రెండు కుటుంబాలకు సరిపోయే కారు రూ.5.76 లక్షలకే .. దేశంలో చీపెస్ట్! జాతర్లు, ఫంక్షన్ల టైంలో ఇదే బెస్ట్!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ ధరలో ఎక్కువ ఉపయోగం అందించే కార్లలో రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఫ్యామిలీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV, ముఖ్యంగా 7 సీట్ల ఎంపికను తక్కువ ధరలో అందించడం వల్ల ఎంతోమంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. నగరాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ పెద్ద కుటుంబాలతో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక ప్రాక్టికల్, సరసమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ కారుకు ఉన్న డిమాండ్ అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2026లో ట్రైబర్ మొత్తం 2,011 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య కేవలం 1,552 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 30 శాతం వృద్ధిని సాధించడం నిజంగా విశేషం.
మార్కెట్లో పోటీ పెరుగుతున్నప్పటికీ, ఈ స్థాయి గ్రోత్ సాధించడం ట్రైబర్‌పై వినియోగదారుల నమ్మకం ఇంకా బలంగా ఉందని సూచిస్తోంది. ఇది కేవలం ఒక MPV మాత్రమే కాదు, చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం వరకు అందరికీ సరిపోయేలా రూపుదిద్దుకున్న మల్టీ-యూజ్ వాహనం. సీటింగ్ ఫ్లెక్సిబిలిటీ, అవసరానికి తగ్గట్టు సీట్లను మార్చుకునే అవకాశం, మంచి స్పేస్ ఇవి కలిసి దీన్ని డైలీ యూజ్‌కు మరింత అనుకూలంగా మారుస్తున్నాయి.

వార్షికంగా మంచి పురోగతిని సాధించినప్పటికి నెలవారీగా చూసినట్లయితే మాత్రం తగ్గుదలను నమోదు చేయడం గమనార్హం. 2026 ఫిబ్రవరిలో ట్రైబర్ అమ్మకాలు మొత్తం 2,419 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది మార్చిలో 2,011 యూనిట్లుగా నమోదు అయింది. అంటే దాదాపుగా 17 శాతం తగ్గుదలను సూచిస్తుంది. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నెలవారీగా మాత్రం సేల్స్‌లో తగ్గుదల కనిపించింది.
దీని డిజైన్ గురించి చూసినట్లయితే, ప్రాక్టికాలిటీతో పాటు ఆకర్షణీయమైన స్టైల్‌ను కలిపిన మోడల్‌గా నిలుస్తుంది. బయటకు చూస్తే ఇది కాంపాక్ట్‌గా కనిపించినా, లోపల మాత్రం విస్తృతమైన స్పేస్‌ను అందించేలా డిజైన్ చేశారు. ఫ్రంట్‌లో ఉన్న బోల్డ్ గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్స్, అలాగే LED DRLs కారుకు ఒక మోడర్న్ లుక్‌ను ఇస్తాయి. బంపర్ డిజైన్ కూడా కాస్త మస్క్యులర్‌గా ఉండటంతో, చిన్న MPV అయినప్పటికీ SUV తరహా ఫీల్‌ను ఇస్తుంది.

సైడ్ ప్రొఫైల్ చూస్తే, క్లీన్ లైన్స్, సింపుల్ స్టైలింగ్ కనిపిస్తుంది. రూఫ్ రైల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్ వంటి ఎలిమెంట్స్ వల్ల ఇది మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే కాంపాక్ట్ డైమెన్షన్స్‌తో నగర ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడం సులభంగా ఉంటుంది. ధర పరంగా బేస్ వేరియంట్ సుమారు రూ.5.76 లక్షల నుంచే ప్రారంభమవుతుండగా, టాప్ వేరియంట్ కూడా కేవలం రూ.8.60 లక్షల వరకు మాత్రమే ఉండటం దీని ప్రధాన ఆకర్షణ.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ నగర ప్రయాణాలకు సరిపోయే విధంగా స్మూత్, సాఫ్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ట్రాఫిక్‌లో సులభంగా నడిపించగలిగే స్వభావం ఉండటం వల్ల డైలీ యూజ్‌కు ఇది అనుకూలంగా ఉంటుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు AMT ఆప్షన్‌ను కూడా రెనాల్ట్ అందిస్తోంది.

ఫీచర్ల విషయంలో కూడా ట్రైబర్ ఒక పూర్తి ప్యాకేజీలా కనిపిస్తుంది. రోజువారీ వినియోగానికి అవసరమైన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లు, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ కారును మరింత ఆధునికంగా నిలబెడుతున్నాయి. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో పాటు కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి చిన్న కానీ ఉపయోగకరమైన సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








