రూ.5 లక్షలలోపు కొత్త రెనాల్ట్ కారు.. జూలై 3న గ్రాండ్ ఎంట్రీ.. స్మాల్ కార్.. బిగ్ అటిట్యూడ్!

రెనాల్ట్ (Renault) భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెండు దశాబ్దాలకు పైగా తన ఉనికిని కొనసాగిస్తున్న ప్రముఖ యూరోపియన్ కార్ల తయారీ సంస్థ. డస్టర్ SUV రీ-ఎంట్రీతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ బ్రాండ్, ఇప్పుడు మరోసారి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌ (kwid)ను కొత్త అవతార్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, క్విడ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో కంపెనీ ఉంది. తాజా సమాచారం ప్రకారం, జూలై 3న అప్‌డేటెడ్ రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో పరిచయం చేయనుంది. అయితే ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ మాత్రమే కాదని తెలుస్తోంది.

చిన్నచిన్న మార్పులతో సరిపెట్టకుండా, డిజైన్, ఫీచర్లు, క్యాబిన్ లేఅవుట్ వంటి కీలక అంశాల్లో అప్‌గ్రేడ్‌లు చేసి, దాదాపు పూర్తిగా కొత్త కారు అనిపించేలా ఈ మోడల్‌ను రూపొందించినట్లు సమాచారం. దీంతో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో క్విడ్ మరోసారి బలమైన పోటీదారుగా నిలవాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన స్పై షాట్‌లను పరిశీలిస్తే, 2026 రెనాల్ట్ క్విడ్ గత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా కొత్త లుక్‌లో రానుంది.

Renault Kwid Facelift India Launch On July 3 Design Features Price Details

ముఖ్యంగా ముందు భాగాన్ని కంపెనీ పూర్తిగా రీడిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో కొత్త Y-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (DRLs), మరింత ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్ వంటి మార్పులు కనిపిస్తున్నాయి. అయితే బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ధరను పోటీగా ఉంచేందుకు ప్రధాన హెడ్‌ల్యాంప్‌లలో హాలోజన్ బల్బులను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. వెనుక భాగంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

కొత్త Y-షేప్ LED టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్, అలాగే టెయిల్‌గేట్ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేయడం వల్ల కారు వెనుక నుంచి మరింత మోడ్రన్‌గా కనిపించనుంది. మొత్తంగా ఎక్స్‌టీరియర్‌ను మరింత యువతను ఆకట్టుకునేలా రూపొందించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. ఇక ఇంటీరియర్‌లోనే అత్యంత పెద్ద అప్‌డేట్‌లు ఉండనున్నాయి. స్పై షాట్‌ల ప్రకారం, కొత్త క్విడ్‌లో మునుపటి కంటే పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించవచ్చు.

Renault Kwid Facelift India Launch On July 3 Design Features Price Details

దీనితో పాటు కొత్త డిజైన్ స్టీరింగ్ వీల్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త సెంటర్ కన్సోల్, మెరుగైన క్యాబిన్ ట్రిమ్, అప్‌డేటెడ్ స్విచ్‌గేర్ వంటి మార్పులతో క్యాబిన్ మరింత ప్రీమియం ఫీలింగ్‌ను అందించనుంది. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే, కొత్త*రెనాల్ట్ క్విడ్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

ప్రస్తుతం అమ్మకానికి ఉన్న మోడల్‌లో ఉపయోగిస్తున్న 1.0-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 68 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొనుగోలుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు కూడా యథాతథంగా కొనసాగనున్నాయి. అంటే పనితీరు పరంగా పెద్ద మార్పులు లేకపోయినా డ్రైవింగ్ అనుభూతి కొత్తగా ఉంటుంది.

Renault Kwid Facelift India Launch On July 3 Design Features Price Details

పలు కీలక అప్‌డేట్‌లు పొందుతున్నందున కొత్త క్విడ్ ధర ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రెనాల్ట్ క్విడ్ భారత మార్కెట్లో రూ. 4.30 లక్షల నుంచి రూ. 5.88 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అందుబాటులో ఉంది. అయితే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 5 లక్షల లోపే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Article Published On: Monday, June 29, 2026, 13:11 [IST]
English summary
Renault kwid facelift india launch on july 3 design features price details
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+