అర్జునుడికి గాండీవం ఎలాగో.. కంపెనీకి ఈ కారు అలాగే! రీఎంట్రీ వార్తతో షోరూమ్‌లకు క్యూ కడుతున్న జనం!

భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరల్లో, ఉపయోగకరమైన ఫీచర్లతో వాహనాలను అందించడం ద్వారా కంపెనీ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యంగా క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లకు కొనసాగుతున్న డిమాండ్ కంపెనీ అమ్మకాల వృద్ధికి కీలకంగా మారింది. తాజా అమ్మకాల గణాంకాలు చూస్తే, 2026 మే నెల రెనాల్ట్‌కు ఎంతో విజయవంతమైన కాలంగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. కంపెనీ గత నెలలో భారత మార్కెట్లో మొత్తం 4,113 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.

గత ఏడాది మే నెలలో నమోదైన 2,502 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఈ నేపథ్యంలో రెనాల్ట్ ఏకంగా 64 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్లో కొత్త మోడళ్లు, భారీ డిస్కౌంట్లు, తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ రెనాల్ట్ ఈ స్థాయి వృద్ధిని సాధించడం గమనార్హం. ముఖ్యంగా వినియోగదారుల అవసరాలను ముందుగానే అంచనా వేసి, సరైన సమయంలో వాహనాలను అందుబాటులో ఉంచడం కంపెనీకి కలిసివచ్చింది.

Rnault India Registers 64 Percent Strong Sales Growth In May 2026

అలాగే డీలర్‌షిప్ నెట్‌వర్క్ విస్తరణ, మెరుగైన కస్టమర్ సేవలు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు కూడా అమ్మకాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. ఈ వృద్ధి కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, భారత మార్కెట్లో రెనాల్ట్ బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకం పెరుగుతోందనే సంకేతాలను కూడా ఇస్తోంది. ముఖ్యంగా బడ్జెట్, కాంపాక్ట్ కార్ల విభాగంలో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది. ఇటీవలి డస్టర్ కారు రాక కూడా రెనాల్డ్ అమ్మకాల వృద్ధికి దోహదపడింది.

రెనాల్ట్ ఇండియా వృద్ధి ఒకటి లేదా రెండు నెలల విజయంతో పరిమితం కాలేదు. కంపెనీ గత కొన్ని నెలలుగా స్థిరమైన అమ్మకాల జోరును కొనసాగిస్తూ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యంగా 2025 సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన ఈ సానుకూల ధోరణి ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. 2026 మే నెలతో కలిపి వరుసగా తొమ్మిదో నెల కూడా రెనాల్ట్ అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

Rnault India Registers 64 Percent Strong Sales Growth In May 2026

కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో నమోదైన రిటైల్ రిజిస్ట్రేషన్ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మే 2026లో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన కార్ల తయారీ సంస్థల జాబితాలో రెనాల్ట్ కూడా స్థానాన్ని సంపాదించింది. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంపెనీ స్థిరంగా ముందుకు సాగుతుంది. సెప్టెంబర్ 2025 నుంచి మే 2026 వరకు ఉన్న తొమ్మిది నెలల కాలంలో రెనాల్ట్ మొత్తం అమ్మకాలు 38,225 యూనిట్లకు చేరుకున్నాయి.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 46 శాతం వృద్ధి. ఈ గణాంకాలు కేవలం తాత్కాలిక డిమాండ్ ఫలితం కాదని, కంపెనీ ఉత్పత్తులపై వినియోగదారుల నమ్మకం పెరుగుతోందని సూచిస్తున్నాయి. క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లకు దేశవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ కూడా కంపెనీ వృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తోంది. సరసమైన ధరలు, మెరుగైన ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు రెనాల్ట్ కార్లను కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

Rnault India Registers 64 Percent Strong Sales Growth In May 2026

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రెనాల్ట్ డస్టర్ మార్కెట్లోకి రానుండటంతో కంపెనీపై మళ్లీ ఆసక్తి పెరిగింది. డస్టర్ తర్వాత రెనాల్ట్ 'బ్రిడ్జర్' పేరుతో కొత్త సబ్-కాంపాక్ట్ SUVతో పాటు, పెద్ద 7-సీటర్ SUVను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెనాల్ట్ తన గ్లోబల్ 'ఫ్యూచర్‌రెడీ' వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 36 కొత్త మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Article Published On: Wednesday, June 3, 2026, 14:47 [IST]
English summary
Rnault india registers 64 percent strong sales growth in may 2026
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+