ఇంత మంచి కారును పట్టించుకోవడం లేదు.. పైగా బ్రెజ్జా కంటే తక్కువ ధరకే.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్!

భారతీయ మార్కెట్లో ప్రీమియం కార్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) తన ప్రత్యేక డిజైన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన డ్రైవింగ్ అనుభవంతో కస్టమర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో స్కోడా కైలాక్ (Skoda Kylaq) కూడా మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి స్పందనను దక్కించుకుని కంపెనీ అమ్మకాలలో కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మోడల్‌కు గతంతో పోలిస్తే డిమాండ్ కొంత మేర తగ్గినట్లు తెలుస్తోంది. స్కోడా కైలాక్ మే 2026 నెలలో మొత్తం 3,443 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

సంఖ్య పరంగా చూస్తే మంచి స్థాయిలోనే ఉన్నప్పటికీ, గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోల్చితే గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. మే 2025లో ఇది 4,949 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, ఈసారి అమ్మకాలు 1,500 యూనిట్లకు పైగా తగ్గాయి. శాతం పరంగా లెక్కిస్తే దాదాపు 30 శాతం క్షీణత నమోదైంది. దీంతో మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ గతంలో ఉన్నంత బలంగా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Skoda Kylaq May 2026 Sales Recorded 30 Percent Down Compared To Previous

అయితే ఈ తగ్గుదల వెనుక అనేక కారణాలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా పెరిగింది. ప్రతి కంపెనీ కొత్త మోడళ్లను, ఆకర్షణీయమైన ఫీచర్లను, ప్రత్యేక ఆఫర్లను తీసుకురావడంతో కస్టమర్లకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఒకే మోడల్‌పై ఆధారపడకుండా వినియోగదారులు ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే రానున్న పండగల సీజన్‌లో సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

డిజైన్ విషయానికి వస్తే, స్కోడా కైలాక్ తొలి చూపులోనే ప్రీమియం ఎస్‌యూవీగా ఆకట్టుకుంటుంది. కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, మస్కులర్ బంపర్ దీనికి స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, బలమైన క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన టెయిల్‌గేట్ డిజైన్ కైలాక్‌ను మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.

Skoda Kylaq May 2026 Sales Recorded 30 Percent Down Compared To Previous

]కైలాక్ భారత మార్కెట్లో రూ.7.59 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. ఇది బ్రెజ్జా కంటే తక్కువ ధర. పనితీరు పరంగా స్కోడా కైలాక్‌లో 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 115 bhp శక్తిని, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో నగర రోడ్లపై ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడంతో పాటు హైవేలపై కూడా ఉత్సాహభరితమైన పనితీరును అందిస్తుంది.

ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది. మైలేజ్ విషయంలో కైలాక్ నిరాశపరచదు. మాన్యువల్ వెర్షన్ లీటరుకు 19.68 కిలోమీటర్ల వరకు, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 19.05 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీంతో పనితీరు, ఇంధన పొదుపు మధ్య మంచి సమతుల్యతను ఈ SUV అందిస్తుందని చెప్పవచ్చు. రోజువారీ వినియోగంతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

Skoda Kylaq May 2026 Sales Recorded 30 Percent Down Compared To Previous

భద్రత విషయానికి వస్తే, స్కోడా కైలాక్ తన సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం ద్వారా ఈ SUV తన బలమైన నిర్మాణాన్ని నిరూపించింది. పెద్దల రక్షణతో పాటు పిల్లల భద్రత విషయంలో కూడా అత్యుత్తమ స్కోర్లు సాధించడం విశేషం. అత్యాధునిక భద్రతా ఫీచర్లు, బలమైన బాడీ స్ట్రక్చర్ కారణంగా కైలాక్ కుటుంబాలకు మరింత విశ్వాసాన్ని కలిగిస్తోంది.

Article Published On: Friday, June 12, 2026, 18:15 [IST]
English summary
Skoda kylaq may 2026 sales recorded 30 percent down compared to previous
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+