వైర్‌లెస్ కనెక్టివిటీ, పుష్ బటన్ స్టార్ట్.. జస్ట్ రూ.6.99లక్షలకే దేశంలోనే అత్యంత చౌకైన టర్బోచార్జ్డ్ SUV
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెనాల్ట్ (Renault) కంపెనీ తమ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త అడుగులు వేసింది. తమ మోస్ట్ పాపులర్ కారు రెనాల్ట్ కైగర్ లైనప్‌ను అప్‌డేట్ చేస్తూ సరికొత్త వేరియంట్లను జూన్ 24న అధికారికంగా లాంచ్ చేసింది.
కస్టమర్లకు మరింత వాల్యూ ఫర్ మనీ (Value for Money) అందించే ఉద్దేశ్యంతో కంపెనీ ఇందులో సరికొత్త ఇవల్యూషన్ ప్లస్ (Evolution Plus) ట్రిమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇవల్యూషన్, టెక్నో వేరియంట్ల మధ్యలో ఈ కొత్త మోడల్ అందుబాటులో ఉంటుంది.

కొత్తగా వచ్చిన కైగర్ ఇవల్యూషన్ ప్లస్ వేరియంట్ ప్రారంభ ధరను రూ.6.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఈ మిడ్-రేంజ్ వేరియంట్‌లో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎన్నో ప్రీమియం ఫీచర్లను జోడించారు.
ఇందులో 20.32 సెం.మీ (8-ఇంచుల) ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ యాక్సెస్ కార్డ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్, ఎంబోస్డ్ ఫ్యాబ్రిక్ అపోల్‌స్టరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ వేరియంట్ మ్యాన్యువల్, ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండింటిలోనూ లభిస్తుంది.

టర్బో కార్ల డ్రైవింగ్‌ను ఇష్టపడే కస్టమర్ల కోసం రెనాల్ట్ కంపెనీ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. తమ టెక్నో టర్బో (Techno Turbo) వేరియంట్‌లో ఇప్పటివరకు ఉన్న ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు సరికొత్తగా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ. 8.45 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు.
ఈ కొత్త మ్యాన్యువల్ ఆప్షన్ రాకతో, కైగర్ టర్బో సిరీస్ కారు కొనాలనుకునే వారికి మరింత తక్కువ ధరలోనే టర్బో ఇంజన్ పవర్ అందుబాటులోకి వచ్చినట్లయింది. దీంతో రెనాల్ట్ సంస్థ తమ టర్బో-పావర్డ్ పోర్ట్‌ఫోలియోను 3 వేరియంట్ల నుంచి 5 వేరియంట్లకు పెంచింది.

మెకానికల్ పరంగా ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. కైగర్ యథావిధిగా రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులోని 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుండగా.. దీని రేంజ్‌ను 6 వేరియంట్ల నుంచి 8 వేరియంట్లకు పెంచారు.
మరోవైపు, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 100 PS పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఎక్స్-ట్రానిక్ సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో దేశంలోనే అత్యంత చౌకైన టర్బోచార్జ్డ్ ఎస్‌యూవీగా రెనాల్ట్ కైగర్ (టర్బో బేస్ ధర రూ. 7.89 లక్షలు) నిలిచింది.
ఈ ఎస్‌యూవీలో ప్రాక్టికాలిటీ కోసం 205 mm బూట్ క్లియరెన్స్, 405 లీటర్ల భారీ బూట్ స్పేస్, 21 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. కారులో ఆకట్టుకునేలా ట్రై-ఆక్టా ప్యూర్ విజన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, వెంటిలేటెడ్ సీట్లు, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.
సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్‌పీ (ESP), ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. రెనాల్ట్ కైగర్ బేస్ మోడల్ ధర రూ. 5.81 లక్షల నుంచి ప్రారంభమై, టాప్-స్పెక్ టర్బో సివిటి మోడల్ ధర రూ. 10.35 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications