అమ్మ, నాన్న, పిల్లలు, బంధువులు అందరూ ఒకే కారులో.. రూ.6 లక్షల కారుపై రూ.60,000 తగ్గింపు

మనదేశంలో మధ్య తరగతి కుటుంబాలకు ఏడుగురు కూర్చునే కారు (7 Seater MPV) కొనడం అనేది ఒక పెద్ద కల. అయితే ఎర్టిగా, కారెన్స్ వంటి కార్ల ధరల బడ్జెట్ పది లక్షల దాటిపోతుండటంతో చాలామంది కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి రెనాల్ట్ ఇండియా ఒక అద్భుతమైన వార్త చెప్పింది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరుగాంచిన రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) పై మే 2026 నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ.5.81 లక్షల ప్రారంభ ధరకే లభించే ఈ కారుపై ఇప్పుడు రూ.60,000 వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

రెనాల్ట్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎమ్‌పీవీ ట్రైబర్‌పై మే 2026లో కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తోంది. మీరు ఈ నెలలో ట్రైబర్ కొనుగోలు చేస్తే మొత్తం రూ.60,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ.15,000 నేరుగా నగదు తగ్గింపు (Cash Discount), పాత కారును మార్చుకునే వారికి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్ లభిస్తుంది. వీటికి అదనంగా కస్టమర్ల నమ్మకానికి గుర్తుగా లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అయితే, ఎంట్రీ లెవల్ వేరియంట్లు అయిన అథెంటిక్, ఎవల్యూషన్ ట్రిమ్స్‌పై మాత్రం కేవలం లాయల్టీ, స్క్రాపేజ్ బెనిఫిట్స్ మాత్రమే వర్తిస్తాయి.

Rs 60 000 Discount on Renault Triber Indias Most Affordable 7 Seater Now Starts at Just Rs 5 81 Lakh

ప్రాంతాల వారీగా కూడా రెనాల్ట్ కొన్ని ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది. తమిళనాడులో కార్పొరేట్ బోనస్ కింద రూ.15,000 వరకు తగ్గింపు లభిస్తుండగా, మిగిలిన రాష్ట్రాల్లో అంతటా ఇది రూ.10,000గా ఉంది. అంతేకాకుండా, దేశానికి వెన్నెముక అయిన రైతులు, గ్రామ సర్పంచులు, గ్రామ పంచాయతీ సభ్యుల కోసం రూరల్ ఆఫర్ కింద అదనంగా రూ.4,000 ప్రయోజనాన్ని కూడా రెనాల్ట్ అందిస్తోంది. ట్రైబర్ MY2025 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.81 లక్షల నుంచి ప్రారంభమై రూ.8.48 లక్షల వరకు ఉన్నాయి.

భారత మార్కెట్లో 7-సీటర్ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా రూమియన్, కియా కారెన్స్ వంటి కార్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ వీటి ధరలు సామాన్యుడికి భారం కావచ్చు. అటువంటి సమయంలో రెనాల్ట్ ట్రైబర్ ఒక పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఇది కేవలం తక్కువ ధరకే కాకుండా, నిస్సాన్ కొత్తగా తీసుకురాబోతున్న గ్రావైట్(Gravite)కు కూడా గట్టి పోటీనిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కోరుకునే వారికి ట్రైబర్ బెస్ట్ ఛాయిస్.

Rs 60 000 Discount on Renault Triber Indias Most Affordable 7 Seater Now Starts at Just Rs 5 81 Lakh

రెనాల్ట్ ట్రైబర్‌ను ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో మూన్‌లైట్ సిల్వర్, సీడర్ బ్రౌన్ వంటి డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్‌తో లభిస్తాయి. కొత్తగా 14-అంగుళాల ఫ్లెక్స్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ తో కూడిన డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

ట్రైబర్‌లో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 71 hp గరిష్ట శక్తిని, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఏఎమ్‌టీ (AMT) ఆప్షన్లలో లభిస్తుంది. సిటీ డ్రైవింగ్‌కు, చిన్నపాటి లాంగ్ ట్రిప్పులకు ఇది సరిగ్గా సరిపోతుంది. మైలేజీ విషయానికి వస్తే, ఇది లీటరుకు 18 నుంచి 19 కిలోమీటర్ల వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంది, ఇది ఒక 7-సీటర్ కారుకు చాలా మంచి మైలేజీ అని చెప్పవచ్చు.

Rs 60 000 Discount on Renault Triber Indias Most Affordable 7 Seater Now Starts at Just Rs 5 81 Lakh

ట్రైబర్ అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని స్పేస్. దీని వీల్‌బేస్ 2,636mm, గ్రౌండ్ క్లియరెన్స్ 182mm గా ఉంది. లోపల కూర్చునే వారికి ఇబ్బంది లేకుండా సీట్లను దాదాపు 100 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. సేఫ్టీ పరంగా కూడా ఇది నమ్మదగ్గది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలకు 4-స్టార్, పిల్లలకు 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. లోడ్ లిమిటర్, ప్రీటెన్షనర్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు అదనపు రక్షణను ఇస్తాయి.

Article Published On: Thursday, May 7, 2026, 7:11 [IST]
English summary
Rs 60 000 discount on renault triber indias most affordable 7 seater now starts at just rs 5 81 lakh
Read more on: #renault #family car #mpv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+