రూ.3.47 లక్షలకే 1200 కిమీ రేంజ్! చైనా నుంచి వస్తున్న ఈ 'బుజ్జి'కారు ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

పెట్రోల్ ధరలు చూసి బైక్ బయటకు తీయడానికి కూడా భయపడుతున్నారా? అలాంటిది ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం కాదు... నెలరోజులు కూడా టెన్షన్ లేకుండా తిరిగే కారు వస్తే ఎలా ఉంటుంది? అదీ కేవలం రూ.3.5 లక్షల బడ్జెట్‌లోనే అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడు బైక్ బయటకు తీయాలన్నా జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లుతోంది.

కానీ మార్కెట్లో ఉన్న మంచి ఈవీలు కొనాలంటే కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే కేవలం ఒక ఖరీదైన స్మార్ట్‌ఫోన్ లేదా సెకండ్ హ్యాండ్ కారు ధరకే సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది. చైనాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఫస్ట్ ఆటో వర్క్స్ (FAW) తన బెస్ట్‌ట్యూన్ బ్రాండ్ కింద షామో (Xiaoma) అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. దీని ధర, రేంజ్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

Rs 3 47 Lakh EV with 1200KM Range This Tiny Car Is Shocking Everyone

ఈ చిన్ని కారుకు ఉన్న అతి పెద్ద బలం దాని రేంజ్. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఖరీదైన ఈవీలు కూడా 400 నుంచి 500 కిమీ రేంజ్ ఇస్తుంటాయి. కానీ బెస్ట్‌ట్యూన్ షామో (Xiaoma) స్టాండర్డ్ వేరియంట్ 800 కిమీ రేంజ్ ఇస్తుండగా, రేంజ్ ఎక్స్‌టెండర్ సిస్టమ్ సాయంతో ఇది ఏకంగా 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని సాధ్యం చేస్తుంది.

1200 కిమీ రేంజ్.. ఇది ఎలా సాధ్యం?
చాలా మందికి వచ్చే సందేహం ఇదే. ఇంత చిన్న కారు 1200 కిలోమీటర్లు ఎలా వెళ్తుంది? అని. ఇక్కడే కంపెనీ ఒక తెలివైన టెక్నాలజీని వాడింది. దీని స్టాండర్డ్ బ్యాటరీ 800 కిమీ రేంజ్ ఇస్తుండగా, రేంజ్ ఎక్స్‌టెండర్ (Range Extender) అనే చిన్న ఇంజిన్ లేదా టెక్నాలజీ సాయంతో దీనిని 1200 కిలోమీటర్ల వరకు పొడిగించవచ్చు. అంటే ఇది ప్యూర్ ఎలక్ట్రిక్, అసిస్టెడ్ మోడ్ కలయికతో పనిచేస్తుంది.

Rs 3 47 Lakh EV with 1200KM Range This Tiny Car Is Shocking Everyone

అంటే మీరు సిటీలో తిరిగేవారైతే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా రోజుల వరకు ఛార్జింగ్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ కారు FME ప్లాట్‌ఫారమ్ అనే సరికొత్త టెక్నాలజీపై రూపొందింది, ఇది 800V ఆర్కిటెక్చర్‌ను సపోర్ట్ చేస్తుంది.

చైనా మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర కేవలం 30,000 యువాన్లు. దీనిని మన భారత కరెన్సీలోకి మార్చితే సుమారు రూ.3.47 లక్షలు మాత్రమే. దీని అత్యంత ఖరీదైన టాప్ ఎండ్ వేరియంట్ కూడా కేవలం రూ.5.78 లక్షల లోపే లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆల్టో లేదా టాటా టియాగో కంటే ఇది చాలా తక్కువ ధర.

తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ధర తక్కువ కదా అని ఫీచర్లలో కంపెనీ ఎక్కడా రాజీ పడలేదు. కారు లోపల 7-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీని ఇంటీరియర్ డ్యూయల్ టోన్ థీమ్‌తో చాలా కలర్‌ఫుల్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది.

Rs 3 47 Lakh EV with 1200KM Range This Tiny Car Is Shocking Everyone

డిజిటల్ క్లస్టర్, పవర్ విండోస్, క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ వంటి అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీని డిజైన్ బాక్సీగా ఉండి, చూడటానికి చాలా క్యూట్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని ఎయిరోడైనమిక్ వీల్స్ కారు రేంజ్‌ను పెంచడంలో సహాయపడతాయి.

బెస్ట్‌ట్యూన్ షామో కొలతలు చూస్తే, దీని పొడవు 3000 మిమీ, వెడల్పు 1510 మిమీ. అంటే చాలా తక్కువ స్థలంలోనే దీనిని పార్క్ చేయవచ్చు. భారీ ట్రాఫిక్ ఉండే హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రయాణించడానికి, సన్నని గల్లీల్లో తిరగడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది.

ఇందులో 20 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది కారు వెనుక చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. సేఫ్టీ పరంగా చూస్తే డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ (ABS) వంటి ఫీచర్లను కూడా చేర్చారు. ప్రస్తుతానికి ఈ కారును చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ఇది ఉలింగ్ హోంగ్‌గువాంగ్ మినీ ఈవీ వంటి పాపులర్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, బెస్ట్‌ట్యూన్ కంపెనీ ఈ కారును ఇండియాకు తీసుకువచ్చే ప్రస్తుతం లేకపోయినా.. భవిష్యతులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదే ధరతో ఇండియాలోకి వస్తే, టాటా టియాగో EV (250-315KM), MG కామెట్ EV (230KM) లాంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. తక్కువ ధరలో భారీ రేంజ్ కోరుకునే మధ్యతరగతి వారికి ఇది గేమ్ ఛేంజర్ కావచ్చు.

Article Published On: Tuesday, May 5, 2026, 7:12 [IST]
English summary
Rs 3 47 lakh ev with 1200km range this tiny car is shocking everyone
Read more on: #electric car #china
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+