రూ. 6 లక్షల్లో 7-సీటర్ కావాలా? ఇది రెండు కుటుంబాలకు సరిపోద్ది! డబ్బులు చాలా ఆదా చేయచ్చు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో బడ్జెట్ ఫ్యామిలీ కార్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ సీట్లు, మంచి స్పేస్, ప్రయాణ సౌకర్యం కోరుకునే కుటుంబాలు ఇప్పుడు ఎక్కువగా MPV కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ విభాగంలో రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన ట్రైబర్ (Triber) ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అందుబాటు ధరలో 7 సీట్ల సౌకర్యాన్ని అందిస్తూ మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న ఈ కారు, దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ప్రత్యేకంగా చిన్న కుటుంబాలు మాత్రమే కాకుండా, ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలు కూడా ట్రైబర్‌ను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నాయి.

నగర ప్రయాణాలకు మాత్రమే కాదు, లాంగ్ డ్రైవ్‌లకు కూడా అనుకూలంగా ఉండటం ట్రైబర్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌. షోరూమ్‌ల వద్ద ఈ MPVకి స్థిరమైన డిమాండ్ కనిపిస్తోంది. 2026 ఏప్రిల్ నెలలో ట్రైబర్ అమ్మకాలు ఈ కారుపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించాయి. ఆ నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 1,917 యూనిట్ల ట్రైబర్ కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిగా చెప్పుకోవచ్చు.

Renault Triber Mpv April 2026 Sales Recorded 1917 Units More Details Inside

ఎందుకంటే 2025 ఏప్రిల్‌లో కేవలం 1,401 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 516 కార్లు ఎక్కువగా విక్రయించబడటం విశేషం. ఈ సంఖ్యలు చూస్తే బడ్జెట్ MPV సెగ్మెంట్‌లో ట్రైబర్ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోందని స్పష్టంగా అర్థమవుతోంది.మార్చి నెలతో పోలిస్తే 94 ట్రైబర్ కార్లు తక్కువగా అమ్ముడైనప్పటికీ, 2025లోని అదే నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో ఎక్కువ ట్రైబర్ కార్లు అమ్ముడయ్యాయి.

అయితే అమ్మకాల పరంగా చూస్తే, గత కొన్ని నెలలుగా ట్రైబర్‌కు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నెలలో ఈ కారు అమ్మకాలు కాస్త నిరాశపరిచినట్లు ఆటోమొబైల్ మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే గత ఆరు నెలల్లో ఇదే నెలలో అత్యల్ప సంఖ్యలో ట్రైబర్ కార్లు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా, గత ఆరు నెలల కాలంలో తొలిసారిగా ట్రైబర్ నెలవారీ అమ్మకాలు 2,000 యూనిట్ల కంటే దిగువకు పడిపోయాయి.

Renault Triber Mpv April 2026 Sales Recorded 1917 Units More Details Inside

ఇక ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం ట్రైబర్ మంచి జోష్ చూపించింది. ముఖ్యంగా జనవరి 2026లో అత్యధికంగా 2,509 యూనిట్ల అమ్మకాలతో బలమైన ప్రదర్శన చేసింది. ఆ సమయంలో తక్కువ ధరలో 7-సీటర్ కారు కావాలనుకునే వినియోగదారులు ఎక్కువగా ఈ MPV వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కానీ తరువాతి నెలల్లో మార్కెట్ పోటీ పెరగడం, కొత్త మోడళ్ల ప్రవేశం వంటి కారణాలతో అమ్మకాలు కొంత మేర ప్రభావితమైనట్లు భావిస్తున్నారు.

సాధారణంగా 7-సీటర్ కార్లు అంటే అధిక ధర ఉంటుందని భావించే వినియోగదారులకు ట్రైబర్ మాత్రం తక్కువ బడ్జెట్‌లోనే పెద్ద కుటుంబానికి సరిపోయే ఆప్షన్‌గా నిలిచింది. వేరియంట్ల విషయానికి వస్తే, ట్రైబర్ ప్రస్తుతం ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీంతో వినియోగదారులు తమ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం పొందుతున్నారు.

Renault Triber Mpv April 2026 Sales Recorded 1917 Units More Details Inside

ధరల పరంగా బడ్జెట్ ఫ్రెండ్లీగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.81 లక్షల నుంచి రూ. 8.69 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధరలో 7-సీటర్ ఫ్యామిలీ కారు అందుబాటులో ఉండటం ట్రైబర్‌కు ఇప్పటికీ ప్రధాన బలంగా చెప్పొచ్చు. ఈ MPVలో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఎంపికను కూడా అందిస్తోంది.

Article Published On: Sunday, May 17, 2026, 11:02 [IST]
English summary
Renault triber mpv april 2026 sales recorded 1917 units more details inside
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+