10 లక్షల కిలోమీటర్లు, మూడు ఖండాల్లో టెస్టింగ్..క్రెటా, సెల్టోస్‌లాంటి ఎస్‌యూవీలకే మొగుడు వస్తున్నాడు

ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ(SUV) ట్రెండ్‌ను మొదలుపెట్టిందే అది.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా, ఇప్పుడు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైంది. అదే రెనో డస్టర్(Renault Duster). సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఈ నెక్స్ట్ జనరేషన్ డస్టర్ కోసం కార్ల ప్రేమికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ కారు, రాకముందే తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

భారతీయ వాహన రంగంలో సెగ్మెంట్ క్రియేటర్‌గా పేరుగాంచిన రెనో డస్టర్, సరికొత్త అవతారంలో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. ఈ కారు దృఢత్వాన్ని పరీక్షించేందుకు రెనో గ్రూప్ అసాధారణమైన పద్ధతులను అవలంబించింది. ప్రపంచవ్యాప్తంగా మూడు వేర్వేరు ఖండాల్లో సుమారు 10 లక్షల కిలోమీటర్లకు పైగా ఈ కారును నడిపి టెస్టింగ్ పూర్తి చేశారు. ఏ వాతావరణంలోనైనా, ఎలాంటి రోడ్డు మీదనైనా ఇది తిరుగులేని ప్రదర్శన ఇస్తుందని కంపెనీ గర్వంగా చెబుతోంది.

Renault Duster Proves Its Toughness Tested Over 1 Million km Across Extreme Weather Conditions

ఈ కారును కేవలం నగరాల్లోనే కాదు, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. మైనస్ -23°C గడ్డకట్టే చలి నుంచి, 55°C మండుటెండల వరకు అన్నింటినీ డస్టర్ తట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అయిన లడఖ్‌లోని ఖర్దుంగ్ లా పాస్ (18,379 అడుగుల ఎత్తు) మీద కూడా డస్టర్ విజయవంతంగా దూసుకుపోయింది.

ఇంత ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉన్నా ఇంజిన్ పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదని కంపెనీ తెలిపింది. కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు, నీటిలో ప్రయాణించడం(Water Wading), దుమ్ము ధూళి నిండిన టన్నెల్స్ (Dust Tunnel)లో కూడా దీని విడిభాగాల నాణ్యతను పరీక్షించారు.

Renault Duster Proves Its Toughness Tested Over 1 Million km Across Extreme Weather Conditions

ఇండియాలోని రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే మన దేశంలోని ట్రాఫిక్, గుంతల రోడ్లకు అనుగుణంగా NATRAX, ARAI, GARC వంటి ప్రభుత్వ టెస్టింగ్ ట్రాక్‌లపై దీని పనితీరును విశ్లేషించారు. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో కూడా ఈ ఎస్‌యూవీ మంచి కంఫర్ట్‌ను ఇస్తుందని నిరూపితమైంది.

ఫ్రాన్స్, బ్రెజిల్, రొమేనియా వంటి దేశాల్లో కూడా దీని డ్రైవింగ్ డైనమిక్స్‌ను పరీక్షించి, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించారు. రఫ్ రోడ్లపై ఎంత వేగంగా వెళ్లినా కారు కంట్రోల్ తప్పదని రెనో ఇండియా సీఈవో స్టెఫాన్ డెబ్లెయిస్ ధీమా వ్యక్తం చేశారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కారు అధికారికంగా లాంచ్ కానుంది. మొదట పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తున్నప్పటికీ, త్వరలోనే స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ మరియు సీఎన్‌జీ ఆప్షన్లను కూడా రెనో తీసుకురానుంది.

Renault Duster Proves Its Toughness Tested Over 1 Million km Across Extreme Weather Conditions

ఫీచర్ల విషయానికొస్తే.. టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక హంగులన్నీ ఇందులో ఉన్నాయి. ఇక భద్రత విషయంలో రాజీ పడకుండా 6 ఎయిర్‌బ్యాగులు, ADAS టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించబోతున్నారు.

మార్కెట్లోకి వస్తున్న ఈ కొత్త డస్టర్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.11 లక్షల నుంచి ఉండవచ్చని అంచనా. పాత డస్టర్ పట్ల ఉన్న నమ్మకాన్ని, కొత్త తరం టెక్నాలజీని జోడించి వస్తున్న ఈ కారు ఎస్‌యూవీ మార్కెట్లో ఒక పెను సంచలనం సృష్టించడం ఖాయం.

More from DriveSpark

Article Published On: Thursday, January 8, 2026, 7:40 [IST]
English summary
Renault duster proves its toughness tested over 1 million km across extreme weather conditions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+