రూ.3 లక్షలతో కారు బుక్.. 50 మందికే ఛాన్స్.. స్కోడా ఫాస్టెస్ట్ SUV వచ్చేసింది
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్కోడా(Skoda) తన అత్యంత ప్రత్యేకమైన మోడల్ అయిన కోడియాక్ ఆర్ఎస్‌ను (Kodiaq Rs) తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.3 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి తమ వాహనాన్ని ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ఈ మోడల్‌ను పరిమిత సంఖ్యలో మాత్రమే భారతదేశానికి తీసుకురానుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి మరింత పెరిగింది. స్కోడా భారత మార్కెట్ కోసం కోడియాక్ ఆర్ఎస్ కేవలం 50 యూనిట్లను మాత్రమే కేటాయించింది. దీంతో ఈ వాహనం ప్రత్యేకత మరింత పెరిగింది.
కంపెనీ భారతీయ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లలో ఇది అత్యంత ప్రీమియం, అత్యంత శక్తివంతమైన మోడల్‌గా నిలవనుంది. పరిమిత యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు ఆలస్యం చేయకుండా సమీప స్కోడా డీలర్‌షిప్‌ను సంప్రదించాలని కంపెనీ సూచిస్తోంది. సాధారణ కోడియాక్‌తో పోలిస్తే కోడియాక్ ఆర్ఎస్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

ఇది కేవలం ఫ్యామిలీ ఎస్‌యూవీ మాత్రమే కాకుండా, హై-పెర్ఫార్మెన్స్ డ్రైవింగ్‌ను ఇష్టపడే వారికి ప్రత్యేకంగా రూపొందించబడిన మోడల్. ఆకర్షణీయమైన డిజైన్, స్పోర్టీ స్టైలింగ్, మరింత అగ్రెసివ్ లుక్‌తో ఈ ఎస్‌యూవీ రోడ్లపై ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ముందు భాగంలో ప్రత్యేక ఆర్ఎస్ బ్యాడ్జింగ్, బ్లాక్‌డ్-అవుట్ ఎలిమెంట్స్, పెద్ద అలాయ్ వీల్స్ వంటి అంశాలు దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి.
స్టాండర్డ్ కోడియాక్‌తో పోలిస్తే కొత్త కోడియాక్ RS పూర్తిగా పెర్ఫార్మెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఎస్‌యూవీగా నిలుస్తుంది. సాధారణ మోడల్‌లో లభించే ప్రీమియం ఫీచర్లకు అదనంగా మరింత స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ఇంజన్, డైనమిక్ డ్రైవింగ్ లక్షణాలను ఇందులో అందించారు. దీనికి 2.0-లీటర్ TSI Evo టర్బో-పెట్రోల్ ఇంజన్. 7-స్పీడ్ DSG డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు స్టాండర్డ్ 4X4 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జతచేశారు.

ఈ పవర్‌ట్రైన్ 265 bhp గరిష్ట శక్తిని, 400 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏడు సీట్ల భారీ SUV అయినప్పటికీ, 6.4 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగదు. గరిష్టంగా గంటకు 231 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. డిజైన్ పరంగా కూడా కోడియాక్ RS తన ప్రత్యేకతను స్పష్టంగా చాటుకుంటుంది. స్టాండర్డ్ కోడియాక్‌తో పోలిస్తే ఇందులో అనేక స్పోర్టీ స్టైలింగ్ అప్‌డేట్లు ఉన్నాయి.
ముందు భాగంలోని గ్రిల్, ORVMలు, రూఫ్ రైల్స్, విండో లైన్ వంటి అంశాలకు బ్లాక్-అవుట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం ద్వారా మరింత అగ్రెసివ్, ప్రీమియం లుక్‌ను అందించారు. అంతేకాకుండా, ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్‌లతో కూడిన భారీ 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ SUVకి రేసింగ్ క్యారెక్టర్‌ను జోడిస్తున్నాయి. రోడ్డుపై చూసిన వెంటనే ఇది సాధారణ కోడియాక్ కాదని గుర్తించేలా RS డిజైన్ రూపొందించబడింది.

క్యాబిన్‌లో స్పోర్టీ థీమ్ కొనసాగుతుంది. ప్రత్యేక RS బ్యాడ్జింగ్, కాంట్రాస్ట్ స్టిచింగ్, ప్రీమియం మెటీరియల్స్, స్పోర్ట్ సీట్లు, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. దూర ప్రయాణాల్లో సౌకర్యంతో పాటు, హై-స్పీడ్ డ్రైవింగ్‌లో మెరుగైన కంట్రోల్‌ను అందిస్తుంది. ఇది స్టీల్ గ్రే, వెల్వెట్ రెడ్, మ్యాజిక్ బ్లాక్, మూన్ వైట్ అనే నాలుగు ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ధర సుమారు రూ.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.


Click it and Unblock the Notifications