడల్ పొడవు సుమారు 4,556 మిమీ, వీల్‌బేస్ 2,702 మిమీగా ఉంది.

అయితే నయాగరా పిక్అప్ ట్రక్ పొడవు అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కారు వెనుక భాగంలో లగేజ్ లేదా సరుకులను రవాణా చేయడానికి వీలుగా ఒక భారీ, విశాలమైన, ఓపెన్ లోడ్ బెడ్ (సామాను ఉంచే స్థలం)ను కేటాయించారు. ఇందుకోసమే దీని వీల్‌బేస్‌ను కూడా కంపెనీ భారీగా పెంచింది.

బయట రఫ్ అండ్ టఫ్.. లోపల లగ్జరీ
ఈ నియాగరా కారు బయటి లుక్ పరంగా ఎంత రఫ్ అండ్ టఫ్‌గా, రాకీగా కనిపిస్తుందో.. లోపలి కేబిన్ మాత్రం అంతకంటే విలాసవంతంగా ఉంటుంది. ఒక ప్రీమియం విదేశీ లగ్జరీ ఎస్‌యూవీలో ఎలాంటి వీఐపీ ఫీచర్లు ఉంటాయో వాటన్నింటినీ ఇందులో అమర్చారు.

renault duster pickup truck version niagara unveiled specs features launch details telugu

లాంగ్ జర్నీలో ప్రయాణికులకు అలసట లేకుండా ఉండేందుకు మసాజ్ ఫంక్షన్ కలిగిన ప్రీమియం సీట్లు, ఆకాశాన్ని వీక్షించడానికి వీలుగా ఒక పెద్ద పనోరమిక్ సన్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కారు డాష్‌బోర్డ్‌పై 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఈ లగ్జరీ ఫీచర్లు పిక్అప్ ట్రక్కుల విభాగంలోనే సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనున్నాయి.

నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ
టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో కూడా రెనో నయాగరా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ కారుకు అద్భుతమైన రోడ్ గ్రిప్, లుక్ ఇవ్వడానికి 19-ఇంచుల భారీ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. డ్రైవింగ్ సేఫ్టీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఇందులో లెవెల్-2 ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీను జోడించారు.

ఇది ప్రమాదాల నుంచి వాహనాన్ని ముందుగానే హెచ్చరించి కాపాడుతుంది. వీటికి తోడు ఇరుకైన సందులలో కూడా కారును సులభంగా పార్క్ చేయడానికి హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ ఫీచర్ మరియు కారు చుట్టూ ఉన్న పరిసరాలను స్క్రీన్‌పై చూపించే 360-డిగ్రీ కెమెరా వంటి హైటెక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

పవర్‌ఫుల్ టర్బో, మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్లు!
సామర్థ్యం విషయంలో నియాగరా పిక్అప్ ట్రక్ పవర్‌హౌస్‌లా పనిచేస్తుంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ ట్రక్ రెండు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లతో రానుంది:
1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్: ఇది గరిష్టంగా 163bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగాన్ని ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్: ఇది 160bhp పవర్‌ను ఇస్తూనే.. లీటరుకు ఊహించని రేంజ్‌లో అత్యధిక మైలేజీని అందిస్తుంది.
కఠినమైన కొండ ప్రాంతాలు, బురద దారులు, కఠినమైన ఆఫ్-రోడింగ్ దారులను సైతం ఈజీగా అధిగమించడానికి వీలుగా ఇందులో అడ్వాన్స్డ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను కూడా అందించారు.

భారతదేశంలోకి ఎంట్రీ ఎప్పుడు?
ప్రస్తుతానికి రెనాల్ట్ ఇండియా సంస్థ ఈ నయాగరా పిక్అప్ ట్రక్‌ను అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేయడంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే మన దేశంలో ప్రస్తుతం టయోటా హిలక్స్ (Toyota Hilux), ఇసుజు డి-మాక్స్ (Isuzu D-Max) వంటి పిక్అప్ ట్రక్కులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.

పైగా భారతీయులకు డస్టర్ బ్రాండ్ అంటే ఉన్న క్రేజ్ దృష్ట్యా, భవిష్యత్తులో ఈ నియాగరా మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి కూడా ఇంపోర్ట్ చేసే లేదా ఇక్కడే అసెంబుల్ చేసి లాంచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Article Published On: Wednesday, May 20, 2026, 10:28 [IST]
English summary
Renault duster pickup truck version niagara unveiled specs features launch details telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+