సెప్టెంబర్ 30 చివరి అవకాశం: కార్లపై భారీ డిస్కౌంట్లు, ఈరోజే ఇన్వాయిస్ చేయించుకుంటే లక్షల్లో ఆదా!
ఈరోజు సెప్టెంబర్ 30... కార్ డీలర్ల మంత్-ఎండ్ టార్గెట్లకు ఈ రాత్రితో గడువు ముగుస్తోంది! హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరులోని కార్ ప్రియులకు సెప్టెంబర్ ఆఫర్లను సొంతం చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. రేపటి నుంచి అక్టోబర్ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. నెలాఖరు ఒత్తిడి కారణంగా డీలర్లు ఇచ్చే అదనపు ఆఫర్లు పొందాలంటే, ఈరోజే ఇన్వాయిస్ బిల్లు జనరేట్ అవ్వడంతో పాటు కాగితాల పని పక్కాగా పూర్తవ్వాలి.
ఈ నెలలో కార్లపై భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. హ్యుందాయ్ పాపులర్ మోడళ్లపై సెప్టెంబర్ 30 వరకు ఏకంగా ₹1 లక్ష వరకు లబ్ధి చేకూరుస్తుండగా, టాటా నెక్సాన్‌పై అన్ని ఆఫర్లు కలిపి ₹75,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. వోక్స్‌వాగన్ డీలర్లు వర్టస్, టైగూన్, టైగన్ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించారు. నిస్సాన్ మాగ్నైట్ సెప్టెంబర్ కి మాత్రమే పరిమితమైన ప్రత్యేక స్కీమ్‌లను అందిస్తోంది. ఇక ఎంజీ ఎస్‌యూవీలపై డీలర్ల వారిగా భారీగా రేట్లు తగ్గాయి.

సెప్టెంబర్ కార్ డిస్కౌంట్లు: డీలర్ ఆఫర్లు ఎలా వర్తిస్తాయి?
డిస్కౌంట్లలో ప్రధానంగా ఐదు రకాలు ఉంటాయి: కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ లేదా కార్పొరేట్ ఆఫర్, స్క్రాపేజ్ బోనస్.. వీటితో పాటు టార్గెట్లు రీచ్ అవ్వడానికి డీలర్లు స్వయంగా ఇచ్చే అదనపు తగ్గింపు! అయితే కేవలం కార్ బుక్ చేసుకున్నంత మాత్రాన పాత ధర దక్కదు. మీరు రాతపూర్వకంగా 'ప్రైస్ ప్రొటెక్షన్' తీసుకుంటే తప్ప, ఇన్వాయిస్ తేదీ నాటికి ఉన్న ధరలే వర్తిస్తాయి. డీలర్ తగ్గింపులపై కూడా కార్ కంపెనీల పరిమితులు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ప్రధాన నగరాల్లో ఇఎంఐ (EMI) లెక్కలు ఇవే..
ఒక అంచనా కోసం మార్కెట్లో బాగా అమ్ముడయ్యే మారుతి సుజుకి స్విఫ్ట్ LXi మోడల్‌ను ఉదాహరణగా తీసుకుందాం. 10 శాతం డౌన్ పేమెంట్, 5 ఏళ్ల కాలపరిమితి, 8.75 శాతం వడ్డీ రేటు ప్రాతిపదికన వివిధ నగరాల్లో ఆన్-రోడ్ ధర, నెలకు వచ్చే ఈఎంఐ వివరాలు ఇక్కడ చూడండి.
| నగరం | ఆన్-రోడ్ ధర (₹ లక్షల్లో) | రుణం 90% (₹) | అంచనా EMI/నెలకు (₹) |
|---|---|---|---|
| హైదరాబాద్ | 7.07 | 6,36,300 | ≈13,150 |
| విశాఖపట్నం | 7.06 | 6,35,400 | ≈13,120 |
| విజయవాడ | 7.06 | 6,35,400 | ≈13,120 |
| బెంగళూరు | 7.32 | 6,58,800 | ≈13,600 |
ఈ ధరలను ఆటోకార్, కార్‌వేల్, జిగ్‌వీల్స్ ఆధారంగా ప్రచురించాం. అలాగే వడ్డీ రేట్లు ప్రస్తుతం ఎస్‌బీఐ (SBI) రేట్ల ప్రకారం లెక్కించాం. మీరు ఎంచుకునే బ్యాంక్ వడ్డీ రేటు, కార్ వేరియంట్, ఇన్సూరెన్స్‌ను బట్టి ఈ లెక్కల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి డీల్ పూర్తి చేసేముందు ఆన్‌లైన్ ఇఎంఐ క్యాలిక్యులేటర్‌లో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
అర్థరాత్రి లోపే ఇన్వాయిస్: ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కార్ వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN) లాక్ చేసుకుని, పగటి వెలుతురులోనే ప్రీ-డెలివరీ ఇన్స్పెక్షన్ (PDI) పూర్తి చేయండి. ఇన్వాయిస్ టైమ్‌స్టాంప్ ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రారంభమయ్యేలా చూసుకోండి. ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఆఫర్లు పొందడానికి అవసరమైన పత్రాలను సరిగ్గా సమర్పించండి. రిటైల్ ఆర్డర్‌పై ఖచ్చితమైన స్కీమ్ పేరు లేదా కోడ్‌ను నమోదు చేయించండి. అలాగే ధరల పెంపు నుండి రక్షణ (Price Protection) ఇస్తామని వాగ్దానం చేస్తే, దాన్ని తప్పకుండా రాతపూర్వకంగా తీసుకోండి.
అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు: ఈరోజే కొనాలా? పండుగ ఆఫర్ల కోసం ఆగాలా?
టాటా సంస్థ ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచి కార్ల ధరలను పెంచగా, హ్యుందాయ్ కూడా సెప్టెంబర్‌లో సవరణలు చేసింది. అక్టోబర్ నుంచి ధరలు మరింత పెంచుతున్నట్లు కియా (Kia) డీలర్లు సంకేతాలిస్తున్నారు. కాబట్టి ఈరోజే ఇన్వాయిస్ చేయించుకుంటే ఆ పెరిగే భారం నుంచి తప్పించుకోవచ్చు. మీకు నచ్చిన మోడల్, లేదా ప్రత్యేకమైన కలర్ కారు కావాలనుకుంటే వెంటనే డీల్ ఓకే చేసుకోండి. ఒకవేళ మోడల్ లేదా బ్రాండ్ విషయంలో పట్టుబట్టకుండా మంచి ఆఫర్ల కోసం చూసేవారైతే.. వచ్చే వారం ప్రకటించే పండుగ ప్రత్యేక ఆఫర్ల వరకు వేచి చూడవచ్చు.


Click it and Unblock the Notifications
