ఈ కారుకు పెట్రోల్ అవసరం లేదు.. స్నానం చేసే లోపు రెడీగా ఉంటుంది.. టాటాకు కొత్త టెన్షన్ మొదలైంది!
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో (Skoda Auto) భారతీయ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా కైలాక్, కుషాక్, స్లావియా వంటి 'మేడ్ ఇన్ ఇండియా' మోడళ్లతో భారతీయ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఇప్పటివరకు భారత్‌లో స్కోడా ప్రధానంగా పెట్రోల్ ఇంజన్ కార్లపైనే దృష్టి పెట్టినా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా బలమైన అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ తాజాగా పరిచయం చేసిన కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV 'ఎపిక్ (Epiq)' ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. స్కోడా ఎపిక్‌ను కంపెనీ ఇప్పటివరకు విడుదల చేసిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVగా పేర్కొంటున్నారు.
చిన్న సైజులో వచ్చినా, దీని డిజైన్ మాత్రం చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. స్కోడా కొత్త "మాడర్న్ సాలిడ్" డిజైన్ భాషను అనుసరించి రూపొందించిన ఈ SUV ముందు భాగంలో షార్ప్ LED లైట్లు, మూసివేసిన గ్రిల్ డిజైన్, బలమైన బంపర్, స్పోర్టీ స్టాన్స్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నగర రోడ్లపై నడిపేందుకు అనువుగా ఉండే కాంపాక్ట్ సైజ్‌తో పాటు, SUVలకు ఉండే రగ్గడ్ ఫీల్ కూడా దీనిలో కనిపిస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో ఈ మోడల్ విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, భవిష్యత్తులో భారత మార్కెట్లోకి తీసుకురావాలనే ఆలోచన స్కోడా చేయవచ్చని ఆటో రంగం భావిస్తోంది. ఒకవేళ ఇది భారత్‌లో విడుదలైతే, ఇప్పటికే మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించిన Tata Nexon EV వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని చెప్పొచ్చు. ఎపిక్ కారు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ అయింది. దీని ఫీచర్స్ గురించి చూద్దాం.
ఎంట్రీ-లెవల్ ఎపిక్ 35 వేరియంట్‌లో 38.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ మోడల్, 114 bhp పవర్, 267 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, యువత కోసం ఇది సరైన ఎంపికగా కనిపిస్తోంది. పవర్ డెలివరీ స్మూత్‌గా ఉండటంతో పాటు, నగర ట్రాఫిక్‌లో మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు.

ఇక ఎపిక్ 40 వేరియంట్‌లో కూడా 38.5 kWh బ్యాటరీనే ఉపయోగించినప్పటికీ, ఇందులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అందిస్తున్నారు. ఇది 133 bhp పవర్, 267 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు సుమారు 310 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా, గంటకు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ SUVలు పనితీరు పరంగా కూడా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
అయితే, అత్యంత శక్తివంతమైన వేరియంట్‌గా స్కోడా ఎపిక్ 55 నిలుస్తుంది. ఇందులో 55 kWh సామర్థ్యమున్న పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ముందుభాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 208 bhp పవర్, 290 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 440 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం ఉండటం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు.

చార్జింగ్ విషయంలో DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండటంతో, కేవలం 24 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు స్నానం చేసి వచ్చే లోపు ఛార్జ్ అయిపోతుంది. ఇక టాప్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్ల వరకు ఉండటం, ఇది పనితీరు పరంగా కూడా ఎంతో బలమైన ఎలక్ట్రిక్ SUV అని సూచిస్తోంది.
స్కోడా ఎపిక్ కొత్త MEB+ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించబడిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV. స్కోడా కొత్త మోడరన్ సాలిడ్ డిజైన్‌తో వచ్చిన తొలి మోడల్ ఇదే. ముందు భాగంలో టెక్-డెక్ ఫేస్, T-ఆకారపు LED లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మెరుగైన రేంజ్ కోసం ఏరోడైనమిక్ డిజైన్, యాక్టివ్ కూలింగ్ షట్టర్లు, ప్రత్యేక వీల్స్‌ను ఇందులో అందించారు. దీని గురించిన ఇతర వివరాలు రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications