పేదల నుంచి ధనవంతుల దాకా..అందరి అవసరాల మేరకు 4 పవర్ఫుల్ కార్తను తెస్తున్న స్కోడా

కార్ లవర్స్‎కు పండుగే పండుగ. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా(Skoda) భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకునేందుకు భారీ వ్యూహాలతో సిద్ధమైంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సరికొత్త కార్లను వరుసగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది స్కోడా కంపెనీ.

ఎస్యూవీల నుంచి హై పర్ఫామెన్స్ సెడాన్ల వరకు ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేయాలని స్కోడా కంపెనీ భావిస్తోంది. స్కోడా ఇండియా అందించిన సమాచారం మేరకు ఈ నాలుగు కార్ల ఫీచర్లు, ఇంజిన్ కెపాసిటీ, విడుదల తేదీల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్కోడా ఆటో ఇండియా తన 2026 కొత్త కార్ల లాంచ్ లిస్టును అధికారికంగా కన్ఫాం చేసింది. ఇందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మాత్రం స్కోడా కుషాక్ ఫేస్‎లిఫ్ట్(Kushaq Facelift).

Skoda India upcoming cars 2026 Kushaq Facelift Kodiaq RS Octavia RS

ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కుషాక్, ఇప్పుడు మరింత ఆధునిక హంగులతో రానుంది. దీని లుక్ విషయానికి వస్తే, కొత్త బంపర్లు, రివైజ్డ్ ఎల్‎ఈడీ హెడ్ లైట్లు, సరికొత్త 17 ఇంచుల అలాయ్ వీల్స్‎తో ఇది ఎంతో స్టైలిష్‎గా కనిపిస్తుంది.

ముఖ్యంగా ఇంటీరియర్ విషయానికి వస్తే.. పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో తొలిసారిగా వెనుక సీట్ల ప్రయాణికుల కోసం మసాజ్ ఫంక్షన్, 6 ఎయిర్ బ్యాగులు స్టాండర్డుగా ఫీచర్లుగా రానున్నాయి. ఇది 1.0 లీటరు, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది.

Skoda India upcoming cars 2026 Kushaq Facelift Kodiaq RS Octavia RS

ఇక రెండో త్రైమాసికంలో స్కోడా కంపెనీ నుంచి కోడియాక్ ఆర్ఎస్ (Kodiaq RS) రిలీజ్ కాబోతుంది. మంచి స్పీడు కావాలని కోరుకునే డ్రైవింగ్ లవర్స్ కోసం దీనిని స్పెషల్ గా రూపొందించారు. ఇందులో 2.0 లీటరు టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ ఏకంగా 261 బీహెచ్‌పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

దీని పికప్ ఎంత స్పీడుగా ఉంటుందంటే కేవలం కేవలం 6.3 సెకన్లలోనే సున్నా నుంచి 100కిలో మీటర్ల స్పీడు అందుకుంటుంది. 7-స్పీడ్ డీఎస్జీ గేర్ బాక్స్‌తో వచ్చే ఈ లగ్జరీ ఎస్యూవీ, భారత రోడ్ల మీద తన జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లో ఈ మోడల్ గట్టి పోటీని ఇవ్వనుంది.

Skoda India upcoming cars 2026 Kushaq Facelift Kodiaq RS Octavia RS

మూడో త్రైమాసికంలో (Q3 2026) స్కోడా కైలాక్ స్పోర్ట్ లైన్ + (Kylaq Sportline +) కంపెనీ రంగంలోకి దింపబోతుంది. ఇది స్కోడా సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ స్పోర్టీ వెర్షన్. దీనిలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 115 పీఎస్ పవర్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్లలో కొన్ని కాస్మెటిక్ ఛేంజెస్ చేసి యూత్‎ ఎట్రాక్ట్ అయ్యేలా స్పోర్టీ లుక్ ఇచ్చారు. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోడా కారు కావాలని అనుకునే వాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి అదనంగా డార్క్ థీమ్, స్పోర్టీ సీట్లు వంటి మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయి.

Skoda India upcoming cars 2026 Kushaq Facelift Kodiaq RS Octavia RS

ఇక ఈ ఏడాది చివరి త్రైమాసికంలో(Q4 2026) అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్టావియా ఆర్ఎస్(Octavia RS) రిలీజ్ కానుంది. గతేడాది కేవలం 100 కార్లను మాత్రమే లిమిటెడ్ సంఖ్యలో రిలీజ్ చేయగా, బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి.

దీనికి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను గమనించిన స్కోడా కంపెనీ, ఈ ఏడాది పెద్ద మొత్తంలో ఈ కార్లను భారత మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు, పర్ఫామెన్స్ సెడాన్ సెగ్మెంట్లో ఓ లెజెండ్. వెర్షన్ అప్‌డేట్స్‌తో పాటు లేటెస్ట్ డ్రైవింగ్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఇలా మొత్తానికి స్కోడా ఇండియా 2026ను తన నామ సంవత్సరంగా మార్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.కుషాక్ ఫేస్‌లిఫ్ట్ సాధారణ మిడిల్ క్లాస్ ప్రజల అవసరాలను తీర్చితే, కోడియాక్, ఆక్టావియా ఆర్ఎస్ వెర్షన్లు స్పీడ్, లగ్జరీ కోరుకునే వారిని అలరిస్తాయి.

మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కుషాక్ ఫేస్‌లిఫ్ట్ స్కోడా అమ్మకాలను కొత్త శిఖరానికి చేరుస్తుంది. మీరు కూడా వచ్చే ఏడాది కొత్త కారు కొనాలని ప్లాన్ అనుకుంటే స్కోడా ఇచ్చే ఈ నాలుగు ఆప్షన్లను ఒకసారి పరిశీలించడం బెటర్.

More from DriveSpark

Article Published On: Friday, January 23, 2026, 10:13 [IST]
English summary
Skoda india confirms 4 new car launches in 2026 kushaq facelift kodiaq rs octavia rs
Read more on: #skoda #skoda kushaq
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+