తెలుగు వారికోసం స్పెషల్.. కొత్త డస్టర్ డిజైన్ నుంచి ధర వరకూ పూర్తి వివరాలు తెలుసుకోండి!

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 రెనాల్ట్ డస్టర్ SUV ఎట్టకేలకు నిన్న అధికారికంగా ఆవిష్కరించబడింది. తొలి చూపులోనే ఆకట్టుకునే స్టైలిష్ డిజైన్‌తో పాటు, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అనేక కొత్త ఫీచర్లను రెనాల్ట్ జోడించింది. లుక్ పరంగా మరింత మస్క్యులర్‌గా, ప్రీమియం టచ్‌తో కనిపించే ఈ కొత్త డస్టర్, SUV ప్రియుల అంచనాలను నిజం చేసినట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త డస్టర్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు కేవలం రూ. 21,000 అడ్వాన్స్ చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇది రానున్న రోజుల్లో మార్కెట్లోకి వచ్చే అత్యంత ఆసక్తికర SUVలలో ఒకటిగా మారుతుందనే అభిప్రాయం ఆటో వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కారు గురించిన డిజైన్, ఇంజిన్, ఫీచర్స్, ధర వివరాలు ఈ కింది కథణంలో చూద్దాం.

పాత డస్టర్‌కు ఉన్న ప్రత్యేకమైన ఐడెంటిటీని కాపాడుతూ, కొత్త 2026 మోడల్‌కు మరింత దూకుడు, ఆధునిక డిజైన్‌ను అందించింది. మొదటి చూపులోనే ఇది ఒక న్యూ-ఏజ్ SUV అనే భావనను కలిగిస్తుంది. అయితే, అదే సమయంలో డస్టర్‌కు ఉన్న రఫ్ అండ్ టఫ్ డీఎన్‌ఏ మాత్రం ఎక్కడా తగ్గకుండా చూసింది.ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్‌లు ఈ కొత్త డస్టర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Renault New 2026 Duster Design Engine Mileage And Expected Price All Top Things

వెనుక ఇచ్చిన ఈ లైటింగ్ సెటప్ వాహనానికి ప్రీమియం ఫీల్‌ను తీసుకురావడంతో పాటు, రాత్రి వేళల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అలాగే, సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన మస్క్యులర్ బాడీ లుక్, చుట్టూ ఇచ్చిన బాడీ క్లాడింగ్ ఈ SUVకి ఒక స్పష్టమైన ఆఫ్-రోడ్ క్యారెక్టర్‌ను అందిస్తున్నాయి. ఫ్రంట్ భాగంలో మెరుగైన LED హెడ్‌ల్యాంప్‌లు, వాటితో సమన్వయంగా ఉండే ఇంటిగ్రేటెడ్ LED DRLలు డస్టర్‌కు మరింత అగ్రెసివ్ స్టాన్స్‌ను ఇస్తాయి.

వీటితో పాటు, పెద్ద సైజ్‌లో ఉన్న 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ SUV లుక్‌ను మరింత హైలైట్ చేస్తూ, రోడ్ ప్రెజెన్స్‌ను బాగా పెంచాయి. కలర్ ఆప్షన్ల విషయంలో డస్టర్‌ను జాడే మౌంటైన్ గ్రీన్, పెర్ల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్, రివర్ బ్లూ, సన్‌సెట్ రెడ్ వంటి రంగుల్లో అందిస్తోంది. ఈ కలర్ ఆప్షన్లు యువత నుంచి ఫ్యామిలీ యూజర్ల వరకు ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టు ఉంటాయి.

Renault New 2026 Duster Design Engine Mileage And Expected Price All Top Things

ఈ కొత్త SUVలో రెనాల్ట్ మూడు శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను అందిస్తోంది. మొదటగా, 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పనిచేసే ఈ యూనిట్ 160 bhp పవర్, 172 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకో ఆప్షన్‌గా, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 160 bhp పవర్‌ను 280 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది.

మూడవది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 100 bhp పవర్, 160 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, నగర ప్రయాణాలకు సరైన బ్యాలెన్స్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, వేరియంట్‌ను బట్టి ఈ SUVలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఈ SUV 13.9 కి.మీ.ల నుండి గరిష్టంగా 19.87 కి.మీ.ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

Renault New 2026 Duster Design Engine Mileage And Expected Price All Top Things

ఇంటీరియర్ చూసినట్లయితే, లోపల 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మొదలగునవి ఉన్నాయి. భద్రత పరంగా, లెవల్-2 ADAS, TPMS , ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 19 లక్షలు(ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

Article Published On: Tuesday, January 27, 2026, 14:51 [IST]
English summary
Renault new 2026 duster design engine mileage and expected price all top things
Read more on: #renault #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+