5 లక్షల బడ్జెట్‌లో ఏ కారు మంచిది? పేదలకు ఇవి సరైన కార్లు.. క్విడ్ vs సెలెరియో కంపారిజన్

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) సెలెరియో (Celerio) తన ప్రత్యేకమైన మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం, నగర జీవనశైలికి సరిపోయే డిజైన్‌తో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరతో పాటు, తక్కువ నిర్వహణ ఖర్చు ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది. ఇదే సమయంలో (Renault) నుంచి వచ్చిన రెనాల్ట్ క్విడ్ (kwid) కూడా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైన SUV-లుక్ డిజైన్‌తో మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు కార్లు కూడా తమ తమ శ్రేణిలో బలమైన పోటీని కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా అమ్మకాల గణాంకాల్లో ఇవి ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. ఈ రెండు కార్లు గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

ధర విషయానికి వస్తే, మారుతి సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 4.70 లక్షల నుండి రూ. 6.73 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.30 లక్షల నుండి రూ. 5.99 లక్షల వరకు ఉంది. సంఖ్యల ప్రకారం చూస్తే క్విడ్ ప్రారంభ ధర తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం వేరియంట్‌ల పరిధిని పరిశీలిస్తే సెలెరియో కూడా పోటీ ధరలతోనే నిలుస్తోంది.

Renault Kwid And Maruti Suzuki Celerio Price Design Engine And Mileage Comparision

డిజైన్ పరంగా రెండు కార్లు తమకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సెలెరియోలో LED హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఆర్కిటిక్ వైట్, కెఫిన్ బ్రౌన్, పెర్ల్ బ్లూయిష్ బ్లాక్, సాలిడ్ ఫైర్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 2,435 mm వీల్‌బేస్‌తో నగర రోడ్లకు సరిపోయే స్థిరత్వాన్ని అందిస్తుంది.

ఇక రెనాల్ట్ క్విడ్ విషయానికి వస్తే, ఇది SUV స్టైల్ టచ్‌తో బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. ప్రీమియం LED హెడ్‌లైట్లు, LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు, 14 అంగుళాల స్టీల్ వీల్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. ఐస్ కూల్ వైట్, అవుట్‌బ్యాక్ బ్రాంజ్, షాడో గ్రే, మూన్‌లైట్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. 184 mm గ్రౌండ్ క్లియరెన్స్‌, 2,422 mm వీల్‌బేస్‌తో స్థిరమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

Renault Kwid And Maruti Suzuki Celerio Price Design Engine And Mileage Comparision

ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, రెనాల్ట్ క్విడ్‌లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబడింది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. నగర డ్రైవింగ్‌కు అనువుగా లీటరుకు సుమారు 21 నుండి 22 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 152 కి.మీ.ల వరకు చేరుకోగలదు. 0 నుండి 100 కి.మీ.ల వేగాన్ని సుమారు 16 సెకన్లలో అందుకోవడం పనితీరు స్థాయిని సూచిస్తుంది.

సెలెరియో విషయానికి వస్తే, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.0-లీటర్ CNG ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో ఇది వస్తుంది. మైలేజీ పరంగా పెట్రోల్ వేరియంట్ 24 కిలోమీటర్ల వరకు, CNG వేరియంట్ 34 కిలోమీటర్ల వరకు అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కి.మీ.లు కాగా, 0 నుండి 100 కి.మీ.ల వేగాన్ని సుమారు 15.7 సెకన్లలో అందుకోగలదు.

Renault Kwid And Maruti Suzuki Celerio Price Design Engine And Mileage Comparision

రెనాల్ట్ క్విడ్ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు Android Auto, Apple CarPlay, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ AC ఫీచర్లను అందిస్తుంది. భద్రత పరంగా 2 ఎయిర్‌బ్యాగులు, ESP, TPMS, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మారుతి సెలెరియో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, వెనుక AC వెంట్స్, భద్రతలో 6 ఎయిర్‌బ్యాగులు, ESP, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, February 20, 2026, 7:23 [IST]
English summary
Renault kwid and maruti suzuki celerio price design engine and mileage comparision
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+