బ్రెజ్జా కంటే రూ.2.50 లక్షలు తక్కువ.. ఒక్కసారి చూసినవాళ్లు వదిలిపెట్టట్లేదు.. ఈ కార్‌లో ఏముంది?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా మారింది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ తరహా కార్లు అందుబాటు ధర, మంచి మైలేజ్, స్టైలిష్ డిజైన్ ఈ మూడు ముఖ్య అంశాల కలయికతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కేటగిరీలోనే రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన కైగర్ (Kiger) తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. రెనాల్ట్ కైగర్‌ను ఒకసారి గమనిస్తే, దీని డిజైన్ మొదటనే ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్రంట్‌లో ఉన్న బోల్డ్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ లుక్స్ ఈ కారుకు యూత్‌ఫుల్ అప్పీల్‌ను తీసుకువస్తాయి.

అంతేకాదు, నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే కాంపాక్ట్ సైజ్‌తో పాటు, లోపల మాత్రం సరిపడా స్పేస్‌ను అందించడం దీని మరో ప్రత్యేకత. కుటుంబంతో కలిసి ట్రావెల్ చేయాలనుకునే వారికి కూడా మంచి ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన 2026 మార్చి నెల సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ SUV మార్కెట్లో ఎలా పుంజుకుంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నెలలో మొత్తం 1,184 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయడం గమనించదగ్గ విషయం.

Renault Kiger Registers Impressive 55 38 Percent YoY Growth in March 2026

ముఖ్యంగా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలగా చెప్పుకోవాలి. అప్పట్లో 762 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి అదనంగా 422 యూనిట్లు పెరగడం అంటే దాదాపు 55.38 శాతం వృద్ధి నమోదైనట్టే. ఈ వృద్ధి వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే, వినియోగదారులు ఇప్పుడు 'వాల్యూ ఫర్ మనీ' ప్రోడక్ట్స్‌ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం. ఆ అంచనాలను రెనాల్ట్ కైగర్ సమర్థంగా అందిస్తోంది.

ధర విషయానికి వస్తే, కైగర్ తన సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ రూ.5.76 లక్షల నుంచి టాప్ వేరియంట్ కేవలం రూ.10.33 లక్షల వరకే లభిస్తుంది. ఇదే సమయంలో మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్ రూ.8.26 లక్షల వద్ద ఉండటం గమనార్హం. అంటే కైగర్, బ్రెజ్జా బేస్ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ.2.50 లక్షల వరకు తక్కువ ధరలో అందుబాటులో ఉండటం పెద్ద ప్లస్ పాయింట్.

Renault Kiger Registers Impressive 55 38 Percent YoY Growth in March 2026

పర్ఫార్మెన్స్ పరంగా ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, మరింత శక్తివంతమైన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ రెండు ఇంజిన్‌లు నగరంలో స్మూత్ డ్రైవింగ్‌తో పాటు, హైవేల్లో కూడా సరైన పవర్‌ను అందిస్తూ సంతృప్తికరమైన అనుభవాన్ని ఇస్తాయి. వినియోగదారుల డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, అలాగే CVT గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉండటం మరో ప్రత్యేకత.

మైలేజ్ విషయానికి వస్తే కూడా రెనాల్ట్ కైగర్ నిరాశపరచదు. డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి, ఇది సుమారు లీటర్‌కు 19 నుంచి 20.38 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అంటే రోజువారీ వినియోగానికి తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది మంచి బెస్ట్ కారు. ఇది వినియోగదారులకు అవసరమైన డజన్ల కొద్ది ఫీచర్లను కలిగి ఉంది.

Renault Kiger Registers Impressive 55 38 Percent YoY Growth in March 2026

ఫీచర్ల పరంగా ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, అలాగే పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్,ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, అలాగే ప్రమాదాల సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి 6 ఎయిర్‌బ్యాగులు, ESC , TPMS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 14, 2026, 11:00 [IST]
English summary
Renault kiger registers impressive 55 38 percent yoy growth in march 2026
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+