2030 నాటికి సగం మార్కెట్‎ను కొల్లగొట్టే ప్లాన్..రెనాల్ట్ సరికొత్త SUVల లుక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

భారతీయ కార్ల మార్కెట్లో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) ఒక భారీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. కంపెనీ తన futuREady ప్రాజెక్ట్ కింద 2030 నాటికి భారతదేశంలో పలు సరికొత్త మోడళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా రెనాల్ట్ ఇటీవల తన సరికొత్త బ్రిడ్జర్ (Bridger) కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే భవిష్యత్తులో 4-మీటర్ల కంటే తక్కువ పొడవుండే ఒక పవర్‌ఫుల్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని రెనాల్ట్ సంస్థ మార్కెట్లోకి తీసుకురానుంది.

మేడ్ ఇన్ ఇండియా - గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ హబ్
రెనాల్ట్ తీసుకురాబోతున్న ఈ సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీని 2027 చివరి నాటికి భారతదేశంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కారు అత్యంత విశేషమైన విషయం ఏంటంటే.. దీనిని పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేయనున్నారు.

Renault s Big India Plan New SUVs Hybrid Models and Affordable EVs by 2030

తమిళనాడులో ఉన్న రెనాల్ట్ ప్లాంట్ లోనే ఈ కార్ల అసెంబ్లింగ్ జరుగుతుంది. ఇక్కడ తయారైన కార్లను కేవలం భారతీయ కస్టమర్లకే కాకుండా.. ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎక్స్‌పోర్ట్చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల భారతదేశం రెనాల్ట్ కంపెనీకి ఒక గ్లోబల్ హబ్ గా మారనుంది.

ఫస్ట్ టైమ్ కార్లు కొనేవారి కోసం అద్భుతమైన ఫీచర్లు
మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే మిడిల్ క్లాస్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ కొత్త ఎస్‌యూవీని డిజైన్ చేస్తున్నారు. ఇది కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల నగరాల్లోని ట్రాఫిక్ లో నడపడం చాలా సులభం అవుతుంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ కారు లోపల స్పేస్ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు.

ఈ కారుకు 200 మిమీ (mm) భారీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వనున్నారు, ఇది మన భారతీయ రోడ్లకు చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అంతేకాకుండా ఇందులో 400 లీటర్ల పెద్ద బూట్ స్పేస్, వెనుక సీట్లో కూర్చునే వారికి 200 మిమీ లెగ్‌రూమ్ లభిస్తుంది.

Renault s Big India Plan New SUVs Hybrid Models and Affordable EVs by 2030

RGMP ప్లాట్‌ఫామ్ పై సరికొత్త ఇంజన్
మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కారు రెనాల్ట్ కైగర్ (Kiger) కంటే పై సెగ్మెంట్ లో ఉంటుంది. దీని లుక్స్ రెనాల్ట్ గ్లోబల్ ఎస్‌యూవీల మాదిరిగా చాలా బోల్డ్ గా మరియు మోడ్రన్ గా ఉండబోతున్నాయి. మార్కెట్లో దీని పోటీ విషయానికి వస్తే.. ఇది కియా సైరోస్, మహింద్రా విజన్ ఎస్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కారును కంపెనీ సరికొత్త RGMP ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏంటంటే.. దీనిపై పెట్రోల్, హైబ్రిడ్,ఎలక్ట్రిక్ (EV) మూడు రకాల వాహనాలను తయారు చేయవచ్చు. ప్రారంభంలో ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను అందించే అవకాశం ఉంది.

డస్టర్ సిరీస్ లో 7-సీటర్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్
రెనాల్ట్ కంపెనీ తన ప్లాన్ లో భాగంగా 2030 నాటికి మొత్తం నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో మొదటిది సరికొత్త నెక్స్ట్ జనరేషన్ డస్టర్ (Duster) కాగా.. వచ్చే ఏడాది నాటికి దీని 7-సీటర్ (3-రో ఎస్‌యూవీ) వేరియంట్ ను కూడా లాంచ్ చేయనున్నారు. ఆ వెంటనే బ్రిడ్జర్ బేస్డ్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వస్తుంది.

అంతేకాకుండా, ఈ ఏడాది చివరి నాటికి డస్టర్ సిరీస్ లో 1.8 లీటర్ పవర్‌ఫుల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజన్ సిస్టమ్‌ను కూడా జోడించనున్నారు. దీనివల్ల కస్టమర్లకు అత్యుత్తమ పర్ఫార్మెన్స్ తో పాటు కళ్లు చెదిరే మైలేజ్ కూడా లభిస్తుంది. భవిష్యత్తులో సామాన్యుల బడ్జెట్ లో ఒక చౌకైన ఎలక్ట్రిక్ కారును (Affordable EV) కూడా లాంచ్ చేయడానికి రెనాల్ట్ కసరత్తులు చేస్తోంది.

Article Published On: Sunday, June 21, 2026, 11:28 [IST]
English summary
Renault s big india plan new suvs hybrid models and affordable evs by 2030
Read more on: #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+