నిన్ననే అదిరిపోయే కారు లాంచ్ అయింది..రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఆగి చూడాల్సిందే
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా (Skoda) తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్(Kushaq) కొత్త వెర్షన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త హంగులు, అదిరిపోయే ఫీచర్లతో రీ-డిజైన్ చేయబడిన ఈ కారు ఇప్పుడు భారతీయ రోడ్లపై రాజసం ప్రదర్శించడానికి సిద్ధమైంది. కారు డిజైన్ నుంచి ఇంజిన్ గేర్ బాక్స్ వరకు స్కోడా చేసిన మార్పులు వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భారతీయ మార్కెట్లో స్కోడా కుషాక్ కారుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ కారును మరింత స్టైలిష్‌గా, అత్యాధునిక ఫీచర్లతో స్కోడా రీ-లాంచ్ చేసింది. ముఖ్యంగా బాహ్య రూపంలో (Exterior) కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

కొత్త బంపర్, ఆకర్షణీయమైన గ్రిల్, కోడియాక్ కారును గుర్తుకు తెచ్చేలా రూపొందించిన ఎల్ఈడి ఇన్సర్ట్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. 17 అంగుళాల కొత్త అలాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి లైట్ బార్ ఈ కారుకు ఒక స్పోర్టీ అప్పీరన్స్‌ను జోడిస్తున్నాయి.
ఈ కొత్త కుషాక్ కారులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇంటీరియర్ గురించి. ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వెనుక సీటు ప్రయాణికుల కోసం మసాజ్ ఫీచర్‌ను స్కోడా పరిచయం చేసింది. లాంగ్ జర్నీల్లో ప్రయాణికులు అలసిపోకుండా ఉండటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

మరో విశేషమేమిటంటే.. ఈ కారు బేస్ వేరియంట్‌లోనే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఇక టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణ అనుభూతిని మరింత లగ్జరీగా మారుస్తుంది. టెక్నాలజీ విషయానికి వస్తే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
డ్రైవర్ సౌకర్యం కోసం 6 రకాలుగా అడ్జస్ట్ చేసుకోగలిగే వెంటిలేటెడ్ లెదర్ సీట్లు కూడా ఉన్నాయి. భద్రతలోనూ స్కోడా ఎక్కడా రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఇతర అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

ఇంజిన్ విషయానికి వస్తే, పాత 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగిస్తున్నారు. అయితే, గేర్ బాక్స్ విషయంలో ఒక కొత్త అప్‌డేట్ ఇచ్చారు. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్జీతో పాటు, ఇప్పుడు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ను కూడా పరిచయం చేశారు. దీనివల్ల డ్రైవింగ్ మరింత స్మూత్‌గా ఉండటమే కాకుండా ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతుంది. 1.5 లీటర్ ఇంజిన్ వేరియంట్లకు ఇప్పుడు నాలుగు చక్రాలకూ డిస్క్ బ్రేకులు (All-wheel discs) అందించారు.
స్కోడా తన సిగ్నేచర్ వేరియంట్ అయిన మాంటే కార్లో (Monte Carlo) ఎడిషన్‌ను కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లోనే అందుబాటులోకి తెచ్చింది. ఇది రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ ఫినిషింగ్ బాడీ పార్ట్స్, డ్యూయల్ టోన్ పెయింట్‌తో మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. మధ్యతరగతి, ప్రీమియం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కారు, మార్కెట్లో గట్టి పోటీనిస్తుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








