భారతదేశంలో రేపటి నుంచి ఈ కారు గురించే మాట్లాడుకుంటారు! కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది!
రెనాల్ట్ (Renault) అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఒకప్పుడు భారత SUV మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఇప్పుడు మళ్లీ భారతదేశంలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. బలమైన బిల్డ్, అద్భుతమైన డ్రైవింగ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ ఇమేజ్‌తో డస్టర్ ఒకప్పుడు యూత్‌తో పాటు ఫ్యామిలీ కొనుగోలుదారుల హృదయాలను గెలుచుకుంది. అలాంటి ఐకానిక్ మోడల్‌ను తిరిగి తీసుకురావడం ద్వారా, భారత మార్కెట్లో తన స్థితిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకెళ్తోంది. రెనాల్ట్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, జనవరి 26న కొత్త డస్టర్ భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఈ తేదీకి ప్రత్యేకత కూడా ఉండటంతో, కంపెనీ ఈ లాంచ్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
కొత్త డస్టర్ పూర్తిగా అప్డేటెడ్ డిజైన్‌తో, ఆధునిక ఫీచర్లతో, మెరుగైన భద్రతా ప్రమాణాలతో రానుందని అంచనా. ప్రస్తుతం SUVలకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, రెనాల్ట్ ఈ మోడల్‌ను మరింత పోటీ ధరలో తీసుకురావాలని చూస్తోంది. పాత డస్టర్ ఫ్యాన్స్‌తో పాటు, కొత్త తరం కొనుగోలుదారులు కూడా ఈ కారుపై దృష్టి పెట్టవచ్చు. లాంచ్ తర్వాత, భారత SUV సెగ్మెంట్‌లో డస్టర్ ఎంత స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇంజిన్ ఎంపికల విషయంలో ఈసారి రెనాల్ట్ డస్టర్ మరింత విస్తృతమైన ఆప్షన్‌లతో రావచ్చని చర్చ జరుగుతోంది. విభిన్న అవసరాలు ఉన్న కొనుగోలుదారులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా, రెనాల్ట్ మూడు రకాల పవర్‌ట్రెయిన్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే వారి కోసం 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇది శక్తివంతమైన డ్రైవింగ్ అనుభూతిని అందించడంతో పాటు, హైవే ప్రయాణాలు ఇష్టపడే వారికి మంచి ఎంపికగా నిలవనుంది.
స్మూత్ డ్రైవ్, మెయింటెనెన్స్ సౌలభ్యం కోరుకునే వారికి 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది సింపుల్, రిఫైన్డ్ నేచర్‌తో ఫ్యామిలీ యూజర్లను ఆకట్టుకునేలా ఉండనుంది. ఇవే కాకుండా, మైలేజ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్ల కోసం 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఉండనుంది. లీకైన వివరాల ప్రకారం, కొత్త డస్టర్ గరిష్టంగా 24 kmpl వరకు మైలేజీ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

ధర విషయానికి వస్తే, నిజంగానే బలమైన ఆకర్షణగా మారేలా కనిపిస్తోంది. అంచనాల ప్రకారం, ఈ SUV రూ. 8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులోకి రావచ్చు. ఈ రేంజ్‌లోనే ఇప్పటికే ఉన్న ఇతర మోడళ్లతో పోలిస్తే, డస్టర్ గట్టి సవాల్ విసురుతుందని చెప్పొచ్చు. ఒకప్పుడు తొలి తరంలో డస్టర్ అందించిన వాల్యూ ఫర్ మనీ ఇమేజ్‌ను, కొత్త జనరేషన్‌లోనూ కొనసాగించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఫీచర్ల పరంగా కూడా ఈసారి రెనాల్ట్ ఎలాంటి రాజీ పడలేదనే భావన కలుగుతోంది. కొత్త డస్టర్ క్యాబిన్ పూర్తిగా ఆధునికమైన, ప్రీమియం టచ్ కలిగిన డిజైన్‌తో రానుందని సమాచారం. మెరుగైన ఇంటీరియర్ లేఅవుట్, కొత్త టెక్నాలజీ ఆధారిత ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ ఫీచర్లు వంటి అంశాలు డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు కూడా మరింత కంఫర్ట్ ఇచ్చేలా రూపొందించబడినట్లు తెలుస్తోంది.

భద్రత విషయంలో డస్టర్ తన క్లాస్‌లోని మిగతా కార్లకు నిజంగా పెద్ద సవాల్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన సమాచారం ప్రకారం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP వంటి మౌలిక సేఫ్టీ ఫీచర్లతో పాటు, ADAS వంటి ఆధునిక డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీని కూడా అందించవచ్చు. ఈ స్థాయి భద్రతా ఫీచర్లు ఈ ధరల శ్రేణిలో రావడం డస్టర్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.


Click it and Unblock the Notifications








