చేతిలో రూ.6 లక్షలు ఉంటే ఈ 7-సీటర్ బెస్ట్ ఆప్షన్.. జాతర్లు, ఫంక్షన్ల టైంలో ఫ్యామిలీకి బాగా యూజ్ అవుద్ది!

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 7-సీటర్ MPV కార్లలో రెనాల్ట్ ట్రైబర్ (renault triber) ఒకటి. తక్కువ ధర, విశాలమైన క్యాబిన్, కుటుంబ అవసరాలకు సరిపోయే సీటింగ్ సామర్థ్యంతో ఈ కారు మధ్యతరగతి కుటుంబాల్లో మంచి ఆదరణను సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబం కోసం బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకునే వారికి ట్రైబర్ చాలా కాలంగా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇప్పుడు విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ట్రైబర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపించాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 2026లో మొత్తం 1,871 రెనాల్ట్ ట్రైబర్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది 31.7 శాతం వృద్ధి.

ప్రస్తుతం మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వృద్ధిని నమోదు చేయడం ట్రైబర్‌కు వినియోగదారుల్లో ఉన్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దీని ధర. రెనాల్ట్ ట్రైబర్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 5,80,875 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో టాప్ వేరియంట్ ధర కూడా రూ. 8,68,950 (ఎక్స్-షోరూమ్) మాత్రమే.

Renault Triber Mpv India Sales Rise 32 Percent In June 2026

7-సీటర్ MPV సెగ్మెంట్‌లో తక్కువ బడ్జెట్‌లో పెద్ద కుటుంబానికి సరిపోయే కారును కొనుగోలు చేయాలనుకునే వారు ట్రైబర్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సరసమైన ధరతో పాటు మంచి స్థలం, అవసరమైన ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు కూడా ట్రైబర్ అమ్మకాలు పెరగడానికి కీలక కారణాలుగా నిలుస్తున్నాయి. రానున్నది మొత్తం కూడా పండగల సీజన్ కాబట్టి ఆ టైంలో సేల్స్ మరింత పెరగొచ్చు.

పనితీరు విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్‌లో 1.0-లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 72 PS పవర్‌తో పాటు 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలతో పాటు రోజువారీ వినియోగానికి అనువుగా ఉండే ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. సాఫీ డ్రైవింగ్ అనుభూతి కోరుకునే కుటుంబాలకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.

Renault Triber Mpv India Sales Rise 32 Percent In June 2026

డిజైన్ పరంగా ట్రైబర్ పొడవు 3,985 మిమీ మాత్రమే. అంటే ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు కలిగిన MPV అయినప్పటికీ, రెనాల్ట్ ఇందులో 3-వరుసల సీటింగ్ అందించింది. దీంతో అవసరాన్ని బట్టి 7 మంది వరకు ప్రయాణించవచ్చు. మూడో వరుస సీట్లను మడతపెడితే లగేజ్ కోసం మరింత స్థలం కూడా లభిస్తుంది. అందుకే చిన్న కుటుంబాల నుంచి పెద్ద కుటుంబాల వరకు అందరికీ ట్రైబర్ అనువైన కారు.

ఫీచర్ల పరంగా కూడా ట్రైబర్ తన ధరకు తగ్గట్టుగా మంచి ప్యాకేజీని అందిస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, USB పోర్ట్స్, 17.78 సెం.మీ. TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 20.32 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

Renault Triber Mpv India Sales Rise 32 Percent In June 2026

భద్రత విషయంలో కూడా రెనాల్ట్ ట్రైబర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ఫాలో మీ హోమ్ హెడ్‌లైట్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అలాగే అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Article Published On: Saturday, July 11, 2026, 17:11 [IST]
English summary
Renault triber mpv india sales rise 32 percent in june 2026
Read more on: #renault #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+