డిజైర్ తర్వాత దేశంలో అందరూ కొంటున్న కారు ఇదే.. ఇండియాలో చాలా పాపులర్ అయింది

SUVల హవా నడుస్తున్న ఈ రోజుల్లో సెడాన్లకు భవిష్యత్తు లేదని చాలామంది అనుకున్నారు. కానీ ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ మారుతి సుజుకి డిజైర్‌తో పాటు ఇప్పుడు హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) కూడా మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. రోడ్లపై ఎత్తైన SUVలే కనిపిస్తున్న ఈ సమయంలో, ఒక కాంపాక్ట్ సెడాన్ ఇంత భారీగా అమ్మకాలు సాధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్‌కు చెందిన ఆరా, 2026 జనవరి నెలలో ఊహించని స్థాయిలో అమ్మకాలు నమోదు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. గత కొన్ని నెలలుగా ఈ సెడాన్‌కు మార్కెట్‌లో వస్తున్న స్పందనను చూసి కంపెనీ కూడా ఆశ్చర్యపోయిందనే చెప్పాలి.

జనవరి 2026లో హ్యుందాయ్ మొత్తం 7,978 యూనిట్ల ఆరా కార్లను విక్రయించింది. ఇదే 2025 జనవరిలో 5,388 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే దాదాపు 48 శాతం వృద్ధి కావడం విశేషం. ఈ గణాంకాలు ఒక్క నెల విజయం మాత్రమే కాదు, సెడాన్ సెగ్మెంట్‌కు బలమైన డిమాండ్ ఉందని స్పష్టంగా చూపిస్తున్నాయి. జనవరి నెలలో భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 25 కార్ల జాబితాలో హ్యుందాయ్ ఆరా చోటు సంపాదించుకుంది.

Sedan Car Hyundai Aura January 2026 Sales 48 Percent Growth Compared To Previous

ఆ జాబితాలో మారుతి డిజైర్ తర్వాత స్థానం దక్కించుకున్న ఏకైక సెడాన్ ఇదే కావడం ఆరా ప్రాచుర్యాన్ని మరింత స్పష్టం చేస్తుంది. పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండడం, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్, హ్యుందాయ్ నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ కలిసి ఆరాను మిడిల్ క్లాస్ కొనుగోలుదారులకు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి. నెలవారీ ప్రాతిపదికన కూడా, ఈ కాంపాక్ట్ సెడాన్ భారీ సేల్స్ సాధించింది.

హ్యుందాయ్ ఆరా విజయానికి గణాంకాలే సాక్ష్యం చెబుతున్నాయి. 2025 డిసెంబర్‌లో 4,925 యూనిట్లు అమ్ముడైన ఈ కాంపాక్ట్ సెడాన్, కేవలం ఒక నెల వ్యవధిలోనే 2026 జనవరిలో 7,978 యూనిట్లకు చేరుకుంది. అంటే నెలవారీ ప్రాతిపదికన కూడా గట్టి వృద్ధిని నమోదు చేసింది. SUVల ఆధిపత్యం మధ్యలోనూ, సౌకర్యం, సులభమైన డ్రైవింగ్ అనుభవం, భద్రత ఇవన్నీ సమతుల్యంగా ఇచ్చే కారును భారతీయులు ఇప్పటికీ ఆదరిస్తున్నారని ఇది నిరూపిస్తోంది.

Sedan Car Hyundai Aura January 2026 Sales 48 Percent Growth Compared To Previous

ప్రస్తుతం హ్యుందాయ్ ఆరా ధర రూ.6 లక్షల నుంచి రూ.8.54 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ ధర రేంజ్‌లో మంచి ఫీచర్లు, ప్రీమియం లుక్, హ్యుందాయ్ బ్రాండ్ నమ్మకం కలిసి ఆరాను మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. ఇంజిన్ పరంగా చూస్తే, ఇందులో 1.2-లీటర్ కప్పా సిరీస్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది.

ఈ ఇంజిన్ 82 bhp శక్తి, 114 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాల్లో సాఫీ డ్రైవ్ అనుభూతిని, అవసరమైనప్పుడు సరిపడా పవర్‌ను ఇది అందిస్తుంది. మైలేజీ కోసం CNG ఆప్షన్ అందుబాటులో ఉంది. CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 68 bhp పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభించే ఈ వేరియంట్‌కు మైలేజీ 28 km/kg ఇస్తుంది.

Sedan Car Hyundai Aura January 2026 Sales 48 Percent Growth Compared To Previous

హ్యుందాయ్ ఆరా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLs, LED టెయిల్ ల్యాంప్‌లు, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి. ఫుట్‌వెల్ లైటింగ్, రియర్ AC వెంట్స్ వంటి సౌకర్యాలు కుటుంబ ప్రయాణాన్ని మరింత హాయిగా మారుస్తాయి. భద్రత విషయంలో కూడా ఆరా ఏమాత్రం తగ్గదు. చిన్న కుటుంబానికి ఇది సేఫ్, ప్రాక్టికల్ ఎంపికగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, February 13, 2026, 14:10 [IST]
English summary
Sedan car hyundai aura january 2026 sales 48 percent growth compared to previous
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+