మిడిల్ క్లాస్ ప్రజల ఫేవరెట్‌గా మారిన బడ్జెట్ కారు.. రూ.5.81 లక్షలే, ఒక్క ఏడాదిలోనే రికార్డ్ జంప్
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది రెనాల్ట్ కైగర్ (Renault Kiger). 4 మీటర్ల లోపు పొడవుతో నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ కారు, డిజైన్, ఫీచర్లు, ధర కలిపి కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతతో పాటు చిన్న కుటుంబాల మధ్య ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ కారు మార్కెట్లో ఎంత బలంగా నిలబడుతుందో స్పష్టంగా తెలుస్తోంది. 2026 మార్చి నెలలో మొత్తం 1,184 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే కాలంలో అంటే 2025 మార్చిలో కేవలం 762 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. ఈ రెండు సంఖ్యలను పోల్చితే, ఈసారి 422 యూనిట్లు ఎక్కువగా అమ్ముడవడం గమనార్హం.
శాతం పరంగా చూస్తే ఇది దాదాపు 55.38 శాతం వృద్ధి అని చెప్పుకోవచ్చు. ఈ రీతిలో భారీగా అమ్మకాలు పెరగడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ధరకు తగ్గ ఫీచర్లు, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్, అలాగే కంపెనీ అందిస్తున్న ఆఫర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా, ప్రస్తుతం కస్టమర్లు పెద్ద ఎస్‌యూవీలకు బదులుగా కాంపాక్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు.

ఈ ట్రెండ్‌కు కైగర్ పూర్తిగా సరిపోవడం కూడా దాని సేల్స్ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. నెలవారీ గణాంకాలను పరిశీలించినా కైగర్ అమ్మకాల దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ఫిబ్రవరిలో మొత్తం 701 యూనిట్లు మాత్రమే విక్రయమైన ఈ కారు, కేవలం ఒక నెల వ్యవధిలోనే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఆ తర్వాతి మార్చి నెలకు వచ్చేసరికి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగి 1,184 యూనిట్లకు చేరుకున్నాయి.
ఈ రెండు నెలలను పోల్చితే, అదనంగా 483 కార్లు అమ్ముడవడం పెద్ద జంప్‌గా చెప్పాలి. శాతం పరంగా దాదాపు 68.90 శాతం వృద్ధి కావడం విశేషం. సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద పెరుగుదల రావడం అరుదుగా జరుగుతుంది. ఈ వేగవంతమైన వృద్ధికి మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ఫైనాన్స్ ఆప్షన్లు సులభంగా అందుబాటులో ఉండటం కూడా ఈ అమ్మకాల పెరుగుదలపై ప్రభావం చూపి ఉండొచ్చు.

రెనాల్ట్ కైగర్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర ప్రస్తుతం భారత మార్కెట్లో కేవలం రూ. 5.81 లక్షలు మాత్రమే. దీంతో ఇది భారత మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సబ్-4-మీటర్ కాంపాక్ట్ SUVలలో ఒకటిగా నిలుస్తోంది. అదే సమయంలో, టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ. 10.34 లక్షలు మాత్రమే. రెనాల్ట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం ఇవన్నీ చెన్నై ఎక్స్-షోరూమ్ ధరలు.
ఇంజిన్ వివరాలను చూసినట్లయితే, ఇది 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు,శక్తివంతమైన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. రోజువారీ వినియోగానికి తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది బెస్ట్, ఎందుకంటే ఈ కారు డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి, ఇది సుమారు లీటర్‌కు 19 నుంచి 20.38 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.

ఫీచర్ల పరంగా ఇందులో డజన్ల కొద్ది ఉన్నాయి. ముఖ్యంగా పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అలాగే ప్రమాదాల సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి 6 ఎయిర్‌బ్యాగులు, ESC , TPMS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








